Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Largest Statue Of A Bird… ఈ జటాయువు స్మారకం గురించి మీకు తెలుసా..?

November 21, 2026 by M S R

.

( Haragopala Raju Vunikili ) …. కేరళలో జటాయువు ఎర్త్ సెంటర్…
జటాయవు … ఒక గండభేరుండ పక్షి.. ఇప్పుడు రామాయణ్ సినిమా విడుదలైన నేపధ్యంలో అందరి నోటా నానుతున్న పేరు.. లంకాధీశుడు సీతను అపహరించి తీసుకెళ్తుండగా ఈ పక్షి రాజు వీరోచితంగా పోరాడతాడు.. చివరకు తెగిన రెక్కతో రక్తమోడుతూ రాముడికి సమాచారం చెప్పి తుదిశ్వాస విడుస్తాడు..

అక్కడే శ్రీరాముడు జటాయువుకు అంతిమ సంస్కారం కూడా చేస్తాడు.. సరిగ్గా ఆ ప్రదేశంలోనే ఈ జటాయువు రాతి శిల్పం. .ఒక కొండమీద కొలువు దీరింది.. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కేరళ రాజధాని తిరువనంతపురానికి 50 కి.మీ దూరంలో కొల్లం వెళ్ళే దారిలో ఉన్న చందాయమంగళం కొండ మీద పదేళ్ళు శ్రమించి “జటాయవు ఎర్త్ సెంటర్” పేరిట తీర్చిదిద్దారు.

Ads

jatayuvu

2018లో ప్రారంభించిన ఈ కేంద్రాన్ని మహిళా సాధికారికతకు చిహ్నంగా.. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో… ఒక అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. సముద్రమట్టానికి 350 మీటర్ల ఎత్తులో పచ్చని ప్రకృతి మధ్య.. రెండు వందల అడుగుల పొడవు.. డెబ్భై అడుగుల ఎత్తు., నూట ఏభై అడుగుల వెడల్పుతో.. ప్రపంచంలో “లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాట్యూ ఆఫ్ ఎ బర్డ్” కేటగిరీలో గిన్నీస్ బుక్ లో చోటు సంపాదించింది.

దాదాపు పదేళ్ళు శ్రమించి మలయాళ సినీ దర్శకుడు, ప్రఖ్యాత శిల్పకారుడు రాజీవ్ ఆంచల్ దీన్ని రూపొందించారు. ఒకే రెక్కతో.. ముక్కు పైకెత్తి .. రెండు కలి గోళ్ళు నిలబెట్టి.. నిస్సహాయంగా రాముడి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు ఉండే…ఈ పక్షి రాజ శిల్పాన్ని దాదాపు 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ ఎర్త్ సెంటర్ లో 6 యాంఫీ థియేటర్ లో జటాయువు చరిత్రను లైట్ అండ్ సౌండ్ షో లో చూడవచ్చు. 2109లో ట్రావెన్ కోర్ రాజవంశీకులు.. అప్పటి ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీన్ని అధికారికంగా ప్రారంభించారు.

ఈ కొండ మీదకు చేరడానికి కేబుల్ కార్ సౌకర్యం ఉంది. కాకపోతే పర్యాటకుల రద్దీ వల్ల ఎక్కువ సేపు నిరీక్షించాల్సి వస్తుంది. గతంలో ఇక్కడకు నిత్యం రెండు నుంచి మూడు వేల మంది వచ్చేవారు. ఇటీవల కాలంలో ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలుస్తోంది. ఈ కొండ మీదకు ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్, ఆర్చరీ వంటి సాహస క్రీడా సదుపాయాలు ఉన్నాయి.

పూర్తిగా దక్షిణాన ఉండడం, లంకకు దగ్గరగా ఉండడం వల్ల కేరళీయులు దీన్నే జటాయువు పడిన చోటుగా నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో లేపాక్షి పుణ్యక్షేత్రం ఉంది.. గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పక్షిని.. “లే..పక్షి” అని రాముడు పిలిచాడని.. అది కాలక్రమేణా వాడుకలో.. జనం నానుడిలో లేపాక్షి గా మారిందనే కధనం ప్రచారంలో ఉంది..

వాస్తవాలు.. ఇతిహాస గాధ ఎలా ఉన్నా.. కేరళంలో ఉన్న “జటాయవు ఎర్త్ సెంటర్” మాత్రం చూడదగ్గ ప్రదేశం. ఇక్కడ ఒక రామాలయం కూడా ఉంది.. ధనుర్ధారి అయిన రాముడి రూపం చూపరులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈ కొండ మీద రాముడి పాదముద్ర గా చెప్పబడే పెద్ద పాదముద్ర కూడా ఉంటుంది.

ఆనాడు సీత ను రక్షించే క్రమంలో పోరాడి ఓడిపోయిన యోధుడిగా గురిపు పొందిన.. ఈ పక్షి రాజు స్మారకాన్ని.. “మహిళల రక్షణ.. ఆత్మగౌరవానికి ప్రతీక”గా తీర్చిదిద్దిన రాజీవ్ ఆంచల్ కృషిని మెచ్చుకోకుండా ఉండలేం.. రామాయణ్ సినిమా విడుదలయ్యాక ఈ కేంద్రానికి సందర్శకుల తాకిడి పెరిగిందనేది వాస్తవం. కేరళ రాష్ట్రానికి సహజంగానే ఓనమ్ పండుగ నుంచి మార్చి వరకు పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు రామాయణ్ సినిమా కూడా కలిసి వచ్చిందా అనేది చెప్పలేం.. త్వరలోనే ప్రధాని మోదీ కూడా ఇక్కడకు వస్తారని తెలుస్తోంది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • Largest Statue Of A Bird… ఈ జటాయువు స్మారకం గురించి మీకు తెలుసా..?
  • అంతా అతను చెప్పినట్టే జగన్ అడుగులు … భారతి చేతికి పగ్గాలు …
  • కాంగ్రెస్‌ను కాదని… ఇండి కూటమి ప్రాంతీయ పార్టీల సపరేట్ బాట !!
  • పాపం సాయిపల్లవి..! తోడుగా శ్రీలీల ఉన్నా ప్రయోజనం ఓ గుండు సున్నా!!
  • ‘అమ్మ’కు వీడ్కోలు! ఎంతటి కఠోర సన్యాసమైనా ఆ ఒక్క పేగుబంధమే!!
  • హరీష్ రావుపై సిద్దిపేటలో రేవంత్ రెడ్డి సర్జికల్ స్ట్రయిక్! 
  • అమెజాన్ అడవుల్లో ఓ ఆర్తనాదం – ‘‘మమ్మల్ని బతకనిస్తారా’’
  • “డోరతి” చూసినప్పటి నుంచి రోజుకొక్కసారైనా గుర్తుకొస్తున్నాడు…
  • ’ఆకాశంలో ఒక తార’ మెరిసింది – రోత సినిమా చీకట్లలో ‘స్పూర్తి వెలుతురు !!
  • ఆ బ్రీఫ్‌కేసు తెరిచి, ఓ ఎర్రబటన్ నొక్కగానే… అణ్వాయుధాలు పేలవు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions