Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెరపై జయసుధ… తెర వెనుక జానకి… ఆ పాటలో రాగయుక్తంగా నవ్వులు…

August 23, 2024 by M S R

కన్నాంబ , సావిత్రి , వాణిశ్రీల తర్వాత ఎలాంటి పాత్రలనయినా , ముఖ్యంగా విషాద పాత్రలను , అవలీలగా వేయగల స్థాయికి జయసుధను తీసుకొనివెళ్ళిన సినిమా 1976 లో వచ్చిన ఈ జ్యోతి సినిమా . పండంటి కాపురం సినిమాతో అరంగేట్రం చేసిన జయసుధ లక్ష్మణరేఖ సినిమాలో రెబల్ రోల్ , సోగ్గాడు సినిమాలో చలాకీ రోల్ వేసి ఈ జ్యోతి సినిమాలో అల్లరి పిల్లగా , ఆ తర్వాత ఓ ముసలివాడి భార్యగా బరువైన పాత్రలో నటించి శభాష్ అనిపించుకుంది .

ఆ తర్వాత అభినందించాల్సింది దర్శకేంద్రుడు రాఘవేంద్రుడినే . బొడ్ల మీద ఫలపుష్పాలు వేయటమే కాదు ; తక్కువ బడ్జెటుతో , బ్లాక్ & వైటులో బరువైన సినిమాలను , అన్నమయ్య , రామదాసు వంటి భక్తిరస సినిమాలను కూడా తీయగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు . తండి కె యస్ ప్రకాశరావుకు తగ్గ తనయుడిగా పేరు గడించారు .

ఆ తర్వాత నిర్మాత క్రాంతికుమార్ . శారద , ఊర్వశి వంటి మంచి సినిమాలను నిర్మించి ఓ ఇమేజిని సాధించుకున్నారు . మూడవ సినిమాగా ఈ జ్యోతి . కుటుంబమంతా కలిసి చూడగల సినిమాలను నిర్మించారు , దర్శకత్వం వహించారు .

Ads

ప్రముఖ రచయిత్రి సి ఆనందారామం వ్రాసిన మమతల కోవెల అనే నవల ఆధారంగా ఈ జ్యోతి సినిమా తీయబడింది . టైటిల్ మమతల కోవెల అని కాకుండా జ్యోతి అని పెట్టుకోవటంలోనే ఈ సినిమా టైటిల్ కేచీ అయింది , పాపులర్ అయింది .

ఈ సినిమా ద్వారా ఒక సంభాషణల రచయితకు కూడా మలుపు వచ్చింది . అది సత్యానంద్ . ఈ సినిమాతోనే బ్రేక్ వచ్చిందని చెప్పుకోవచ్చు . ఎన్నో సినిమాలకు మాటలు వ్రాశారు. ఇలా ఎంతో మందికి మలుపును ఇచ్చింది ఈ జ్యోతి సినిమా .

చక్రవర్తి సంగీత దర్శకత్వంలో సినిమాలో ఉన్న నాలుగు పాటలూ హిట్టయ్యాయి . సిరిమల్లె పువ్వల్లె నవ్వు , నీకూ నాకూ పెళ్ళంట , ఏడుకొండలపైన ఏల వెలిశావు , ఫస్ట్ టైం ఇది నీకు పాటలన్నీ హిట్టయ్యాయి . అన్ని పాటల్నీ ఆత్రేయే వ్రాసారు . (ప్రత్యేకించి సిరిమల్లె పువ్వల్లె నవ్వు పాట హైలైట్… రాగయుక్తంగా నవ్వుతూ జానకి ఈ పాటకు కొత్త స్వరపరిమళాన్ని అద్దింది… పాటలో అధికంగా జానకి నవ్వులు, ఆలాపన మాత్రమే ఉంటాయి… ఎస్పీ బాలు సరేసరి…)

మురళీమోహన్ , గుమ్మడి , సత్యనారాయణ , శుభ , కృష్ణకుమారి , ఫటాఫట్ జయలక్ష్మి , ఛాయాదేవి , గిరిబాబు , రావు గోపాలరావు ప్రభృతులు నటించారు . శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఓ చిన్న పాత్రలో తళుక్కుమన్నారు . జయసుధ తర్వాత చెప్పుకోవలసింది గుమ్మడి , సత్యనారాయణ , రావు గోపాలరావులే . ముగ్గురూ అద్భుతంగా నటించారు . జయసుధకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది . గుమ్మడికి ప్రత్యేక అవార్డు కూడా ఫిలిం ఫేర్ నుండి వచ్చింది .

నాకెంతో ఇష్టమైన సినిమా ఈ జ్యోతి . యూట్యూబులో ఉంది . తప్పక చూడవలసిన సినిమా . ముఖ్యంగా జయసుధ అభిమానులు మిస్ కాకండి . చిన్న వయసులో ఇంత బరువైన పాత్ర వేసి మెప్పించటం గొప్ప విషయమే . దేవదాసు సినిమాలో ముసలి వాడిని పెళ్లి చేసుకున్న పార్వతి పాత్రలో నటించి మెప్పించిన సావిత్రి కూడా అప్పుడు చిన్న వయసుదే . అందుకే నా అభిప్రాయం కన్నాంబ , సావిత్రి , వాణిశ్రీల తర్వాత జయసుధే అని .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు      (దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెట్రో విస్తరణపై కేసీయార్ స్క్రిప్టు – రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు..!!
  • భలేవారే, యాంగ్రీ రాజశేఖర్‌ సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలూ చేయగలడు తెలుసా..!!
  • భారత్ భాగ్య విధాత … ఫ్లాప్ … కంగనాపై నెగెటివిటీ తగ్గలేదు ప్రేక్షకుల్లో …
  • వైభవ్..! ఈ పేరంటేనే ఓ సంచలనం..! నడిసంద్రంలో కూడా..!!
  • శాంతి ఒప్పందం- యుద్ధవిరమణ… నో, మూడు దేశాల దోబూచులాట…
  • దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…
  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions