.
ఎంతైనా కేసీయార్ గొప్పోడు… నిఖార్సయిన మాట చెప్పిండు… 80 వేల పుస్తకాలు చదివిన మహా జ్ఞాని కదా, ఆమాత్రం మాటకు విలువ ఉండటం సహజమే… ఆ బూతుల అసెంబ్లీకి ఎందుకు పోవాలె..? నేను పోను, పోనే పోను అని తేల్చేశాడట, నిన్న ఫామ్‌హౌజులో జరిగిన తన పింక్ అసెంబ్లీ సమావేశాల్లో…
నిక్కమైన మాట చెప్పినవ్ దొరవారూ… ఆ మాట మీదే నిలబడు… ఎలాగూ అసెంబ్లీకి పోవాల్సిన పనిలేదు అంటున్నావు కదా… ఈ మూడేళ్లూ అదే చేస్తున్నవు కదా… సో, నీ మాటకు నువ్వే విలువ ఇచ్చి, ఓ నైతిక బాధ్యతగా ఆ ఎమ్మెల్యే పదవికి, ప్రతిపక్ష నేత హోదాకు రాజీనామా చేసెయ్… ఎలాగూ అసెంబ్లీకి పోకపోతే, పోవద్దనేదే నిర్ణయమైతే ఇప్పటికే 22 కోట్లు ప్రజాధనం ఖర్చయిన ఈ కొలువు కోసం ఇంకా తెలంగాణ జనం సొమ్ము ఎందుకు ఖర్చుపెట్టాలె… పెట్టకపోవడమే విజ్ఞత కదా!!
Ads
ఏదో అనర్హత వేటు పడకుండా ఆరు నెలలకోసారి అసెంబ్లీకి మొహం చూపించి, రిజిష్టర్‌లో సంతకం చేసి, రెన్యువల్ చేసుకోవడం కూడా అనైతికమే కదా మాస్టారూ..? ఇంత సుదీర్ఘమైన ప్రజాజీవితానికి మరక కాదా..? చులకన కాదా..? నీ అంతట నువ్వే దిగజార్చుకోవడం కాదా..? ప్చ్, ఏమీ బాగనిపించడం లేదు సారూ…
కొండా సురేఖ ఇష్యూలోలాగే… అసెంబ్లీకి రాకపోతే కేసీయార్‌పై అనర్హత వేటు వేయాలా..? కేసీయారే రాజీనామా చేస్తే మర్యాదకరంగా ఉంటుందా అనే ఓ డైలమా… ఆల్రెడీ కేటీయార్ కూడా చెప్పేశాడు, వస్తే గిస్తే డాడీ గారు సీఎంగా మాత్రమే అసెంబ్లీకి వస్తారని… ఓహో, ఇప్పుడు ప్రజాజీవనం తాలూకు ప్రమాణాలు, అర్హతలు మారిపోయాయా..? రాజకీయ పండితుల్లో ఎడతెగని చర్చలు…

సో, ఇకపై ఎన్నికల్లో నిలబడితే, జనం తిరస్కరిస్తే, ఆశించిన అధికారం రాకపోతే చట్టసభలకు ప్రతిపక్ష నేతలు వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట… అక్కడ జగన్, ఇక్కడ కేసీయార్… నిజానికి పార్లమెంటులో చర్చించాలె ఇది… మరిక చట్టసభలకు విలువ ఏముందో సీరియస్‌గానే ఓ సభా కమిటీని వేసి మరీ చర్చించాలె…
ప్రజాజీవనం అంటే యాదికొచ్చింది… సారు గారు అధికారంలో ఉన్నప్పుడే సచివాలయం పోకపాయె, ఫామ్ హౌజే సచివాలయమాయె… పైగా రోజుల తరబడీ ఆబ్సెంట్, అజ్ఞాతం… ఇప్పుడేమో ఇక ఫామ్ హౌజే అసెంబ్లీ అనుకోవాలా మాస్టారూ…
ఎలాగూ జనంలోకి రాని, జనం పట్టని ప్రజాజీవనం… ఓ పెద్ద పారడాక్స్…
ప్రతిపక్షంలో కూర్చోవాలన్న ప్రజా తీర్పును తుంగలో తొక్కడం… ఓ ఐరనీ…
అసలు ప్రజల మీద అలిగి, ప్రజలకు మొహం చూపించకపోవడం… ఓ ట్రాజెడీ…
నేను రాను, జనంలోకి రాను, నేను పోను, అసెంబ్లీకి పోను, పోనే పోను అంటున్నప్పుడు… మరి ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ‘మోరల్ కాలర్’ ఎగరేయడం కదా అసలు గొప్పదనం… పాపం, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే కదా చెబుతున్నది… ధర్నాలు చేయించి మరీ అడుగుతున్నది… నువ్వు రాజీనామా చేయాలనే కదా..!
ఎక్కడైనా ముఖ్యమంత్రే, ప్రధానమంత్రో రాజీనామా చేయాలని ఆందోళనలు జరుగుతూ ఉంటాయి, బొద్దింకలు విద్యా మంత్రి రాజీనామాకై భీకరమైన ఆందోళన కూడా చేశాయి ఆమధ్య… సహజం… కానీ తెలంగాణ రాజకీయాలు సపరేటు రూటు కదా… ప్రతిపక్ష నేత రాజీనామా చేయాలని సమాజం ఆందోళన చేస్తుంది… ఇదా చివరకు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో సాధించుకున్న పేరు..? ఏమీ బాగాలేదు సారూ…
చివరగా… ఇక సాగునీటిపై ఉద్యమిద్దాం, పాదయాత్ర చేస్తా అనడం వరకూ బాగానే ఉంది.., కానీ తెలంగాణ సాగునీటి రంగానికి… మలి దశ తెలంగాణ ప్రధాన నినాదాల్లో ఒకటైన నీళ్లు అనే అంశానికి… దారుణమైన నష్టాలు, మోసాలు జరిగినవన్నీ గడీ మార్క్ పాలనలోనే కదా… అవన్నీ జనంలోకి చర్చకు వస్తాయి… ఐనా సరే, ఇలాగైనా జనంలోకి వస్తాడు అనుకునే అల్ప సంతోషులను కూడా నిరాశపరుస్తావు నువ్వు… గతంలో అనేక ఉదాహరణలు…
గత మూడేళ్లలోనూ మనమడికి దెబ్బ తగిలితే, ఎవరో కుటుంబ సమీప బంధువు మరణిస్తే, సొంత వైద్య పరీక్షలకు తప్ప బయటికి వచ్చిందెప్పుడు..? ఇప్పుడూ అంతే… ఊదు కాలదు- పీరు లేవదు..!!
నేను అసెంబ్లీకి వస్తే నన్నే టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తారు అనేదే భయమైతే… రాకపోవడానికి అదే కారణమైతే… తను రాకపోయినా జరిగేది అదే !! తన పాలనకు, తన వర్తమాన ఆలోచనలకు అన్ని మరకలున్నాయి మరి !!
Share this Article