Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సీఎం ఆత్మగౌరవం మీద దెబ్బ ! ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం !!

August 21, 2026 by M S R

.

ఆమె ఒరిజినల్‌గా వైఎస్ జగన్ మనిషి కొన్నేళ్ల క్రితం… తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న రోజుల్లోనూ… తెలంగాణ వ్యతిరేకి, అందుకే మానుకోటలో రాళ్లు తిరగబడ్డయ్… ఆరోజుల్లో ఓ సంఘటన… రోశయ్యను సీఎంగా అంగీకరించను, ఆయన మొహం చూడటమే ఇష్టం లేదు అని వ్యాఖ్యానించింది, జగన్ మెప్పు కోసం…

ఓసారి ఏదో ఫైల్ పట్టుకుని రోశయ్య దగ్గరికే వెళ్లింది… ఆమె వైపు చూడకుండా ఓ ఫైల్‌ను తన మొహానికి అడ్డుపెట్టుకుని మాట్లాడాడు రోశయ్య… తెలుగు వ్యంగ్యానికి సిసలైన చిరునామా తను… ఊరుకుంటాడా..? నా మొహం చూడనంటివి కదా, చూపించడం లేదు అన్నాడు…

Ads

మాస్ పుల్లింగ్ బలం లేని రోశయ్య, కుట్ర రాజకీయాలతో అధికారాలు పొందడం తెలియని రోశయ్య, ప్రజెంట్ రాజకీయాల్లో ఇమడలేని రోశయ్య, ఆయనే ఏ తడబాటు లేకుండా, స్ట్రెయిట్‌గా పదునైన జవాబు చెప్పాడు అలా… మరి కునారిల్లుతున్న కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన పవర్ ఫుల్ కేరక్టర్ రేవంత్ రెడ్డికి ఎందుకు ఆమెను ఉపేక్షిస్తున్నాడు..?

….. ఇదీ చాలామందిలో ఉన్న ప్రశ్న… తన ఆత్మగౌరవం గురించి ఓసారి సీరియస్ లుక్కేసుకోవాల్సిన సందర్భం… ఇప్పుడు ఉపేక్షిస్తే ఇక అలుసు… రేప్పొద్దున వార్డు కమిటీ సభ్యుడు కూడా ఇలాగే మాట్లాడతాడు…

సుస్మిత

అసలు సుస్మిత ఎవరు..? పార్టీలో ఎవరు..? ప్రభుత్వంలో ఎవరు..? ఆమె స్థాయి ఏమిటి..? ఏకంగా సీఎంకే ఝలక్కులు ఇస్తోంది..? అది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే అవమానం..! సీఎం ఇంకా ఉపేక్షిస్తే, నిరీక్షిస్తే ఇంకా ప్రమాదం… ఆల్రెడీ పార్టీ కేడర్‌లోకి తప్పుడు సంకెేతాలు వెళ్లిపోయాయి… ఇలాంటి ధోరణులను పట్టించుకోకుండా వదిలేస్తే రాను రాను ఇది పార్టీ మనుగడకే ప్రమాదం తెలంగాణలో…

ఎందుకంటే..? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై సవాళ్లు విసరబోతున్నాయి… అధికారం పోయిన కసితో కేసీయార్, అదికారం ఎలాగైనా కావల్సిందేననే ఆశతో బీజేపీ… రెండింటికీ అపారమైన సాధనసంపత్తి ఉంది… సో, కాంగ్రెస్‌ను బలంగా ఢీకొట్టబోతున్నాయి… అందుకే ఇలాంటి ధిక్కారాల్ని ఉపేక్షించి పార్టీని బలహీనపరుచుకోకూడదు..!!

అబ్బే, నా బిడ్డ వ్యాఖ్యలతో నాకేం సంబంధం అని సురేఖ బుకాయించవచ్చుగాక, కానీ అందరికీ తెలుసు, అవి మురళి- సురేఖ మాటలే అని..! ‘‘నిన్ను పీసీసీ అధ్యక్షుడిని చేసిందే మేం, నువ్వు మారకపోతే సీల్డ్ కవర్‌లో మరో సీఎం పేరు వస్తుంది’’ చాలా సీరియస్ మాటలు ఇవి… సీఎం ఆత్మాభిమానం- గౌరవం మీద కొట్టిన దెబ్బ…

ఇంతకుముందు చెప్పుకున్నవే… సురేఖతో వేరే మంత్రులకు పొసగదు… అదే జిల్లాలో పార్టీ నేతలతో పొసగదు… సీఎం ప్రోగ్రాములనే బహిష్కరిస్తుంది, ఎహె, నువ్వెంత అనే పోకడ అది… ఆమె ఓఎస్డీ సుమంత్ మీద ఇప్పుడు కేసు పెట్టడం కాదు, అప్పట్లోనే, ఆ యవ్వారం బయటపడినప్పుడే కేసు పెట్టి, కాస్త ఒత్తితే… సురేఖ ధిక్కారం ఇక్కడిదాకా వచ్చేది కాదు…

సుమంత్ కోసం వెళ్లిన పోలీసులతో కొన్నాళ్ల క్రితం ఇదే సుస్మిత దురుసుగా మాట్లాడింది… సీఎం ఉపేక్షించాడు… కొన్నింటిని ఆదిలోనే తుంచేయాలి, లేకపోతే ఇదుగో ఇలాగే ‘సీల్డ్ కవర్‌లో వేరే సీఎం’ అనే మాటల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది…

నేనే పరకాలలో పోటీచేస్తా, నువ్వు టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంటుగా పోటీచేస్తా, గెలుస్తా, 20 ఏళ్లు నేనే… నువ్వు కాదు, నీ తాత వచ్చినా నన్ను ఓడించలేరు…. ఇలాంటి మాటలు పడ్డాక కూడా రేవంత్ రెడ్డి ఇంకా అలుసిస్తే… అది తన కిందకు తానే నీళ్లు తెచ్చుకుంటున్నట్టు లెక్క..!!

ఒక పోచారం, ఒక దానం, ఒక రాజగోపాలరెడ్డి, ఒక అనిరుధ్, ఒక చిన్నారెడ్డి, ఒక సురేఖ… వీళ్లే కాదు, చాలా గొంతులు స్వరం సవరించుకుంటాయ్… రేవంత్ రెడ్డీ బహుపరాక్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం ఆత్మగౌరవం మీద దెబ్బ ! ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం !!
  • RIP… చీకట్లు తొలగి… రామోజీ ఆత్మ నిజంగా శాంతించుగాక!
  • జై గురువాయూరప్ప ! పదేళ్ల తరువాత ‘ఖండాంతర పెళ్లి’ జరిపించాడు !!
  • ఒకే హిందీ గీతం – తెలుగులోకి రెండు విధాలుగా – రాసింది ఒక్కడే !!
  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions