Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వేణు ఊడుగుల – మరో కొత్త ఆలోచనాత్మక సినిమాకు శ్రీకారం !

September 4, 2026 by M S R

.

వేణు ఊడుగుల… మనకున్న ఆలోచనాత్మక దర్శకుల్లో ఒకరు… తను తీయబోతున్న ఓ కొత్త సినిమా గురించి వినిపించే విశేషాలు ఆసక్తికరం అనిపిస్తున్నాయి… తన క్రియేటివ్ ధోరణుల మీద పెద్దగా అభ్యంతరాలు ఏమీ ఉండవు ఎవరికైనా… కానీ ఏ ఒత్తిళ్లో లేక తన ఆలోచనల్లో క్లారిటీ లేకపోవడం వల్లో గానీ విరాటపర్వం  బాగా నిరాశపరిచింది…

కథానాయిక సాయిపల్లవి కేరక్టరైజేషన్ దెబ్బతీసింది… ఆ పాత్ర మానసిక ధోరణికి సరైన జస్టిఫికేషన్ లేదు… పైగా ఆ కథానాయిక పాత్ర గురించి తెలిసిన పాతతరం జర్నలిస్టులకైతే ఈ కథ అస్సలు జీర్ణం కాలేదు… బట్, కొన్ని సీన్లు బాగా తీశాడు… అసలే సాయిపల్లవి, పైగా మంచి ఎమోషనల్ సీన్లు… కానీ అవేవీ సినిమాను గట్టెక్కించలేదు, ఎక్కించవు కూడా…

Ads

తన సినిమా కెరీర్ చాలా చిన్నది… అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం, 2011లో ‘జై బోలో తెలంగాణ’ సినిమాకు రచయిత తను… తరువాత ఏడేళ్లకు అంటే 2018లో నీదీ నాదీ ఒకే కథ సినిమాతో వేణు దర్శకుడిగా తన సత్తాను చూపించుకోగలిగాడు… దానికి కథా రచయిత, మాటల రచయిత, స్క్రీన్ ప్లే రచయిత కూడా తనే…

విరాటపర్వం గురించి చెప్పేసుకున్నాం… మంచి టేకింగ్ ఉన్నా సరే అదెక్కడ దెబ్బతిన్నదో కూడా తెలుసుకున్నాం… తను అంగీకరించకపోవచ్చుగాక… తరువాత గత ఏడాది రాజు వెడ్స్ రాంబాయి సినిమాను నిర్మించాడు… ఇప్పుడు ఓ కొత్త కథతో ముందుకొస్తున్నాడు… అది నవలాచిత్రం… పేరు జిగిరి…

jigiri

ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ప్రసిద్ధ నవల ఇది… ఊడుగుల వేణు వంటి ఆలోచనాత్మక దర్శకుడికి సరైన ఎంపిక… ఇందులో సంచార జాతుల జీవన విధానం, మనిషికి మూగజీవానికి మధ్య ఉండే అనుబంధం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది…

నవల ప్రధాన పాత్రలు: షాదుల్: ఒక గుడ్డెలుగు (ఎలుగుబంటి)

ఇమామ్: ఎలుగును ఆడించే సంచార జీవి

బీబమ్మ: ఇమామ్ భార్య

చాంద్: ఇమామ్, బీబమ్మల కొడుకు

కథాంశం- విశేషాలు:  అనుబంధం: ఇమామ్‌కు, ఎలుగుబంటి (షాదుల్) మధ్య ఉండే విడదీయరాని స్నేహం, అత్యున్నత స్థాయి ప్రేమానుబంధమే ఈ నవలకు ప్రధాన ఇరుసు.

జీవిత సంఘర్షణ: జంతువులను ఆడించడం చట్టవిరుద్ధం కావడంతో సమాజం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి ఇమామ్‌కు ఎదురయ్యే ఒత్తిళ్లు, సంచార జాతుల కష్టాలను రచయిత కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు ఇందులో.

ముగింపు: కుటుంబ సభ్యుల ఒత్తిడిని తట్టుకోలేక ఇమామ్ ఎలుగుబంటిని తీసుకుని అడవికి వెళ్లిపోవడం, తిరిగి రాకపోవడంతో కథ చాలా ఆర్ద్రంగా ముగుస్తుంది.

ప్రాముఖ్యత: మానవీయ విలువలు, మనిషిలోని స్వార్థం, అభివృద్ధి పేరుతో జంతువులపై, ప్రకృతిపై జరిగే ప్రభావాలను ఈ నవల అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లోకి కూడా ఇది అనువదించబడింది…

ఐతే నవలను సినిమాకరించడం పెద్ద టాస్క్… క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకుని మార్పులు చేస్తారేమో… గుడ్, ఆల్ ది బెస్ట్… అన్నట్టు… ఈ నవల ఉస్మానియా యూనివర్శిటీ పీడీసీ రెండో సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకంగా ఈ నవల ఎంపికైంది..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వేణు ఊడుగుల – మరో కొత్త ఆలోచనాత్మక సినిమాకు శ్రీకారం !
  • ఏదీ వదలడు- పుల్ల ఐస్ కూడా అమ్మగలడు… కానీ దానికీ ఓ లెక్కుంది !!
  • మంధానా ! ఈ పేరులోనే ఏదో వైబ్ ! ఇద్దరూ ఇద్దరే… నేషనల్ క్రష్ !!
  • Konda Family – ప్రస్తుతానికి ఎటూ వెళ్లే దారి లేదు! ప్లాన్-బి సస్పెన్స్ !!
  • మరేమనుకున్నారు? చేతికీ పగలుంటాయి! దిక్కుమాలిన ఫాంటసీ!!
  • గణితంలో తిర్యగ్రేఖ – రాజకీయ గణితంలో కొండా సురేఖ !!
  • అన్నీ మంచి శకునములే ! తలనొప్పులూ తలెత్తుకునేలా చేశాయి !!
  • ఆసక్తికరమైన ఆట – ఆటగాడు కూడా రెడీ – సిద్ధంగా లేని పిచ్…
  • ఆ లేఖలో బ్లాస్టింగ్ అంశాలు అన్నారు కదా- పేలవంగా తేలిపోయింది!
  • ఒక బీసీ మహిళ ఔట్… బదులుగా ముగ్గురు బీసీ మహిళలకు పోస్టులు

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions