Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అలా కృష్ణ శివాజీ పాత్రపై తన మక్కువను తీర్చేసుకున్నాడు..!

February 19, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. One of the best movies acted by Krishna . 1982 ఏప్రిల్లో వచ్చిన ఈ డాక్టర్ సినీయాక్టర్ సినిమా చూసినప్పుడల్లా ఇద్దరు మిత్రులు , రాముడు- భీముడు సినిమాలే గుర్తుకొస్తాయి . అంత గొప్పగా నటించారు కృష్ణ . మూడు పాత్రల్లోనూ గొప్పగా నటించారు . మేనత్త మేనమామల పిల్లలుగా ఒకేలా ఉండేలా కధను నేయడమే సినిమా సక్సెస్సుకు సగం కారణం .

కధ బిగువుగా ఉంటే చేసే షోకులు అన్నింటికీ విలువ వస్తుంది . ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం పినిశెట్టి వ్రాసిన కధే . రొటీన్ కధలకు భిన్నంగా కొత్తగా వ్రాసారు . అందుకు తగ్గట్టుగానే విజయనిర్మల బిర్రయిన స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని వహించారు . ఆత్రేయ డైలాగులు కూడా బాగుంటాయి .

Ads

ఈ సినిమాలో మరో విశేషం ఛత్రపతి శివాజీ ఏకపాత్రాభినయం . యన్టీఆర్ , కృష్ణలకు కొన్ని కామన్ అభిలాషలు ఉన్నాయి . వాటిల్లో ఒకటి కొన్ని పౌరాణిక , చారిత్రాత్మక పాత్రల మీద మక్కువ . ఆ మక్కువను ఎలాగోలా తీర్చేసుకుంటూ ఉంటారు . ఈ సినిమా ద్వారా కృష్ణ శివాజీ పాత్ర మీద మక్కువను తీర్చేసుకున్నారు . ఈ పాత్రకు కొండవీటి వెంకట కవి ప్రత్యేకంగా డైలాగులు వ్రాయటం విశేషం .

సినిమాల్లో సినిమాలు , నటీనటుల్ని చూడటం ప్రేక్షకులకు భలే ఇష్టం . పద్మనాభం దేవతతో మొదలయిన ఈ ప్రయోగం తెలుగులో చాలా సినిమాల్లో ప్రేక్షకాదరణ పొందింది . ఈ సినిమాలో ఒక కృష్ణుడు సినీయాక్టర్ కావటం వలన కొన్ని సినీ క్లిప్పింగులు , సినిమా వాళ్ళను చూపటం సెట్టయింది . యన్టీఆర్ , దాసరి , శోభన్ బాబు , గీత , నాగేషులు తళుక్కుమంటారు . ఈ సినిమా నిర్మాత తోట సుబ్బారావు కూడా చాలా సేపు నిర్మాత అవతారంలోనే కనిపిస్తారు .

పండంటి కాపురం సినిమా ద్వారా తెరకు పరిచయమైన జయసుధ మొదటిసారి కృష్ణ సరసన హీరోయినుగా నటించింది . బాగా నటించింది . జయసుధ చెల్లెలు సుభాషిణి , కవిత , మమత , అల్లు రామలింగయ్య , పుష్పకుమారి , రవికాంత్ , కాంతారావు , నరసింహరాజు , సత్యనారాయణ , కాకినాడ శ్యామల , సి హెచ్ కృష్ణమూర్తి , ప్రభృతులు నటించారు . చక్రవర్తి సంగీత దర్శకత్వంలో పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . వేటూరి , అప్పలాచార్య వ్రాసారు .

కృష్ణకు ఇది 190వ సినిమా . ఇప్పటి తరం హీరోలు వంద కూడా కొట్టేలా లేరు . వీళ్ళ కెరీర్ ప్లానింగులేమిటో జనానికి అంతుపట్టదు . ఇంతకుముందు చూసి ఉన్నా ఈ సినిమా మళ్ళా చూడొచ్చు . ఎంటర్టయినింగుగా ఉంటుంది , హుషారుగా సాగుతుంది . ఒకటి రెండు చోట్ల సాగతీత ఉంటుంది . మళ్ళా వెంటనే పుంజుకుంటుంది .

కృష్ణ అభిమానులకు అప్పట్లో ఈ సినిమా పండగే పండగ . Undoubtedly , an entertaining , watchable and feel good movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సీఎం ఆత్మగౌరవం మీద దెబ్బ ! ఇంకా ఉపేక్షిస్తే మొదటికే మోసం !!
  • RIP… చీకట్లు తొలగి… రామోజీ ఆత్మ నిజంగా శాంతించుగాక!
  • జై గురువాయూరప్ప ! పదేళ్ల తరువాత ‘ఖండాంతర పెళ్లి’ జరిపించాడు !!
  • ఒకే హిందీ గీతం – తెలుగులోకి రెండు విధాలుగా – రాసింది ఒక్కడే !!
  • వేలాది అమాయక సిక్కుల ఊచకోత – ఆ దుర్జనుడు మరణించెను !
  • కంగనా – రాందేవ్ !… యవ్వనాలు, బెడ్‌రూంల దాకా లొల్లి !!
  • అనుబంధాల పలకరింపు కోసం ఓ ముసలి మనసు తన్లాట… అంతే…
  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions