Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శంకరాభరణం సునామీలో కొట్టుకుపోయిన ఓ మహాలక్ష్మి..!!

December 27, 2024 by M S R

.

.      (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) .          …. శంకరాభరణం సునామీలో కొట్టుకుపోయిన మంచి సినిమా ఈ మహాలక్ష్మి సినిమా . బహుశా చాలామందికి ఈ సినిమా పేరు కూడా గుర్తుండి ఉండదు .

శంకరాభరణం 1980 ఫిబ్రవరి రెండున వచ్చింది . మొదటి వారం దాటాక శంకరాభరణం సునామీ ప్రారంభం అయింది . సరిగ్గా ఆ సునామీలో ఫిబ్రవరి ఇరవైన రిలీజయింది మహాలక్ష్మి సినిమా . శోభన్ బాబు , వాణిశ్రీ వంటి టాప్ హీరోహీరోయిన్లు ఉన్నా , సత్యం శ్రావ్యమైన పాటల్ని అందించినా , రాజాచంద్ర దర్శకుడిగా సినిమాను బాగానే నడిపించినా 50 రోజులు ఆడటానికి గగనం అయిపోయింది .

Ads

వాణిశ్రీ ఫస్ట్ ఇన్నింగ్సులో హీరోయిన్‌గా last but one picture ఇది . ఈ సినిమా తర్వాత 1981 లో చివరి సినిమా దేవుడు మామయ్య . ( ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్సులో 1989 లో వచ్చింది అత్తకు యముడు అమ్మాయికి మొగుడు ) .

మహాలక్ష్మి సినిమాలో ఎప్పటిలాగే వాణిశ్రీ నటన సూపర్బ్ . శోభన్ బాబుకి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే . సుభాషిణి , సత్యనారాయణ , మోహన్ బాబు , ప్రభాకరరెడ్డి , రాజసులోచన , రాజబాబు , మమత , పండరీబాయి , కాంతారావు , సారధి , జయవిజయ , రమణమూర్తి , పి జె శర్మ , తదితరులు కూడా బాగా నటించారు .

మొదటి సగంలో శోభన్ బాబు , వాణిశ్రీల ప్రేమ పెళ్ళి , హీరో గారికి పనీపాటా లేకపోవటంతో ఆయన వదిన హీరోయిన్ని రాచిరంపాన పెడుతుంటుంది . ఈ ఒత్తిడిలో హీరో సతమతమయి , డబ్బు సంపాదించుకోవటానికి పట్టణానికి బయలుదేరుతాడు .

గాలివానలో హీరో ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడి హీరో కొట్టుకుపోతాడు . రెండో సగంలో నదిలో కొట్టుకొచ్చిన హీరో అపస్మారక స్థితిలో సెకండ్ హీరోయిన్ సుభాషిణికి కనిపిస్తాడు . ఇంటికి తీసుకుని వచ్చి కాపాడి ప్రేమిస్తుంది . బ్లడ్ కేన్సరుతో చివరి రోజుల్లో ఉన్న ఆమెతో ప్రేమను నటించమని ఆమె తండ్రి ప్రార్ధిస్తాడు .

ఇంతలో ఇంట్లోనుంచి గెంటివేయబడ్డ హీరోయిన్ కూడా సుభాషిణికి దొరకటం , ఆమెకు రక్షణ కలిగించటం జరిగిపోతాయి . సెకండ్ హీరోయిన్ని పెళ్ళి చేసుకుని ఆస్తిని కొట్టేయాలని కలలు కనే సారధి , హీరోయిన్ వాణిశ్రీ మీద కన్నేసిన బావ మోహన్ బాబు సుభాషిణిని కిడ్నాప్ చేస్తారు . హీరో గారు దుష్టశిక్షణ చేస్తారు . సెకండ్ హీరోయిన్ చనిపోతుంది . హీరోహీరోయిన్లు కలిసి సంతోషంగా జీవిస్తారు . ఇదీ టూకీగా కధ . దర్శకుడు బాగానే నడిపించాడు . డైలాగులను రాజశ్రీ వ్రాసారు .

సత్యం సంగీత దర్శకత్వంలో పాటలన్నీ చాలా శ్రావ్యంగా ఉంటాయి . యెన్నెలంతా యేరాయే నిద్దరంతా నీరాయే , ఈ గీతం సంగీతం ఓ చెలీ నా జీవితం , అల్లరి చేసే ఊహల్లో ఆశలు మెరిసే కన్నుల్లో పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . శోభన్ బాబు పైలా పచ్చీసుగా ఆడపిల్లలతో పాడే పాట ఇన్నిన్ని కన్నెపూలు నన్ను రమ్మంటే ఏ పువ్వునెన్నుకోను హుషారుగా ఉంటుంది .

మహాలక్ష్మి దేవాలయంలో హీరోయిన్ పాడే లోకానికిది మేలుకొలుపు భక్తి గీతం బాగుంటుంది . ఈ పాటను ఆత్రేయ వ్రాయగా మిగిలిన పాటల్ని సి నారాయణరెడ్డి వ్రాసారు . పాటలన్నీ సుశీలమ్మ , బాలసుబ్రమణ్యాలే పాడారు .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . శోభన్ బాబు , వాణిశ్రీ అభిమానులు చూసి ఉండకపోతే తప్పక చూడండి . సినిమా చూడబులే . పాటలు వినబులే . శోభన్ బాబు వాణిశ్రీ డ్యూయెట్లు ఎంజాయబుల్ . అలాగే శోభన్ బాబు సుభాషిణి జోడీ , సుభాషిణి అమాయక ప్రేమ బాగుంటాయి . A feel good , romantic movie . సుడిలేని నిర్మాతల సినిమా . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కాదు… ఆమె మరో షర్మిల కాదు… రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం ఉంటుంది…
  • మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, నేడు నేపాల్… జనాగ్రహం బద్దలు..!
  • … బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ సైద్ధాంతిక గందరగోళం…
  • ఆనందశాస్త్రం..! science of happiness … సిలబస్‌లో ఉండాల్సిన సబ్జెక్టు..!
  • ఆ దరిద్రుడి పాత్రలో మోహన్‌లాల్… ఆ డార్క్ షేడ్స్ కథ తెలుసా మీకు..?!
  • ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’
  • అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?
  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions