Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందమైన సింగపూర్ నటితో మెగాస్టార్ చిరంజీవి రొమాన్స్…

December 26, 2024 by M S R

.

.   (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..     …. చిరంజీవి విదేశాల్లో నటించిన తొలి చిత్రం 1980 సెప్టెంబరులో రిలీజయిన ఈ లవ్ ఇన్ సింగపూర్ . అప్పటికే లవ్ ఇన్ టోక్యో , ఏన్ ఈవెనింగ్ ఇన్ పేరిస్ వంటి సినిమాలు హిందీలో ఉన్నాయి కానీ మన తెలుగులో లేవు .

ఈ సినిమా సింహభాగం సింగపూర్ , మలేషియా , బేంకాక్ , హాంగ్ కాంగ్ దేశాల్లో , అదీ ఇరవై రోజుల్లో పూర్తిచేసారు . అంతే కాదు ; చిరంజీవి క్లాప్ కొట్టిన మొదటి సినిమా కూడా ఇది . ఈ సినిమా టైంకు చిరంజీవికి కొంత స్టార్డం వచ్చేసింది . ఈ సినిమాలో సీనియర్ నటుడు రంగనాధ్ ఉన్నా పబ్లిసిటీ ఎక్కువగా చిరంజీవి మీదనే సాగింది . తగ్గట్టుగానే చిరంజీవి నటన , డాన్సులు , ఫైట్లూ బాగుంటాయి .

Ads

తెలుగు , మళయాళం భాషల్లో ఏకకాలంలో తీసారు . (తమిళంలోనూ ఈ పేరుతో రజినీకాంత్ సినిమా ఒకటుంది,…)  తెలుగులో చిరంజీవి , రంగనాధ్ ప్రధాన పాత్రల్లో నటించగా మళయాళంలో ప్రేమనజీర్ , జయన్లు నటించారు . లత , మెడ్లిన్ అనే సింగపూర్ నటి , విలన్ జోస్ ప్రకాష్ రెండు భాషల్లోనూ నటించారు . ఎక్కువ మంది జూనియర్ ఆర్టిస్టులు సింగపూర్ వాళ్ళే .

అంతర్జాతీయ స్మగ్లింగ్ కధాంశంతో తీయబడింది . ఇండియాలో ఓ దేవాలయం నుండి వజ్రఖడ్గం దొంగిలించబడి సింగపూరుకు చేరుతుంది . ఇండియా నుండి పోలీస్ ఆఫీసర్ పాత్రలో రంగనాధ్ సింగపూరుకు వెళతాడు .

అక్కడ చిన్నప్పుడే ఇల్లు వదిలి పారిపోయిన తమ్ముడు చిరంజీవి కలుస్తాడు , ఓ ప్రేయసి లభిస్తుంది . అందరూ కలిసి విలన్ని తుదముట్టిస్తారు . టూకీగా ఇదీ కధ . కధ రొటీనే అయినా విదేశాల్లో తీయటం , చిరంజీవి డాన్సులు , మార్షియల్ ఆర్ట్స్ ఫైట్లు , పాటలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి .

అప్పటికి ఇంకా మన రాష్ట్రంలో లేని , రాని షాపింగ్ మాల్స్ , ఎస్కలేటర్లు , వాటితో మన ఏక్టర్లు కనిపించటం సాధారణ ప్రేక్షకులకు సరదాగా , ఆసక్తికరంగా అనిపించాయి , కనిపించాయి .

మిగిలిన పాత్రల్లో అంటే ఇండియా షూటింగులో ముక్కామల , పి జె శర్మ , అత్తిలి లక్ష్మి ప్రభృతులు నటించారు . O S R ఆంజనేయులు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు సంగీత దర్శకత్వం శంకర్-గణేషులు నిర్వహించారు . సి నారాయణరెడ్డి , వేటూరి , సాహితి పాటల్ని వ్రాసారు . డైలాగులను మోదుకూరి జాన్సన్ , మోదుకురి చిట్టిబాబులు వ్రాసారు . పాటలన్నీ థియేటర్లో చాలా శ్రావ్యంగా ఉంటాయి . ఓ పాటలో అనూరాధ , చిరంజీవి చాలా బాగా డాన్స్ చేస్తారు . యం వెంకట రమణ కుమార్ నిర్మాత .

వ్యాపారపరంగా కూడా విజయవంతమైన ఈ సినిమా సక్సెస్ చిరంజీవి ఖాతాలోనే పడింది . ఈ సినిమా టైంకు కూడా చిరంజీవి బొద్దు మీసాలతోనే ఉన్నాడు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చిరంజీవి అభిమానులు ఇంతకుముందు చూసి ఉండకపోతే తప్పక చూడబుల్ సినిమాయే . లత కూడా ఉంది . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions