.
వోకే, పెద్ది సుదర్శన్ రెడ్డి ఓ మధ్యతరగతి నుంచి రాజకీయాల్లో ఎదిగాడు, ప్రధానంగా ఉద్యమకారుడు… ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు కూడా తరలివచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు… తనను బీఆర్ఎస్ నాయకుడిగా కాదు, జనం పెద్దిగానే చూశారు కాబట్టి… ఇదంతా చదువుతూ ఉంటే…
రేగా కాంతారావు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, లైంగిక సంబంధాలు పెట్టుకుని, తరువాత వదిలించుకున్నాడని ఓ మహిళ కేసు పెట్టింది… ఇది చదువుతూ ఉంటే, అప్పట్లో ఓ నిండు కుటుంబం చేజేతులా అగ్నికి ఆహుతైన మరో సంఘటన గుర్తొచ్చింది… అదే ది గ్రేట్ వనమా రాఘవ అలియాస్ సన్నాఫ్ వెంకటేశ్వరరావు…
Ads
డ్రగ్స్, ఈడీ కేసుల్లో నిందితుడు పైలట్ రోహిత్ రెడ్డి కూడా గుర్తొచ్చాడు… వీళ్లందరూ మాజీ ఎమ్మెల్యేలే… పెద్ద దొర కేసీయార్ వీళ్లందరినీ నెత్తిన పెట్టుకున్నవాడే… వీళ్లు బీఆర్ఎస్ ఘనమైన ప్రాపర్టీలు..!! వీళ్లేనా… ఆస్తులు, సంపాదన కోణంలో ఒక మల్లారెడ్డి, ఒక ముత్తిరెడ్డి… ముత్తిరెడ్డిపై సొంత కూతురే తిరగబడింది కదా… మానుకోట ఘనుడు పాడి కౌశిక్ కథ సరేసరి…
లెక్క తీస్తే, లిస్టు రాస్తే… అనంతం! పెద్ద దొర నెత్తిన పెట్టుకున్నది మొత్తం ఇలాంటి వాళ్లనే… వీళ్లంతా ఒకప్పుడు మాజీ కాంగ్రెసీయులే కదా అనడక్కండి… వాళ్లను ఏరికోరి తెచ్చి నెత్తిన మోసింది ఎవరు..? జనం పదే పదే థూత్కరించినా సరే, మళ్లీ మళ్లీ టికెట్లు ఇచ్చినందుకే కదా ఈరోజు జనం కేసీయార్‌ను కూడా ఛీకొట్టింది… స్టిల్, ఈరోజుకూ కేసీయార్‌లో ఆ ఆత్మ సమీక్ష లేదు, మథనం లేదు, దిద్దుబాటు లేదు, సంస్కరణ లేదు… వాళ్ల మొహం చూడకపోయినా సరే, ఈ దిక్కులేని అన్నాడీజనం మళ్లీ తననే గెలిపిస్తారనే దొరతనం!!
రేగా కాంతారావు వార్త చదువుతుంటే ఇదంతా మథనం… నిజానికి కేసీయార్ తెలంగాణపై రుద్దిన అనేకానేక అన్‌వాంటెడ్ ఎలిమెంట్స్‌తో పోలిస్తే రేగా కాంతారావు నథింగ్…
ఎస్, తెలంగాణ ఉద్యమం మంచిదే, అవసరమే, గొప్పది… కానీ ఆ పేరుతో కేసీయార్ నిర్మించిన పొలిటికల్ ఉద్యమం విలువల్లేనిది… కేవలం రాజకీయ కోణమే తప్ప తెలంగాణకు అవసరమైన ఓ సమర్థ, నీతివంత పొలిటికల్ నిర్మాణం అస్సలు జరగలేదు, సరికదా, ఉల్టా జరిగింది… చివరకు తనతోసహా. తన కొడుకు కేటీయార్ సహా… కింది స్థాయి కార్యకర్త దాకా అవినీతి, అక్రమాలు, అవలక్షణాలు, కేసులు…
ఫోన్ ట్యాపింగులు, కాళేశ్వరాల దాకా ఎందుకు..? సొసైటీ మొత్తాన్ని పొల్యూట్ చేశాడు కేసీయార్… ఎవరికెంత చాన్స్ ఉంటే అంత దండుకొండి అన్నట్టుగా… ఒకప్పుడు రైస్ మిల్లర్లు అంటే కాస్త జాగ్రత్తగా, భయభక్తులతో వ్యాపారం చేసుకునేవాళ్లు… 1340 మంది మీద కేసులు ఇప్పుడు, 4 వేల కోట్ల స్కాం, ఈరోజుకూ పెద్దపల్లి, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో రెచ్చిపోతున్నారు మిల్లర్లు…
ఇవేనా..? గొర్లు- బర్లు- చేపల దగ్గర నుంచి అవినీతి తాండవించని రంగం లేదు… సిసలైన ఉద్యమకారుల్ని పక్కకు నెట్టేసి, బదులుగా ఎలాంటివాళ్లను తెలంగాణపై రుద్దాడు కేసీయార్..? తెలంగాణ సమాజం మళ్లీ మళ్లీ సమీక్షించుకోవాల్సిన సీరియస్ సబ్జెక్టు ఇది…
విచ్చలవిడితనం అంటే... అది కేసీయార్ పార్టీ, కేసీయార్ పాలన... ఏమాత్రం సందేహించాల్సిన పనిలేదు... విషాదం ఏమిటంటే..? ది గ్రేట్ మోదీ తనను నెత్తిన పెట్టుకుని మోయబోతున్నాడు... మే గాడ్ సేవ్ తెలంగాణ!!
Share this Article