Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొత్త క గుణింతం… కొత్త కథలు లేవా, పాత పచ్చడికే కొత్త తాళింపేద్దాం…

November 8, 2024 by M S R

క… కకు దీర్ఘమిస్తే కా… కకు గుడిస్తే కి… కకు కొమ్ము పెడితే కు… కై, కౌ, కం, కః …. కానీ ఇండస్ట్రీలో క గుణింతం వేరే… కొత్త క గుణింతం… పదండి చిన్నయసూరిని పలకరిద్దాం ఓసారి…



క్తైం థ్రిల్లర్ సినిమా చేయాలనుకుంటున్నారా…. ఐతే అస్సలు కష్టపడాల్సిన పనిలేదు తెలుసా…?

అయ్యో అదేంటి అలా అనేశారు? ఎంతో కష్టం, నేరస్థులు దొరికిపోతారు… టెక్నాలజీ, ఇంటర్నెట్, సీసీ కెమెరా సర్వేలెన్స్, కొత్తకొత్త ఇన్వస్టిగేటివ్ పద్ధతులు, అన్నిటికీ మించి గూగుల్ నిఘా వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నుండి నేరగాళ్లను తప్పింపచేసి కథాకథనాన్ని నడిపించాలంటే ఒక కథకునిగా ఎంత సైన్స్ టెక్నాలజీ నాలెడ్జి, అన్నిటికీ మించి క్రిమినాలజీలో లేటెస్ట్ అప్‌డేట్స్ ఉండాలా అక్కర్లేదా….? భలే చెప్తారండీ…..!!!

Ads

అక్కర్లేదండి- మీరు చెప్తున్నవి ఏవీ రానవసరం లేదు. సింపుల్ గా కథని 60, 70, 80 నేపథ్యంలో పెట్టి రాసుకోండి…. ఎక్కువ మాట్లాడితే పోలీసు వ్యవస్థ కూడా కథలో పెట్టనవసరం లేదు…

అంతే అంటారా…!!!

అంతే… ప్రేక్షకుల అంతే…..!!!

గత నాలుగైదు సంవత్సరాల్లో విడుదలైన చాలా సినిమాలు కథకుల, డైరెక్టర్ల సౌలభ్యార్థం అరవై డెబ్బై ఎనభై దశకాలకు తీసుకుపోయి రాసుకున్నవే…. ఇంకా ఎక్కువ మాట్లాడితే స్వాతంత్ర్యం ముందుకి కూడా తీసుకుపోయి అదొక ‘పీరియడ్ డ్రామా’ రంగు పులిమి ప్రేక్షకుల మీదికి వదలడమే… పుష్ప మొదలుకుని నిన్నటి క వరకూ అన్నీ అవే బాపతు…

రైటింగ్ లో బుర్రపెట్టనవసరంలేదు, టెక్నాలజీ గురించిన కంగారు పడనవసరం లేదు, ఆర్టు డైరెక్టర్ సగం పని చేసేస్తాడు… దట్సాల్…!!!

నిన్నటి ‘క’ గురించి మాట్లాడుకుందాం… చూసిన సగం జనాలు ఓహోహో… అబ్బబ్బ అంటున్నారు, కలెక్షన్లు కూడా బ్రేక్‌ఈవెన్ ఎప్పుడో దాటేశాయి… జనాలకి ఎందుకు నచ్చిందయ్యా అనేది పక్కన పెట్టి, పైన మాట్లాడుకున్న ఫ్రేం లోంచి చూద్దాం…

ఒక ఊరిలో ఒక హీరోలాంటి యువకుడు. అన్ని ఫార్ములా సినిమాల్లాగానే అనామకుడు, అమాయకుడు, మంచివాడు. అన్యాయాన్ని ఆపే ధీరుడు. ఆ ఊరిలో అమాయక ఆడపిల్లలు మాయం అవుతుంటారు. దానిని ఛేదించే పనిలో మన హీరోగారు పడతారు.

ఇప్పుడు ఫ్రేంలోకి వద్దాం…

పాయింట్ నెంబర్ వన్- క్రైం స్టోరీ కాబట్టి ఇన్వెస్టిగేషన్ లో పోలీసు వ్యవస్థ ఉండీ లేనట్లు ఉండాలి- ఓకే… సరే…!
రెండు- టెక్నాలజీతో పనిపెట్టుకోకూడదు- సరే, లేదు. కథని యాభై ఏళ్ళకి తోసేద్దాం.
మూడు- ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్, కథనానికి కనెక్ట్ చేసే థ్రెడ్/ మీడియం కావాలి – సరే, ఆరోజుల్లో కమ్యునికేషన్‌ ఉత్తరాలు కాబట్టి అదే పెట్టుకుందాం. డన్…!
నాలుగు- అమ్మాయిలను ఎత్తుకుపోవడం, దొంగల్ని హీరో పట్టుకోడం రొటీన్ కాబట్టి, కొద్దిగా వేరే మసాలా వెయ్యాలి….. – వేసేద్దాం, రకరకాల సస్పెన్స్ పెడదాం…సరిపోకపోతే, హిందూయిజం కలిపేద్దాం-
అది బెస్ట్… ఎవడూ గొడవకి రాడు…!

ఐదు- రొటీన్ కంపు కొట్టకుండా చింతకాయ తొక్కుకి తాళింపు వేయాలి- ఓ…ఎస్, వేసేద్దాం. వీజీగా ఉండేది వేసేద్దాం… ఒక రూంలో, ఒక సెటప్ లో ఇద్దరు ఆర్టిస్టులతో చేసేద్దాం.
సరిపోదు…ఇంకా ఏదో చెయ్యాలి

ఆరు- మన ప్రేక్షకులకు క్లైమాక్స్ హంగామా కావాలి- చేసేద్దాం, భారీగా కనపడేలా ఫైట్స్ కూడా ఉండేలా ప్లాన్ చేద్దాము.

ఏడు-
ఆగండి ఆగండి… ఆరు పాయింట్స్ చాలండి సినిమా ఆడటానికి….
ఐతే ఓకే…!!
సినిమా ఐపోయింది. మొత్తం తీసేశారు. ఫస్ట్ కాపీ చూసుకుంటున్నారు కథకుడు, దర్శకుడు, హీరో… ఏదో మిస్సయింది అని బాగా అర్థమైంది.

కథకుడు+ దర్శకుడు + హీరో రిపేర్ సిట్టింగ్ లో కూర్చుని వంట చేస్తున్నారు ( కథని వండుతున్నారు)

హీరో: నా ఎలివేషన్లు ఇంకా ఎక్కువ ఉండాలి.
కథక్‌: ఇంకా ఎక్కువ పెడితే మొత్తం స్క్రీన్ స్పేస్ మీరే ఉంటారు బాబూ…
దర్శక్: ఒవర్‌డోస్ అవ్వీ అవ్వనట్లు గా చెయ్యాలి.

కథక్‌: డ్రమటిక్ గా ఏదైనా పెడదాం…
దర్శక్: గుండెలు పిండేసే తమిళ పైత్యం పెడదాం
హీరో: పెట్టండి పెట్టండి… నా నటవిశ్వరూపం చూపించాలి…

కథక్‌: అవిడియా….! ఒక మిథికల్ కారెక్టర్‌ పెట్టి కొంత డ్రామా పెడదాం…
దర్శక్: తమిళంలో వచ్చే మోనో ఆక్షన్ లాగా పెడదాం…
హీరో: పెట్టండి పెట్టండి… ఆ పాత్ర కూడా నాకే పెట్టండి. నా నటవిశ్వరూపం చూపించాలి…

కథక్‌: డబుల్ డోసు అవ్వదు కదా…
దర్శక్: డబుల్ ఆక్షన్ పెట్టం కదా…
హీరో: పెట్టండి పెట్టండి… నా నటవిశ్వరూపం చూపించాలి… డబుల్‌ యాక్షన్ నేను చెయ్యాలి.

కథక్‌: డ్రమటిక్ గా ఉండాలి. బాబు డబుల్‌ రోల్ అని జనాలకు తెలియకుండా జాగ్రత్తపడాలి…
దర్శక్: తమిళ పైత్యం పెడదాం… మొకానికి మాస్క్ వేసి నడుపుదాం. అప్పుడు యాక్టింగ్ గోల ఉండదు.
హీరో: పెట్టండి పెట్టండి… నా నటవిశ్వరూపం చూపించాలి… మాస్కులో కూడా…

కథక్‌: సరే… ఒక రూంలో మొత్తం నడిపేద్దాం. పేగులు తెగే పేగు బంధాన్ని యాడ్ చేద్దాం. కర్మ సిద్ధాంతాన్ని జోడించి, మెలోడ్రామాలో దట్టిద్దాం…
దర్శక్: అదే బెస్టు… ప్యాచ్ వర్క్ చాలా వీజీగా ఐపోతుంది. ఏదైనా మిగిలితే గ్రాఫిక్స్ లో వేసేద్దాం… గుండెలు పిండేసే తమిళ పైత్యం వచ్చేసినట్లే…!
హీరో: పెట్టండి పెట్టండి… నా గ్రాఫిక్స్ లో కూడా నటవిశ్వరూపం చూపించాలి…

కథక్‌: డ్రమటిక్ గా మైమ్ సెటప్ లో ‘కర్మ’ అనే కారెక్టర్ ఎంటర్ అవుతుంది… అసలు హీరో ఇదంతా ఎందుకు చేశాడు అని ఇంటరాగేట్ చేస్తుంది. అక్కడి నుండి కథ మొదలై అక్కడికే వచ్చి ముగిసిపోతుంది…
దర్శక్: సూపర్బ్…. మైమ్ లో కర్మ కారెక్టర్ పెట్టేద్దాం. బాబుకి నటన గోల ఉండదు. డబుల్ యాక్షన్ ఫీలింగూ వస్తుంది… వెరసి గుండెలు పిండేసే తమిళ పైత్యం వస్తుంది….!
హీరో: పెట్టండి పెట్టండి… నా నటవిశ్వరూపం చూపించాలి. మాస్క్ లో…!

హమ్మయ్యా… ఇంక ప్రేక్షకుల మీదికి వదులుదాం.!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మోడీజీ… అన్నీ బాగానే చెప్పావు… కానీ ఆ ఒక్క ప్రశ్నకు జవాబు..?!
  • ఆ భూకంపాలు ప్రకృతి కోపమా..? అణ్వస్త్ర గోదాముకు పడిన తూట్లా..?!
  • నీకోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో… ఇదో వింత కథ…
  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions