Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సమానంగా పాటలు, స్టెప్పులు, సీన్లు… మల్టీస్టారర్ తిప్పలు మరి…

November 14, 2024 by M S R

.

రామానాయుడు మార్క్ సినిమా మండే గుండెలు . ఆయన సినిమాల్లో కధ , స్క్రీన్ ప్లే బిర్రుగా ఉంటాయి . రిచ్ గా సెట్టింగులు , పడవ కార్లు , మధ్య తరగతి ప్రేక్షకులు వాటన్నింటిలో తమను ఊహించుకుని ఓలలాడుతూ విహారం మస్తుగా ఉంటాయి .‌ ఇవన్నీ ఉన్నాయి ఈ సినిమాలో . కోవెలమూడి వారి వారసుడు బాపయ్య దర్శకత్వం . భారీ తారాగణం . ఇంతమంది ఏక్టర్లను ఎకామడేట్ చేస్తూ కధను వ్రాసిన గుహనాధన్ని మెచ్చుకోవాలి .

ఇద్దరు స్టార్లతో సినిమా ఎలా తీయాలో అలాగే తీసారు . ఇలాంటి ఇద్దరు హీరోల సినిమాల్లో తిప్పలు విలన్లకే . ఇద్దరి చేత సమానంగా తన్నులు తినాలి . 1979 లో వచ్చిన ఈ మండే గుండెలు సినిమా కృష్ణ , శోభన్ బాబులు కలిసి నటించిన ఏడవ సినిమా .

Ads

కధలో కొత్తదనం ఉంది . సెంటిమెంట్ , ఏక్షన్ , కామెడీ , ఫైటింగులు అన్నీ పుష్కలంగా ఉన్నాయి . కానీ , కె వి మహదేవన్ అంతటివాడు సంగీత దర్శకత్వం వహించిన రామానాయుడు సినిమాలో పాటలు వారి లెవెల్లో హిట్ కాలేదు . బాగానే ఉంటాయి . థియేటర్లో వింటానికి శ్రావ్యంగానే ఉంటాయి .‌

పాటలన్నీ ఆత్రేయే వ్రాసారు . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడిన చల్లాచల్లని సత్యభామ పాట చాలా బాగుంటుంది . ఈ పాట తర్వాత బాగుండేది ఇది ప్రేమ సామ్రాజ్యం పాట . జిల్లు జిల్లుమంటున్నాయ్ నీళ్ళు , వీడే ధీర వీర శూర భీమసేనుడు , బంగారానికి సింగారానికి కుదిరింది బేరం పాటలు శ్రావ్యంగా ఉంటాయి . సత్యనారాయణ , అల్లు రామలింగయ్యల పాట ఒరే కారయ్యా ఏరా సారా సాంబయ్య పాట ఎలా ఉన్నా వాళ్ళిద్దరి గోల బాగుంటుంది .

ప్రి-శంకరాభరణం మంజు భార్గవి ఖవాలీ డాన్సుతోనే సినిమా మొదలవుతుంది . శోభన్ బాబు , కృష్ణ , గుమ్మడి , ప్రభాకరరెడ్డి , కాంతారావు , సత్యనారాయణ , అల్లు రామలింగయ్య , కాకరాల , పి యల్ నారాయణ , మిక్కిలినేని , నూతన్ ప్రసాద్ , కె వి చలం , సారధి , జయప్రద , జయసుధ , మాధవి , అంజలీదేవి , సూర్యకాంతం , రాధాకుమారి ప్రభృతులు నటించారు . చూడండి . ఎంతమంది ఉన్నారో !

ముగ్గురు హీరోలు , ముగ్గురు హీరోయిన్లు , తన్నులు తింటానికి కావలసినంత మంది విలన్లు & వారి గేంగ్ . ఫుల్ గరం మసాలా , వినోదాత్మక సినిమా . 18 సెంటర్లలో యాభై రోజులు ఆడింది . మీ ఊరు ఉందేమో చూసుకొండి . విజయవాడ , రాజమండ్రి , విశాఖపట్నాలలో వంద రోజులు ఆడింది .

కృష్ణ , శోభన్ బాబు అభిమానులు కావాలంటే మళ్ళా చూడొచ్చు . యూట్యూబులో ఉంది . మళ్ళా కూడా చూడబులే . జయప్రద , శోభన్ బాబు , కృష్ణ ముగ్గురూ చాలా అందంగా ఉంటారు . కాబట్టి చూడబులే . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugumovie, #telugucinema …… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నాడు అల్లుడు హైజాక్ చేస్తే… నేడు కొడుకు హస్తగతం చేసేసుకున్నాడట…
  • టీబీజేపీకి దిష్టి తత్వం బోధపడింది… కళ్లు హఠాత్తుగా తెరుచుకున్నయ్…
  • వరల్డ్ క్రికెట్ అంటేనే ఇండియా… విదేశీ జట్లలో ఏకంగా 40 మంది మనోళ్లే..!!
  • అసలు ప్రేక్షకులే చూడని సినిమాకు మూడు ప్రభుత్వ అవార్డులు..!
  • సుపిత- జాతిపిత… ఎడతెగని రచ్చ… అర్హతలపై అంతులేని రాద్ధాంతం…
  • చావుతో అతి పెద్ద పోరాటం… ఆమె బతికిన తీరే ఓ అద్భుతం…
  • మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే..? అమరావతి పూలింగుకు అదే అడ్డంకి..!!
  • ఇది గోనా గన్నారెడ్డి ఏలిన కోట… ఓ ఘన చరిత్రకు శిథిల ఆనవాలు…
  • వరంగల్- కరీంనగర్… ఓ న్యూ మోడల్ పెంటాసిటీ కారిడార్..!!
  • ఆరోగ్యానికి ‘లలితకళా’ రక్ష…! ప్రొటియోమిక్స్ అంటే ఏంటి..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions