Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కుంతీకర్ణులు… భిన్నమైన స్టోరీ లైన్‌… కృష్ణంరాజు రెబల్ స్టార్‌గా సెటిల్డ్..!!

October 13, 2024 by M S R

A pucca commercial entertainer . బంగారు తల్లి సినిమాతో రెబల్ హీరోగా చేసిన ప్రయత్నం ఈ సినిమాతో పక్కా అయిపోయింది కృష్ణంరాజుకి . 1978 లో వచ్చిన ఈ కటకటాల రుద్రయ్య సినిమాలో కూడా బంగారు తల్లిలోలాగా జమున , కృష్ణంరాజులు తల్లీకొడుకులే . అయితే కృష్ణంరాజు ఈ సినిమాలో కుప్ప తొట్టి కుంతీపుత్రుడు . క్లైమాక్సులో NTR , హేమలతల కుంతీ కర్ణుల సంవాదాన్ని కూడా చూపుతారు దర్శకులు దాసరి నారాయణ రావు .

18 లక్షల బడ్జెటుతో తీస్తే 75 లక్షలు వసూలు అయిందట . కృష్ణ కాల్షీట్లు కూడా ఇచ్చాక , ఆయనకు వేరే సినిమా రావటంతో కృష్ణంరాజుని తీసుకున్నారు . కృష్ణంరాజుకు మంచి అవకాశం వచ్చింది . 26 సెంటర్లలో 50 రోజులు , ఎనిమిది సెంటర్లలో వంద రోజులు ఆడింది . తర్వాత కాలంలో ఈ సినిమాను దాసరే జ్యోతి బనే జ్వాలా అనే టైటిలుతో హిందీలో రీమేక్ చేసారు .

1979 లో వి బి రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో తమిళంలో పట్టక్కతి భైరవన్ అనే టైటిలుతో తీసారు . శివాజీ , జయసుధ , శ్రీదేవి నటించారు . అంత హిట్టయిన కధ , సినిమా . కధ , స్క్రీన్ ప్లే , మాటలు , దర్శకత్వం దాసరి నారాయణ రావు వహించారు . ప్రముఖ నిర్మాతలు విజయ మాధవి పిక్చర్స్ వడ్డె రమేష్ , శోభనాద్రిలు తమ విజయ మాధవి పిక్చర్స్ బేనరుపై నిర్మించారు .

Ads

ఈ సినిమాలో కృష్ణంరాజు గాంగులో ఓ పులి ఉండటం విశేషం . బాస్ కృష్ణంరాజు ఏం చెబితే అది అమలు పరుస్తుంది ఆ పులి . ఓ సినిమాలో సర్కస్సులో పనిచేసే కమల్ హాసన్ పులి లాగా . కృష్ణంరాజు తండ్రీ కొడుకులుగా నటించారు . తండ్రి పాత్ర అయ్యాక కొడుకు పాత్ర వస్తుంది . కృష్ణంరాజు , జమున , జయసుధ , జయచిత్ర , రామకృష్ణ , రావు గోపాలరావు , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , రమణమూర్తి , మిక్కిలినేని , త్యాగరాజు , కాంతారావు ప్రభృతులు నటించారు .

జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో వీణ నాది తీగె నీది అనే పాట బాగా హిట్టయింది . మిగిలిన పాటలు ఈదురు గాలికి మా దొర గారికి ఏదో గుబులు రేగింది , వింత ఇరుకు ఎంతో ఇరుకు , పాల కంకి మీదుంది పైరు అబ్బబ్ , తలలో చేతులు తగవులు పడితే థియేటర్లో శ్రావ్యంగా ఉంటాయి . జయసుధ జయచిత్రల పట్టాడే అబ్బ కొట్టాడే హుషారుగా ఉంటుంది . పాటలన్నింటినీ వేటూరే వ్రాసినా గొప్పగా పేలలేదు . థియేటర్లో వరకు బాగుంటాయి .

ఈ సినిమాలో కాలేజీ పూర్వ విద్యార్థుల ఫంక్షన్లో రామకృష్ణ , జయచిత్ర మధురానగరిలో చల్లనమ్మబోదు దారి విడువుము కృష్ణా అని శాస్త్రీయంగా ప్రారంభమవుతుంది . కాలేజీ కుర్రాళ్ళు వద్దని గోల చేస్తే రాక్ & రోల్లో లాగిస్తారు . 1978 కాబట్టి సనాతనవాదులు వదిలేసారు . ఇప్పుడయితే సనాతన ధర్మాన్ని కించపరిచారని బాయ్ కాట్ పిలుపు కూడా ఇచ్చే వారు .

ఇలాంటి సన్నివేశాలు అత్తారింటికి దారేది సినిమాలో కూడా ఉంటాయి . అహల్య , గౌతమ మహాముని , ఇంద్రుడు నదికి స్నానానికి వెళ్ళే సీన్లో పవన్ కల్యాణ్ , సమంత , బ్రహ్మానందం నటించారు . అదే సీన్ ఇప్పుడయితే గోలగోల అయ్యేది . త్రివిక్రమ్ శ్రీనివాస్ జనానికి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చేది .

మొత్తం మీద నిర్మాతలకు లక్ష్మీ ప్రసన్నం ఉంది . కుంతీ కర్ణుల కధ వంటి కధతో ఈ సినిమాలో దాసరి మార్కు డ్రామా , డైలాగులు , ఎమోషన్ పుష్కలంగా ఉన్నాయి . సినిమా యూట్యూబులో ఉంది . పాటల వీడియోలు కూడా ఉన్నాయి . కృష్ణంరాజు , ప్రభాస్ అభిమానులు చూడవచ్చు .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు  ………… ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం )

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!
  • ఆకాశ్‌తీర్, రుద్రమ్, బ్రహ్మాస్… పాకిస్థాన్ వెన్నువిరిచిన విధం ఇదీ…
  • బురద జల్లడం కాదు… సరైన సంకల్పంతో రాసినా, గీసినా, తీసినా ఒప్పే…
  • సరిగ్గా కళ్లెట్టుకు చూడు… నిండు విస్తరిలో ఏదో మర్డరు జరిగినట్టు లేదూ…
  • దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…
  • ఐపోలేదు… అసలు కథ ముందుంది… అబ్బే, వేణుస్వామి జోస్యం కాదు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions