.
మధురై కార్తీకదీపం కేసులో విజయ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అనీ… సుప్రంకోర్టు అనుకూల తీర్పుతో ఈసారి కార్తీకదీపం వెలిగించడానికి మోదీ గానీ, అమిత్ షా గానీ అక్కడికి వెళ్లే అవకాశం ఉందనీ.., తమిళనాడులోని హిందూ వ్యతిరేక వర్గాలకు- పార్టీలకు చెంపపెట్టు అనీ… కొన్ని కథనాలు కనిపిస్తున్నాయి… కానీ కథ ఇంకా ముగియలేదు…
వివరాల్లోకి వెళ్తే.., తిరుపరంకుండ్రం దగ్గర ఓ దీపస్థంభం… అక్కడ దీపాలు వెలిగించడం ఎన్నో తరాల నుంచి వస్తున్న హిందూ ఆధ్యాత్మిక ఆచారం… కానీ నాస్తిక, హిందూ వ్యతిరేక డీఎంకే స్టాలిన్ ప్రభుత్వం ఆ ఆచారాన్ని కాదనడమే కాదు, కోర్టులో దాన్ని ఎగతాళి చేసింది… అది దీపస్థంభం కాదు, సర్వే స్థంభం మాత్రమే అని పేర్కొంది…
Ads
పాత రికార్డులన్నీ పరిశీలించిన దిగువ కోర్టులు కార్తీకదీపం వెలిగించడానికి అడ్డుపడకూడదని ప్రభుత్వానికి చెప్పాయి… స్టాలిన్ ప్రభుత్వం అమలు చేయలేదు సరికదా… ఆ తీర్పు చెప్పిన న్యాయమూర్తి స్వామినాథన్‌నే టార్గెట్ చేసింది… కేంద్రంలోని హిందూ వ్యతిరేక ఎంపీలను 100 దాకా కూడగట్టి (కాంగ్రెస్ కూడా) అభిశంసనకు ప్రయత్నాలు చేసింది…
మద్రాస్ హైకోర్టు ధర్మాసనం కూడా ఆ జస్టిస్ ఇచ్చిన తీర్పును సమర్థించింది… ఈ అభిశంసన ప్రయత్నం న్యాయవ్యవస్థపై దాడి అని మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు విరుచుకుపడ్డారు… ఈలోపు ఆ ప్రభుత్వమే కొట్టుకు పోయింది, కొత్తగా విజయ్ ప్రభుత్వం వచ్చింది… తనదీ హిందూ వ్యతిరేక ధోరణే కదా… సుప్రీంకోర్టుకు వెళ్లాడు… ఇదీ వివాదంపై గతంలో ముచ్చట కథనం…
నాడు పినరై… నేడు స్టాలిన్..! హిందూ వ్యతిరేకతలో దొందూ దొందే…!!
ఇప్పుడు సుప్రీంకోర్టు దీపాథూన్ దగ్గర కార్తీకదీపం వెలిగించుకోవడానికి అనుమతి ఇచ్చింది… కానీ ఇది కేవలం మధ్యంతర ఆదేశాలు మాత్రమే, అంతిమ తీర్పు కాదు, పైగా మద్రాస్ హైకోర్టు ఆదేశాల్ని తాత్కాలికంగా పెండింగ్‌లో పెట్టింది… జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం. పంచోలీలతో కూడిన ధర్మాసనం ఈ ఏడాది పండుగకు మాత్రమే పరిమితమైన తాత్కాలిక ఏర్పాటుకు అనుమతించింది…
ఇదేమీ అంతిమ తీర్పు కాదు, సో, హోం మంత్రి లేదా ప్రధాని కార్తీకదీపం వెలిగించడానికి వెళ్తారా అనేది సందేహమే… వెళ్లకపోవచ్చు..! సుప్రీంకోర్టు తన ఆదేశాల్లోనే ఇది కేవలం ఈ ఏడాదికి మాత్రమే వర్తించే తాత్కాలిక ఏర్పాటు అని, దీనిని భవిష్యత్తులో శాశ్వత హక్కుగానో లేదా సంప్రదాయంగానో పరిగణించకూడదని స్పష్టం చేసింది…
అంతేకాదు, దీపం వెలిగించే సమయంలో ఆ ప్రాంతానికి సాధారణ ప్రజలు, భక్తులు వెళ్లడానికి వీల్లేదు… కేవలం ఆలయ నిర్వహణ ప్రతినిధులు, అనుమతి పొందిన ప్రభుత్వ అధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది… ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రదర్శనలు, ఊరేగింపులు, నినాదాలు లేదా గుంపులుగా చేరడంపై కోర్టు నిషేధం విధించింది…
శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైతే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) సహాయం తీసుకోవాలని, పురావస్తు శాఖ (ASI) నిబంధనల ప్రకారం స్మారక చిహ్నానికి ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని మదురై జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది… ప్రధాన వివాదంపై 2027 జనవరి రెండో వారంలో తదుపరి విచారణ జరగనుంది…!!

Share this Article