Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !

September 20, 2026 by M S R

.

Subramanyam Dogiparthi … పరిపక్వ ప్రజాస్వామ్యం (Matured Democracy) అంటే ఇలా ఉండాలి . గతంలో చూసాం . ఒరిస్సా కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాజీ అయిపోయిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ హాజరు కావటం . ఇలాంటిదే ఓ ఘటన ఇప్పుడు కేరళలో జరిగింది .‌

ఇక్కడ ఒక బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొన్నది స్థానిక పూంజర్ ఎమ్మెల్యే MJ సెబాస్టియన్, మాజీ ఎమ్మెల్యే సెబాస్టియన్ కలతుంకాల్ . ప్రస్తుత ఎమ్మెల్యే కాంగ్రెస్ కాగా ఓడిపోయింది LDF ఎమ్మెల్యే. మామూలుగా గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలు కష్టపడి పనులు చేసి ఓడిపోతే, కొత్త ఎమ్మెల్యేలకు ప్రారంభోత్సవ గౌరవాలు దక్కటం సహజం. మన ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అయితే కనీసం ఆహ్వానం కూడా పంపే పరిస్థితి లేదు .

Ads

ఈ గ్రామానికి కాలువ దాటేందుకు బ్రిడ్జి లేకపోతే అప్పటి LDF కూటమి ఎమ్మెల్యే తన MLA నిధుల నుండి 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి కారణభూతులయ్యారు . ఇంతలో ప్రభుత్వం మారింది . LDF MLA ఓడిపోయారు . ప్రస్తుత కాంగ్రెస్ MLA సెబాస్టియన్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ఒప్పుకోలేదు.

ఆ బ్రిడ్జి నిధులు , నిర్మాణం మొత్తం మాజీ ఎమ్మెల్యే ఘనత ; అందులో నా గొప్ప ఏమీ లేదు ఆ బ్రిడ్జిని ఆయనే ప్రారంభించాలని పట్టుబట్టి, ప్రోటోకాల్ కాదని అధికారులను ఒప్పించి మరీ, మాజీ ఎమ్మెల్యే చేత ప్రారంభించి, క్రెడిట్ మొత్తం ఆయనకే కట్టబెట్టారు కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇదంతా కొట్టాయం జిల్లాలో జరిగింది .

good spirit

ఎంత గొప్ప సాంప్రదాయం !? దేశంలో అన్ని పార్టీల నాయకులు , ప్రజాప్రతినిధులు ఇలాంటి గొప్ప సాంప్రదాయాలను పాటిస్తే దేశం ఎంత ప్రశాంతంగా ఉండునో !! క్రెడిట్ చోరీల వివాదాలు ఉండవు . గత ప్రభుత్వాలకు పేరు వస్తుందని పేర్లు మార్చటం , ప్రభుత్వ సంస్థలను ప్రైవేటోళ్ళకు సంతర్పణ చేయటం వంటివి ఉండవు . జనం సుఖశాంతులతో బతుకుతారు …

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మైండ్ బ్లాకయ్యేలా… జన్వాడ భూముల ‘మోడస్ ఆపరెండి’…
  • పరిపక్వత – రాజకీయాల్లో, వ్యక్తిగత తత్వాల్లో… మంచి ఉదాహరణ !
  • బాలయ్య కొడుకు ఎంట్రీకి ఈ కథ సరిగ్గా కుదురుతుందేమో..!!
  • మోదీకి తెలిసొచ్చిందట – దక్షిణ రాజకీయాలపై మతప్రభావం !!
  • యుద్ధం ముదురుతోంది – ప్రపంచ దేశాలన్నీ లాగబడుతున్నయ్ !!
  • ‘‘ ఆ వృద్ధ టిబెటన్ షెర్పా ఆఫీసర్ నా మెంటల్ మ్యాప్ మార్చేశాడు ’’
  • అంతటి కమలహాసన్ సైతం… ఆ అక్కినేని సీన్లలో వెలవెలా..!!
  • ఇరుముడి ! థియేటర్- ఓటీటీ వీక్షకుల వేర్వేరు స్పందనలు..!!
  • కనిమొళి థర్డ్ ఫ్రంట్ ప్రయాస – కేసీయార్ రెడీయా..? సాహసిస్తాడా..?
  • ‘‘ వసూళ్లు తప్ప విలువల్లేవు – నేనిక నటించను – ఇక చాలు ’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions