Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రేవంత్‌రెడ్డి కార్పెట్ బాంబింగ్! కేసీయార్ మార్క్ భారీ భూకుంభకోణం!

September 16, 2026 by M S R

.

అనుకోకుండా వచ్చిన 22ఏ ఇష్యూను రేవంత్ రెడ్డి ఎంచక్కా ఓ  చాన్స్‌గా తీసుకున్నాడు… కేసీయార్ కుటుంబ భూఅక్రమాలే గాకుండా, పలువురు బీఆర్ఎస్ ప్రముఖుల భూబాగోతాలను అసెంబ్లీ వేదికగా బజారుకు లాగాడు… పెద్ద పొలిటికల్ బ్లాస్ట్… కేసీయార్ ఫామ్‌హౌజ్‌పై విచారణకు ఆదేశించడమే కాదు, అక్రమంగా సేకరించిన భూముల్ని పేదలకు పంచుతామని కూడా ప్రకటించాడు… కార్పెట్ బాంబింగ్ ఆన్ కేసీయార్…

ఏనాటి నుంచో కేసీయార్ ఫామ్‌హౌజ్ ఎన్ని వందల ఎకరాలు, అందులో అక్రమంగా సేకరించిన భూమి ఎంత? ప్రభుత్వ భూమి ఎంత అనేది రాజకీయ విమర్శ, ప్రతివిమర్శల్లో ఉన్నదే… రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీయార్ చేతిలో అక్రమంగా 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ‘బట్టలిప్పేశాడు’…

Ads

ఆల్రెడీ హైదరాబాదులో కేటీయార్ భూబాగోతాలపై ఏనాటి నుంచో సీఎం విమర్శలు చేస్తున్నాడు కదా… కాళేశ్వరం సహా బోలెడు అక్రమాల బాపతు కత్తులు కేసీయార్ కుటుంబ సభ్యులపై మెడలపై వేలాడుతున్నవే కదా… ఇప్పుడు కేసీయార్ కుటుంబం ఏకంగా లక్ష కోట్ల భారీ భూకుంభకోణానికి పాల్పడిందని, ఆ కుటుంబానికి ఎక్కడెక్కడ 439 ఎకరాలున్నాయో వివరించాడు…

kcr

ఆల్రెడీ హరీష్ రావు తన మామ పేరిట బోలెడు ఎకరాలను రాయించుకున్నాడని రెవిన్యూ మంత్రి పొంగులేటి ఆరోపిస్తున్నాడు కదా, తాజాగా మీడియా చిట్‌చాట్‌లో మరికొందరి బాగోతాలనూ బయటపెట్టేశాడు… ఇలా…

kcr

‘‘స్టీఫెన్‌సన్‌కు ఎన్నికల ముందు నజరానా ఇచ్చారు... రూ.50 కోట్ల భూమిని రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్‌ చేశారు... గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి 650 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేశారు... జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చింది... పైలట్‌ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ కట్టుకున్నారు... ఒక కుటుంబానికి కుష్కి పొలం 54, తరి పొలమైతే 27 ఎకరాలుండాలి. కానీ, కేసీఆర్‌కు ఉన్నది మొత్తం తరి పొలమే’’ అని సీఎం వివరించారు...

త్వరలోనే ధరణి పార్ట్‌-2 అక్రమాలు… ‘‘రాష్ట్రంలో మొత్తం రూ.లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగింది… భూ కుంభకోణంపై స్పెషల్‌ ఎంక్వయిరీ టీమ్‌ (ఎస్‌ఈటీ) ఏర్పాటు చేస్తాం… మొత్తం భూ కుంభకోణంపై నెల రోజుల్లో నిగ్గు తేలుస్తాం… ఇప్పటి వరకు చెప్పింది ధరణి పార్ట్‌-1 మాత్రమే… త్వరలోనే ధరణి పార్ట్‌-2 అక్రమాలు బయటపెడతాం…

టీజీఐఐసీ భూముల్లో జరిగిన అక్రమాలను బడ్జెట్‌ సెషన్‌లో బయటపెడతాం… ధరణిని అడ్డు పెట్టుకొని రూ.వేల కోట్లు దోచుకున్నారు..’’ అన్నాడు… ఇదే సమయంలో ఓ విషమ సమస్యగా మారిన 22 ఏ పరిష్కారానికి విరుగుడు చర్యల్ని కూడా ప్రకటించడం గుడ్ మూవ్…

‘‘22ఏ సమస్యల పరిష్కారానికి హైపవర్‌ ఆఫీసర్స్‌ కమిటీ ఏర్పాటు చేస్తాం… సమస్యల పరిష్కారానికి వారంలోపు సమగ్ర గైడ్‌లైన్స్‌ తీసుకొస్తాం… హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, డీటీసీపీ లేఔట్ల దరఖాస్తులు పరిశీలిస్తాం… పెండింగ్‌లో ఉన్న, కొత్తగా వచ్చే దరఖాస్తులను పరిష్కరిస్తాం… సమస్యల పరిష్కారానికి వారంలోపు వ్యవస్థ తీసుకొస్తాం..’’ అని సీఎం చెప్పాడు…

12 రకాల భూములకు సంబంధించి 22ఏ సమస్యను ఎలా పరిష్కరించనున్నారో, ఏమేం చర్యలు తీసుకోనున్నారో వివరంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు… అదే సమయంలో కేసీయార్ మార్క్ ధరణి అత్యంత బారీ భూఅక్రమాలకు ఓ క్లాసిక్ ఎగ్జాంపుల్ కూడా బయటికి వచ్చేసింది… ఇదుగో…

ధరణి

సీఎం చేసిన ప్రసంగం, ఆరోపణలు, సిట్ ఏర్పాటు, నెలలో కేసీయార్ కుటుంబ భూఅక్రమాల వెల్లడి, కేసీయార్ ఆక్రమించిన ప్రభుత్వ భూముల పంపిణీ తదితర అంశాలు పేలుళ్లు సృష్టిస్తున్నాయి… వెంటనే కేసీయార్ బిడ్డ కవిత ఉలిక్కిపడింది… ఇలా స్పందించింది…


  • ‘‘సీఎం ఈ రోజు అసెంబ్లీలో ప్రస్తావించిన గుంట నక్క, కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉండే సీఎం గూఢచారి సహా నవీన్ రావు, కొండల్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీశ్ రెడ్డి, రామేశ్వర్ రావు, ప్రతిమ శ్రీనివాస్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి సహా అందరి భూములపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నా’’

ఇవన్నీ చదువుతుంటేనే సగటు తెలంగాణవాసికి కళ్లు తిరుగుతున్నాయి… ఒకవేళ రేవంత్ రెడ్డి సీబీఐకి ఇచ్చినా అదేమీ తేల్చదు… బీజేపీ, బీఆర్ఎస్ గుప్తస్నేహితులే… ఆల్రెడీ కాళేశ్వరం కథ చూశాం కదా… ఇదీ అంతే… అవునూ, రేవంత్ రెడ్డి సాబ్… కేసీయార్ ఫామ్‌హౌజులో పేదలకు భూముల్ని పంచడం దేనికి…? అక్కడే ఓ భారీ ఇందిరమ్మ ఇళ్ల సముదాయం నిర్మించొచ్చు కదా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • UPI పై చార్జీల బాదుడు ! అమెరికా ఒత్తిడే కారణమా !?
  • రేవంత్‌రెడ్డి కార్పెట్ బాంబింగ్! కేసీయార్ మార్క్ భారీ భూకుంభకోణం!
  • నాన్ సెన్స్-ఆర్ … ఆ మెదళ్లు శుష్కించిన బీళ్లు … ఉదాహరణకు ఏమంటే…
  • Space War – ట్రంపు చెప్పిన స్పేస్ వెపన్స్ ఏరకం? ఏవి టార్గెట్స్?
  • 2 కోట్ల నుంచి ₹300 కోట్లు… ఈ మ్యాజిక్ తులసీదాస్ రిపీట్ చేయగలడా ?
  • గజల్ శంకర్ ! టాలీవుడ్ పెద్దగా గుర్తించని ఓ ‘స్వరముత్యం’…
  • మోదీ కాదు… షా కాదు… బెంగాల్ బీజేపీ జోష్ వెనుక ఏదో ‘మార్మిక శక్తి !!
  • కథ నమ్మేలా లేదు! … AI 1980 ఫోటోలు పాత రూపురేఖల్ని పట్టివ్వవు !!
  • కాలేజీలోనే ప్రత్యేకంగా ‘OYO’ రూమ్స్ – ఇది మరీ అరాచకం !!
  • ఔను, వాళ్లు చాలా క్లారిటీతో ఉన్నారు – అందుకే బీజేపీకి ఒకేఒక వోటు !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions