.
మెట్ గాలా రెడ్ కార్పెట్‌పై 142 కోట్ల రూపాయల ఆభరణాలతో మెరిసిన మేఘా సుధా రెడ్డి… విమర్శలకు తావిచ్చిన ఆమె కొన్ని రోజులకే “సింప్లిసిటీ, ఫెయిత్, ఫ్యామిలీ” అంటూ ఆలయ ప్రాంగణంలో కనిపించింది. కానీ అక్కడ కూడా చర్చకు కారణమైంది భక్తి కాదు, రాజస ప్రదర్శనే.
“After the whirlwind of the red carpet, returning to the simplicity of home, faith, and family felt deeply grounding” అంటూ ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్‌లో వినయం, ఆధ్యాత్మికత, మూలాలవైపు తిరిగి రావడం వంటి భావాలు కనిపించినా… ఆ పోస్ట్‌కు జతైన విజువల్స్ మాత్రం పూర్తిగా భిన్నమైన సందేశాన్ని ఇస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Ads
“Visited my temple village” అని ఆమె స్వయంగా రాయడంతో ఇది డోకిపర్రు ఆలయం అయి ఉండొచ్చన్న చర్చ నడుస్తోంది. కానీ ఆధ్యాత్మిక యాత్రగా చెప్పుకున్న ఈ సందర్శనలో కనిపించిన ఎర్ర కార్పెట్, రంగురంగుల రాజఛత్రం, ప్రత్యేక మర్యాదలు, VIP ట్రీట్‌మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తున్నాయి. దేవుడి సన్నిధిలో భక్తుడు సాధారణుడిగా ఉండాలా? లేక సంపద, హోదా, ప్రాధాన్యం, అసాధారణ ప్రదర్శన అక్కడ కూడా వెంట రావాలా? అనే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది.
దక్షిణ భారత ఆలయ సంప్రదాయాల్లో విశిష్ట అతిథులకు ఛత్రం వంటి మర్యాదలు కొత్తవి కావు. కానీ ఇక్కడ అభ్యంతరం సంప్రదాయంపై కంటే ప్రదర్శనపైనే ఎక్కువగా కనిపిస్తోంది. “దేవుడికి మించిన అలంకారాలు, ఉపచారాలు భక్తుల్లో ఓరకమైన నెగెటివిటీని నింపుతాయి” అనే కామెంట్లు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా “సింప్లిసిటీ” అనే పదం వాడిన అదే పోస్ట్‌లో రాజమర్యాదల విజువల్స్ కనిపించడం చాలామందికి అసహజంగా అనిపిస్తోంది.

పోస్ట్‌లో మరో లైన్ కూడా విమర్శలకు కారణమైంది. “Touched to receive a beautiful bouquet with a heartfelt note from Sahithya” అని ఆమె రాసింది. ఆలయ దర్శనం, సాత్విక భోజనం, ఆధ్యాత్మికత మధ్యలో కూడా బొకేలు, వ్యక్తిగత నోట్లు, వెల్‌కమ్ మూమెంట్స్ ప్రస్తావన రావడం — ఇది భక్తి యాత్రకంటే curated elite experience లాగా కనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి.
అవును, ఆమె అన్నదానంలో కూర్చుని సాత్విక భోజనం చేయడం కూడా పోస్ట్‌లో ఉంది. “Feeling grateful, grounded and truly blessed” అని ముగించింది కూడా. కానీ అదే సమయంలో మెట్ గాలాలో కోట్ల విలువైన నగలతో కనిపించిన వ్యక్తి, కొద్ది రోజులకే “simplicity”, “grounded”, “Satvik lunch” అని చెప్పినప్పుడు — ఆ మాటలకు విజువల్స్ match కావడం లేదనే భావన మరింత బలపడింది.
ఇక్కడ చాలామందికి గుర్తొచ్చిన మరో విషయం — Annamayya సినిమాలో కనిపించే రాజస దృశ్యాలు. ఆ సినిమాలో నాగార్జున పాత్ర తన మరదళ్లకు ఛత్రం పట్టే సన్నివేశాలు ఉంటాయి. రాజవంశీయులు, పెద్దమనుషులు, విశిష్ట మహిళలకు అలాంటి మర్యాదలు చేయడం అప్పటి రాజరికపు సామాజిక- సాంస్కృతిక వ్యవస్థలో భాగం. దేవాలయ సంస్కృతి, రాజమర్యాదలు కలిసిపోయిన కాలం అది. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్య కాలం. సోషల్ మీడియా యుగం. ప్రతి విజువల్ ఒక public statementగా మారే కాలం.
అందుకే ఈ ఫొటో చాలామందికి “భక్తి” కంటే “రాజసపు ప్రదర్శన”గానే కనిపిస్తోంది. ఆలయంలో కూడా హై-ప్రొఫైల్ ఎంట్రీ, ప్రత్యేక మార్గం, ప్రత్యేక ఛత్రం, ప్రత్యేక విజువల్ ట్రీట్‌మెంట్… ఇవన్నీ కలిపి చూస్తే “faith” కంటే “status projection” ఫీలింగ్ ఎక్కువగా వస్తోందనే విమర్శ వినిపిస్తోంది. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటం ఒక రకం… ఎదిగేకొద్దీ ప్రతి ప్రదేశం కూడా తన స్థాయిని ప్రతిబింబించే వేదికగా మారటం మరో రకం… సుధా రెడ్డి తాజా ఆలయ విజిట్ చుట్టూ నడుస్తున్న చర్చ అసలు అక్కడే నిలిచిపోయింది….
Share this Article