Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణకు కేసీయార్ తీరని చారిత్రక ద్రోహం… ఇవిగో ఆనవాళ్లు…

April 14, 2026 by M S R

.

కేసీయార్ అంటే ఇంకా జాతిపిత, బాపు అనే భ్రమల్లో బతికే వాళ్ల కోసం… కాస్త జాగ్రత్తగా చదవండి… కాళేశ్వరం బరాజులను కాంగ్రెసోళ్లే బాంబులు పెట్టి పేల్చేశారు, నాలుగు తట్టల కాంక్రీట్ చాలు రిపేరుకు అనే తిక్క వానదలు, సమర్థనలు, వక్ర కథనకారులు మరింత జాగ్రత్తగా చదవండి… అఫ్‌కోర్స్, తెలంగాణవాదులు అయితేనే సుమా… కేసీయార్ మార్క్ సూడో తెలంగాణవాదులు అవాయిడ్ చేయండి… అది రేవతి మార్క్ ప్రాపగాండా…

కమీషన్లు, అవినీతి, అక్రమాలు, లక్షకోట్ల స్వాహా అనే ఆరోపణలు, విచారణ కమిషన్లు, కేంద్ర బీజేపీ ప్రభుత్వం క్షుద్ర రాజకీయం మన్నూమశానం పక్కన పెడితే… ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమందో తెలుసా..?

Ads

  • ‘‘ఒరేయ్ బాబూ, మేడిగడ్డ బరాజు (తస్కిన డ్యామ్) రిపేరు అంత సులభం కాదురా… 40 మీటర్ల లోతులో బరాజు వెంబడి పునాదులకు రక్షణగా డయాఫ్రమ్ వాల్ కట్టండి… లేకపోతే అది మొత్తం కొట్టుకుపోతుంది… ఆ డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఎగువన ఓ కాఫర్ డ్యామ్ కట్టండి… కుంగిన బ్లాక్ మాత్రమే మళ్లీ కడతారా, దానికి అటూఇటూ కలిపి మొత్తం మూడు మళ్లీ కట్టాలా చెబుతాను కాస్త ఆగండి… ’’

medigadda

అసలు రోగనిర్ధారణకే దాదాపు 500 బోర్లు వేయాల్సి ఉంటుందనే వాదన తెలంగాణ సమాజాన్ని హతాశుల్ని చేసింది కదా… ఇప్పుడిక డయాఫ్రమ్ వాల్… పైగా కాఫర్ డ్యామ్…  చివరకు దీన్ని మరో పోలవరం ప్రాజెక్టు చేశారు కదరా బాబూ… (పోలవరంలో కూడా సేమ్ కాళేశ్వరంలాగే కాఫర్ డ్యాములు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న సంగతి తెలుసు కదా… సేమ్, అవినీతి, సేమ్ అక్రమాలు)…

  • గతంలో ఎన్ని అవినీతి అక్రమాలు ఉన్నా సరే… ప్రాజెక్టుల నాణ్యత దగ్గర రాజీపడేవాళ్లు కాదు… మరి కేసీయార్ కదా… జగన్- చంద్రబాబు కదా… మొత్తానికే స్వాహా బాగోతకర్తలు… అదేమంటే నాలుగు తట్టల కాంక్రీట్ చాలు, బాంబులు పెట్టి కాంగ్రెసోళ్లే పేల్చేశారు అని తెలంగాణ సమాజానికి ఇంకా ఇంకా ద్రోహం చేసే ప్రకటనలు…

ఇంకాస్త లోతుగా వెళ్దాం… వాస్తవానికి బరాజులకు తొలుత చేసిన డిజైన్ ప్రకారం షీట్ ఫైల్స్ ఉపయోగించాలని ఉండగా… అభినవ విశ్వేశ్వర్రావు కేసీయార్ డిజైన్ల పుణ్యమాని… అధిక కమీషన్ల యావ కావచ్చు… నిర్మాణం మధ్యలో సీకెంట్ ఫైల్స్ వాడారు…

సీకెంట్ పైల్స్‌ సరిగా అమర్చకపోవడం వల్లే బరాజు దిగువ భాగం నుంచి ఇసుక జారి… మేడిగడ్డలో 12 పిల్లర్లు ఉన్న ఏడో బ్లాకు కుంగిందని జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్ఎస్ఏ) నిపుణుల కమిటీ నిర్ధారించింది… విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణలోనూ, జస్టిస్ పినాకిచంద్ర ఘోష్ నివేదికలోనూ దీనిని గుర్తించారు…

medigadda

  • ఆదివారం నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి నిర్వహించిన సమీక్షలోనూ ఇదే అంశం చర్చకు వచ్చింది… కాళేశ్వరం బరాజుల పునరుద్ధరణ డిజైన్లు అందించడానికి ఎంపి కైన ఆఫ్రీ ఇండియా (ముంబై) సంస్థ డయాఫ్రం వాల్ ఒక్కటే బరాజును కాపాడగలదని అభిప్రాయపడినట్లు సమాచారం…

భూ భౌతిక, భూ సాంకేతిక పరీక్షల అనంతరం నివేదిక అందిన తర్వాత దీని నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తున్నారు… ఇక మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్లలో స్టిల్లింగ్ బేసిన్ (స్పిల్‌వే గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని నిర్వీర్యం చేసే కాంక్రీట్ రక్షణ వ్యవస్థ)… ప్రవాహ ఉధృతికి అనుగుణంగా లేదని గుర్తించారు… దాంతో మూడు బరాజుల్లోనూ స్టిల్లింగ్ బేసిన్ విస్తరించనున్నారు… వచ్చే అక్టోబరు నుంచి ఈ పనులు చేపట్టనున్నారు…

  • మూడు తట్టల కాంక్రీట్ చాలు అనే చెత్తా వాదన…, తెలంగాణ జనం కళ్లు గప్పి, ఇంకా ఇంకా తెలంగాణాన్ని మోసం చేసే వాదనను కాసేపు పక్కన పెడితే… ప్రస్తుతం మేడిగడ్డ బరాజు రిపేర్ ఖర్చు అసలు నిర్మాణ ఖర్చుకు సమానం కానుంది…

medigadda

డయాఫ్రం వాల్ పనులకే రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్ల దాకా అయ్యే అవకాశాలున్నాయి… అయితే డయాఫ్రం వాల్ నిర్మించాలంటే బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో కాఫర్ డ్యామ్ కట్టాలి… దీనికి రూ.400 కోట్లు, బ్యారేజీలోని ఏడో బ్లాకు పునరుద్ధరణకు రూ.500 కోట్ల దాకా అవుతాయని అంచనా వేస్తున్నారు… అంటే ఒక మేడిగడ్డకే 2500 కోట్ల దాకా కావాలట…

  • మేడిగడ్డ బరాజులోని మూడు బ్లాకులు (6, 7, 8) దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు… దాంతో ఈ మూడు బ్లాకులను శాశ్వతంగా తొలగించి, వాటి స్థానంలో కొత్త బ్లాకులు కట్టాలా? లేక ఏడో బ్లాకును మాత్రమే తొలగించాలా అనేది పరీక్షల ద్వారా తేలనుంది…6వ బ్లాకులో 12 పిల్లర్లు ఉండగా… 4 పిల్లర్లు దెబ్బతిన్నట్లు, 7 బ్లాకులో 11 పిల్లర్లకుగాను 5 దెబ్బతిన్నట్లు, 8వ బ్లాకులో 8 పిల్లర్లు ఉండగా.. 2 పిల్లర్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాగా, బ్యారేజీల పునరుద్ధరణ, మరమ్మతులకు ఖర్చు ఎంతైనా భరించక తప్పని అనివార్యత ఏర్పడిందని ప్రభుత్వం గుర్తించింది…

నిర్మాణ సంస్థలకు ‘కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం’ కేసీయార్ చేసిన మరో ద్రోహం... ఏతావాతా కేసీయార్ తెలంగాణ సమాజానికి చేసిన ద్రోహం అంతా ఇంతా కాదు...! మరో పదీపన్నెండు ఆయుత, ప్రయుత చండీయాగాలు చేేసినా పాపపరిహారం దక్కనంతగా..!!

.

ఇంట్రస్టింగ్ ఏమిటంటే ... డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యాములు వార్తను... తెల్లారి లేస్తే తన్నుకుచచ్చే సాక్షి, జ్యోతి కూడబలుక్కుని రాయటం... ఈనాడు కళ్లు తేలేయడం చేతకాక...  నమస్తే ఎప్పటిలాగే సిగ్గుతో కుంచించుకుపోవడం...

.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తెగ బలిసిన కార్లు పైకి ఎక్కేస్తాయి – మనమే పైలంగా ఉండాలె !!
  • K I L L …! యండమూరి విశ్లేషణ- సమీక్ష … భిన్నం – ఆసక్తికరం !
  • ఎలపరం ! కాలేజీ ప్రాంగణాలు ఇక సినిమా ఫంక్షన్లకు అద్దె వేదికలు !!
  • ప్రతి మెహిందీ కథా ఇంతే ! వెలుతురు ఎరుగని చీకటి తడి అంగడి !
  • నిజం- ఓటీటీ భ్రమలు బద్ధలయ్యాకే… తెలుగు సినిమా బతుకుతోంది !
  • సంక్షోభమూ ఓ అవకాశమే ! రేవంత్ రెడ్డి వాడుకోగలిగితే భలే చాన్స్ !!
  • Save Vijayawada – ముందు బెజవాడను బతికించండి, తరువాతే మెట్రో !!
  • ఇస్రో ఇకపై రాకెట్లు తయారుచేయదట… మరి ఏం చేస్తుంది ? 
  • నిజం ఏదో చెప్పాల్సిన మీడియానే… నిజం కోసం వెతకాల్సి వస్తే ?
  • ఆరబోత – వాన పాట – అదీ ఓ కుర్ర హీరో … అప్పట్లో సౌందర్య సైతం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions