Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎర్ర సినిమాల్లో మాదల ఓ ట్రెండ్ సెట్టర్… ఈ సినిమాతోనే మొదలు…

December 29, 2024 by M S R

.

. ( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ).. ….. యువతరాన్ని నిజంగానే కదిలించిన 1980’s ఎర్ర సినిమాలు . AISF , CPI , ప్రజా నాట్య మండలి నేపధ్యం నుండి వచ్చిన మాదల రంగారావు 1980’s లో ఓ నయా ఎర్ర ట్రెండ్ సెట్ చేసిన ట్రెండ్ సెట్టర్ . ఇలాంటి విప్లవ భావాలతో , పీడిత ప్రజల ఊరుమ్మడి బతుకుల మీద ముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి .

అవన్నీ కాస్త సాఫ్టుగా నడిస్తే , మాదల రంగారావు ఫుల్ ఎర్ర బాటలో పరుగెత్తించాడు . ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఎర్రదళంలో మాదల రంగారావు , నల్లూరి వెంకటేశ్వర్లు , నర్రా వెంకటేశ్వరరావు , టి కృష్ణ ప్రభృతులు ఎర్ర రంగు బాగానే పులిమారు . ఇంక ఈ యువతరం కదిలింది సినిమాకు వస్తే :

Ads

ఈ సినిమాకు నిర్మాత , కధకుడు కూడా మాదల రంగారావే . ఎర్ర భావాలున్న ధవళ సత్యం దర్శకుడు . సెంటిమెంట్లకు నెలవైన సినిమా రంగంలో కొబ్బరికాయ కొట్టకుండా ముహూర్తపు షాట్ అంటూ హడావుడి లేకుండా షూటింగు ప్రారంభించబడిన సినిమా కూడా ఇది . స్వాతంత్ర్య దినం అయిన ఆగస్టు 15 న రిలీజ్ చేస్తామని ప్రారంభం నాడే చెప్పి ఖచ్చితంగా ఆగస్టు 15 నాడే విడుదల చేయబడిన సినిమా .

ఆనాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు ఈ సినిమాను ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్లో స్క్రీన్ చేయించుకున్నారట . ఆరు కేంద్రాల్లో వంద రోజులు ఆడింది . డబ్బుల వర్షం కురిసింది . ఆ డబ్బులతోనే నవతరం పిక్చర్స్ బేనర్ మీద మాదల రంగారావు మరి కొన్ని ఎర్ర సినిమాలను తీసారు .

కళ కళ కోసం కాదు ప్రజల కోసం అని నమ్మిన ప్రజా నాట్య మండలి నేపధ్యం నుండి వచ్చిన రంగారావు సినిమా టైటిల్సులోనే ఆ మాట చెపుతాడు . సినిమా డైలాగులను నవతరం యూనిట్ వ్రాసారని టైటిల్సులో వేసారు . ఎవరు వ్రాసారో తెలియదు కానీ బాగా ఎర్రగానే ఉంటాయి .

టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలు , బుర్ర కధ చాలా బాగుంటాయి . సి నారాయణరెడ్డి వ్రాసిన యువతరం కదిలింది అనే ఎర్ర పాట ఈ సినిమాకు ఐకానిక్ సాంగ్ . కాలేజీ ఫంక్షన్లలో బాగా వినిపించేది . దీనికి పూర్తి భిన్నంగా మరో చక్కటి పాట ఆశయాల పందిరిలో అనురాగం సందడిలో . చాలా శ్రావ్యంగా ఉంటుంది .

అప్పటికే కధకుడు , బుర్ర కధల రచయిత , రంగస్థల నటుడు , గాయకుడు అయిన అదృష్ట దీపక్ వ్రాసిన మొదటి సినిమా పాట ఇది . అల్లరే పల్లవి , ఓ చిన్నదానా ఓహో చిన్నదానా పాటలు బాగుంటాయి . నందారే లోకమెంతో చిత్రమురా , వినరా భారత వీరకుమారా బుర్రకధలు బాగుంటాయి .

ఈ సినిమాలో ప్రధానంగా మెచ్చుకోవలసింది ప్రభాకరరెడ్డి పాత్ర , ఆయన నటన . ఆయనకు ఉత్తమ నటుడు నంది అవార్డుని తెచ్చిపెట్టింది . ఉత్తమ కధా రచయితగా మాదల రంగారావుకి , ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది అవార్డులు వచ్చాయి . నంది అవార్డులతో పాటు ఇతర కళా సంస్థల నుండి కూడా అవార్డుల వర్షం కురిసింది .

మాదల రంగారావు , రామకృష్ణ , మురళీమోహన్ , నారాయణరావు , సాయిచంద్ , రంగనాధ్ , నాగభూషణం , పి యల్ నారాయణ , సాక్షి రంగారావు , నర్రా వెంకటేశ్వరరావు , చలపతిరావు , వల్లం నరసింహారావు , కె విజయ , రమాప్రభ , కృష్ణవేణి , మరెంతో మంది జూనియర్ ఆర్టిస్టులు , ఔత్సాహికులు నటించారు . ప్రజా నాట్య మండలి , CPI లో పాపులర్ నాయకుడు అయిన నల్లూరి వెంకటేశ్వర్లు తెరపై కనిపించిన మొదటి సినిమా . తర్వాత చాలా సినిమాల్లో నటించారు .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . తళుకుల ప్రపంచంలో జోగాడుతున్న ఈనాటి యువతరం ఆనాడు చైతన్య మూర్తులు జనం కోసం ఎలా కష్టపడ్డారో తెలుసుకోవాలంటే ఇలాంటి ఆనాటి సినిమాలను చూడాలి . ఇంతకుముందు చూడని మాతరం కుర్రోళ్ళు కూడా చూడవచ్చు . రిటైర్ అయి ఉంటారుగా . టైం ఉంటుంది . చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఓ ధూర్త శతృవు… ఓ మూర్ఖ ప్రధాని… ఈ తరం చదవాల్సిన కథ…
  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions