Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘నాకు మీ సభ ఇష్టం లేదు’’ – మోహన్ భగవత్ Vs జోహ్రాన్ మామ్దానీ

August 27, 2026 by M S R

.

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ … తన చేష్టల ద్వారా పాకిస్థాన్ అనుకూలుడిగా, భారత వ్యతిరేకిగా ముద్రపడిన కేరక్టర్… పైకి డెమోక్రటిక్ సోషలిస్ట్ రాజకీయ ధోరణి అనిపించినా, తన వ్యవహార ధోరణి మాత్రం భారత వ్యతిరేకతే అంటుంటారు…

  • గుర్తుంది కదా, తెలంగాణ సీఎం రేవంత్  రెడ్డి అమెరికా పర్యటనలో ఈ మామ్దానీతో భేటీ కాబోతున్నాడు, ఈ భారత వ్యతిరేకితో ఒక రాష్ట్ర సీఎం భేటీ వేయడం ఏమిటి… పైగా మామ్దానీ వెనుక జార్జ్ సోరోస్ ఉన్నాడు, డీప్ స్టేట్ ఉంది అని బీజేపీ విమర్శలు చేసింది, కేంద్ర ప్రభుత్వం రేవంత్ అమెరికా పర్యటనకు క్లియరెన్స్ కూడా ఇవ్వలేదు… నిజంగా మామ్దానీతో భేటీ ప్లాన్‌లో ఉందా..? కలిస్తే తప్పేమిటి..? అనే డిబేట్ కాస్త పక్కన పెడితే…

తన రీసెంట్ వ్యాఖ్యలు తనపై ఉన్న పాకిస్థానీ అనుకూల ముద్రకు భిన్నంగా ఉన్నాయి… దాని నేపథ్యం ఏమిటంటే..? ఆర్ఎస్ఎస్ “శతాబ్ది ఉత్సవాల గ్లోబల్ అవుట్‌రీచ్ కార్యక్ర మంలో భాగంగా సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ చేపట్టిన అమెరికా పర్యటన… ఆయన అమెరికాతోపాటు కెనడా, బ్రిటన్‌లలో కూడా పర్యటించనున్నాడు…

Ads

ఈ నెల 29న న్యూయార్క్‌లోని ప్రఖ్యాత ‘మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ ‘ వేదికగా జరగనున్న ‘యూనివర్సల్ వన్నెస్’ భారీ సభలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తాడు… ఇంకేం..? న్యూయార్క్ వేదికగా పనిచేసే పలు హిందూ వ్యతిరేక ఆర్గనైజేషన్లు గాయిగత్తర మొదలుపెట్టాయి…

  • ఈ సభను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ  ‘హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్’, ‘ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్’, ‘ఇంటర్ ఫెయిత్ సెంటర్ ఆఫ్ న్యూయార్క్’ వంటి పలు సంస్థలు న్యూయార్క్ నగర ప్రభుత్వ ప్రధాన కార్యాలయమైన సిటీ హాల్ వెలుపల సంయుక్తంగా నిరసన ప్రదర్శనలు, ప్రెస్ మీట్ చేపట్టాయి. సభ అనుమతులను వెంటనే రద్దు చేయాలని మ్యాడిసన్ స్క్వేర్ యాజమాన్యాన్ని కోరాయి.

సభ నిర్వాహక సంస్థ ‘అహెడ్ ఫోరమ్’ సోషల్ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది. తమ ‘యూనివర్సల్ వన్నెస్’ వేడుక ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే విశ్వజనీన సందేశాన్ని చాటడానికే అని చెప్పింది… ఈ సభను రద్దు చేసే అవకాశం ఉందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ స్పందన ఏమిటంటే..?

“నేను ఈ కార్యక్రమాన్ని సమర్థించను. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్ . దీన్ని రద్దు చేసే అధికార పరిధి న్యూయార్క్ నగర ప్రభుత్వానికి ఉందో లేదో కూడా నాకు స్పష్టత లేదు” అంటూనే నగర చరిత్రలో తొలి భారతీయ -అమెరికన్ మేయర్‌గా తన కుటుంబ నేపథ్యాన్ని గుర్తుచేసుకున్నాడు…

  • ‘‘నా తల్లి కుటుంబం ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది. భారత్ అన్ని వర్గాల ప్రజలను సమానంగా ఆదరించే లౌకిక, బహుళ సంస్కృతులు ఉన్న గొప్ప దేశం. మతం, కులం, వర్ణం, ప్రాంతం అనే తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలని… ప్రజల మధ్య విభజన తెచ్చే సిద్ధాంతాలను, కార్యక్రమాలను ఒక మేయర్‌గా, భారతీయ అమెరికన్ గా నేను వ్యతిరేకిస్తున్నాను’’

అందరినీ ఆదరించే ఓ లౌకిక, బహుళ సంస్క‌ృతుల ఇండియాను వ్యతిరేకిస్తూ, మతదేశం పాకిస్థాన్‌ను ఎందుకు ప్రేమిస్తున్నట్టు మరి..? అసలు ఎవరు ఈ మామ్దానీ (Zohran Mamdani)..? తన నేపథ్యం ఏమిటి..?

  • తండ్రి మహమూద్ మామ్దానీ (Mahmood Mamdani) – ప్రసిద్ధ ఆఫ్రికన్ రాజకీయ పండితుడు, కొలంబియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్… తల్లి మీరా నాయర్ (Mira Nair) – అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ చలనచిత్ర దర్శకురాలు (ఫిల్మ్ మేకర్)… మరి వీళ్లెలా కలిశారు..?

మహమూద్ మామ్దానీ ముంబైలో ఓ ఇండియన్- ఉగాండా (East African Indian diaspora) కుటుంబంలో పుట్టాడు… మీరా నాయర్‌ది ఒరిస్సాలోని రూర్కెలా… ఈమె తన సినిమాల పరిశోధనలో భాగంగా (ముఖ్యంగా ఆఫ్రికా నేపథ్యంలో సాగే ‘మిస్సిస్సెస్ మిస్సాలా’ తదితర ప్రాజెక్ట్‌ల సమయంలో) ఆఫ్రికన్ రాజకీయాలు, వలసవాదంపై అధ్యయనం చేస్తున్న కాలంలో వీరి పరిచయం ఏర్పడింది…

ఇద్దరూ మేధోపరమైన వాతావరణం, కళలు, సామాజిక అంశాలు, గ్లోబల్ దృక్పథం కలిగిన వ్యక్తులు కావడంతో శృతి కలిసి… మతాలు వేరైనా 1991లో వివాహం చేసుకున్నారు… మేయర్ మామ్దానీలో మాత్రం ఈ గ్లోబల్ దృక్పథం కనిపించదు… పైకి మాటల్లో మాత్రం ఇండియా లౌకిక దేశం, బహుళ సంస్క‌ృతులకు చిరునామా అని పెద్ద పెద్ద మాటలు చెబుతాడు… అదీ సంగతి !!

ఆయన భార్య పేరు రమా దువాజి… హిందూ పేరులా ధ్వనించినా ఆమె తల్లిదండ్రులు సిరియన్ ముస్లింలు… అన్నట్టు చెప్పనే లేదు కదూ… కేఏ పాల్ ఏమంటున్నాడంటే..? ‘‘భగవత్ వీసా రద్దు చేయాలని అక్కడి క్రైస్తవ, ముస్లిం, సిక్కు మతసంఘాలు ట్రంపును కోరాయి, ఈ వీసాల రద్దు వ్యవహారాలు చూసే ఓ ఉన్నతాధికారి నాకు ఫోన్ చేసి, ఏం చేయమంటారు అనడిగాడు… నో, నో, రద్దు చేయకండి, ఈయన పర్యటన వీసా రద్దు చేస్తే, ఇక రాను రాను ఇతర మత పర్యటనలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది అని చెప్పాను… దాంతో వీసా రద్దు ఆగిపోయింది’’

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘నాకు మీ సభ ఇష్టం లేదు’’ – మోహన్ భగవత్ Vs జోహ్రాన్ మామ్దానీ
  • ప్లాన్-ఏ అయిపోయిందట – ప్లాన్-బీ ఉందట – ఐతే ఇదంతా పెద్ద ప్లానే !!
  • తొలి వికెట్ – ఐనా బ్లాంక్ ఫేస్! సారాంశ్ జైన్‌ ఎందుకంత ఉద్వేగరహితుడు ?
  • నో, నో – ఆ కోర్టు ఆర్డర్లు టాక్సిక్ రివ్యూలను అడ్డుకోలేవు… ఇదీ క్లారిటీ !!
  • ఆ పాటలోని తాత్వికత, వైరాగ్యం… సినారె, వేటూరి పట్టుకోగలిగారా ?!
  • డెడ్లీ కాంబో ! *ఆపరేషన్ గ్రేటర్ బంగ్లాదేశ్* కుట్ర విచ్ఛిన్నం !!
  • Nakshatra – ఈ మణెమ్మను అలా స్వచ్ఛంగా ఉండనివ్వండర్రా…
  • అప్పట్లోనే రాఘవేంద్రరావు కంట్రాక్టు పెళ్లిని చూపించాడు !!
  • వెకిలి రాఖీ యాడ్‌ను నగల కంపెనీ తీసేసింది ! ఎవరి పరువు పోయింది ?!
  • మతం మా విశ్వాసం – ఓనం మా సంస్కృతి – కేరళ కొత్త తరం అభిమతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions