Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఎన్టీయార్ సినిమా అన్నాక మారువేషాలు ఉండాలి కదా… ఉన్నాయి…

July 16, 2024 by M S R

నిర్మాత అదృష్టవంతుడు అయితే సినిమా వంద రోజులు ఆడుతుంది . అందులో NTR సినిమా . సాదాసీదా సినిమా అయినా వంద రోజులు ఆడిన సినిమా 1974 లో వచ్చిన ఈ మనుషుల్లో దేవుడు సినిమా . పుండరీకాక్షయ్య నిర్మాత . బి వి ప్రసాద్ దర్శకుడు .

వారాలు చేసుకుని శ్రధ్ధగా చదువుకునే ఒక అనాధను ఒక డాక్టర్ చేరదీసి , చదివించి ప్రయోజకుడిని చేస్తాడు . ఈలోపు ఓడలు బండ్లు అయి ఆ డాక్టర్ సంపదను పోగొట్టుకుని , పక్షవాతంతో వాలు కుర్చీ పాలవుతాడు . అసలు కొడుకు దారి తప్పుతాడు . కూతురు పెళ్లి ఆగిపోతుంది . ఈ సమస్యలన్నీ పరిష్కరించి , ఆ కుటుంబాన్ని గట్టెక్కిస్తాడు హీరో NTR .

ntr

Ads

NTR ఉన్నాక మారువేషాలు లేకుండా ఎలా ! ఈ సినిమాలో కూడా మారువేషాలు ఉన్నాయి . NTR , వాణిశ్రీ , బి సరోజాదేవి , గుమ్మడి , కృష్ణంరాజు , అంజలీదేవి , రాజబాబు , విజయలలిత , పి ఆర్ వరలక్ష్మి , రామ్మోహన్ , ధూళిపాళ , సాక్షి రంగారావు , రేలంగి ప్రభృతులు నటించారు .

అంధురాలిగా చిన్న పాత్ర అయినా బి సరోజాదేవి చక్కగా నటించింది . వాణిశ్రీకి తన నటనను ప్రదర్శించే పాత్ర కాదు . రొటీన్ హీరోయిన్ పాత్రే . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసినట్లు గుర్తు . టివిలో కూడా చూసా . యూట్యూబులో ఉంది . NTR అభిమానులు చూడవచ్చు . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు …….. ( By డోగిపర్తి సుబ్రహ్మణ్యం )


ఈ సినిమాకు మొదట సంగీత దర్శకుడు టీవీ రాజు… ఆయన తదనంతరం ఆ బాధ్యతల్ని ఎస్ హన్మంతరావు తీసుకున్నాడు… అహో హిమవన్నగము పేరిట ప్రముఖ రచయిత సినారె రాసిన వరూధిని ప్రవరాఖ్య గీతనాటకాన్ని కలర్‌లో చిత్రించినా సరే పెద్ద నాణ్యత కనిపించదు… పైగా ఆ నాటకం కూడా పెద్దగా హిట్ కాలేదు… ఘంటసాల, సుశీల పాడగా నడుమ వాణిశ్రీ, ఎన్టీయార్ మాటలతో గొంతు కలిపారు… (ముచ్చట) v9 video’s సౌజన్యంతో ఆ వీడియో లింక్..,

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions