ఒక గొప్ప ఫిక్షన్ అది… చాలామందికి తెలియని కథ… అప్పట్లో ఓ భారీ యుద్ధం, ఆ కళింగ యుద్ధంలో లక్షల మంది ప్రాణనష్టం, రాజ్యమంతా విషాదం… ఎందుకు గెలిచానో అర్థం కాని అయోమయంలో… ఆత్మమథనంలో… నాటి సామ్రాట్ అశోకుడు శాంతి వైపు వెళ్తాడు… బౌద్ధాన్ని స్వీకరిస్తాడు… పాలనపై దృష్టి పెడతాడు…
ఆక్రమంలోనే తనకు అపారమైన భారతీయ జ్ఞానం గురించి తెలుస్తుంది… మనిషిని దైవాన్ని చేసే శాస్త్రాల గురించి తెలుస్తుంది… వాటిని కాపాడాల్సిన అవసరమూ, కర్తవ్యమూ గుర్తొస్తుంది… మరి ఎలా..?
ఆ ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చినవారే తొమ్మిది మంది అజ్ఞాత యోధులు… జ్ఞానసంపన్నులు… తన రాజ్యమంతా గాలించి, ఆ పనులకు అర్హులను పట్టుకుంటాడు అశోకుడు… విడివిడిగా కర్తవ్యం బోధిస్తాడు… ఒక్కొక్కరికీ ఒక తరహా జ్ఞానాన్ని అప్పగించి, తరతరాలు దాన్ని కాపాడే బాధ్యత మీదేనంటాడు… ఇదీ ఆ ఫిక్షన్ నేపథ్యం…
Ads
ఒక్కడ ఓ తిరకాసు ఉంది… ఈ తొమ్మిది మందీ కలిస్తే సమాజానికి ప్రమాదంగా పరిణమించే అవకాశమూ ఉంది… అందుకని ఒకరి వివరాలు ఒకరికి తెలియకూడదు… అసలు సమాజానికి కూడా వాళ్లెవరో తెలియకూడదు… వంద శాతం గోప్యత పాటించాలి… ఒకవేళ ఎవరైనా మరణిస్తే, అనారోగ్యం పాలైనా, ఈ విధి నుంచి తప్పుకుంటే, ఆ స్థానంలో మరో అర్హుడిని నియమించాలి… ఆ పరంపర అలా కొనసాగాలి… ఇలా 2000 ఏళ్లుగా ఆ అజ్ఞాత వ్యవస్థ నడుస్తూనే ఉంది… ఇదీ చాన్నాళ్లుగా ఉన్న ఓ ఫిక్షన్ కథ…
ఈ తొమ్మిది మంది రసవాదం, విశ్వోద్భవ శాస్త్రం, కమ్యూనికేషన్, గురుత్వాకర్షణ, కాంతి, సూక్ష్మజీవశాస్త్రం, ప్రచారం, శరీరధర్మ శాస్త్రం, సామాజిక శాస్త్రం వంటి విభిన్న అంశాలలో నిపుణులు… 1923లో ఆంగ్ల రచయిత టాల్బోట్ ముండీ ప్రచురించిన ది నైన్ అన్‌నోన్ మెన్ అనే పుస్తకంలో ఈ సమాజం ప్రస్తావన ఉంది… ఈ తొమ్మది మంది మిస్టరీ మీద బోలెడు యూట్యూబ్ వీడియోలు, కథనాలు, పుస్తకాలు గట్రా వచ్చాయి… ఆసక్తికరం ఏమిటంటే… ఈ తొమ్మిది మంది తొమ్మిది పుస్తకాలు రాశారట… ఉన్నాయి
- ఫిజియాలజీ: ఒక వ్యక్తిని స్పర్శతో చంపే పద్ధతి, ఇది నరాల ప్రేరణను తిప్పికొట్టడం… ఈ పుస్తకం నుండి వెలువడిన జ్ఞానమే జూడో యుద్ధ కళకు జన్మ… (మార్షల్ ఆర్ట్స్)…
- కమ్యూనికేషన్: భూజీవులు, గ్రహాంతరవాసుల మధ్య కమ్యూనికేషన్ పద్ధతులు… గ్రహాంతరవాసుల జాడ గురించి తెలుసుకుందట ఆ కూటమి… (ఏలియెన్స్)…
- గురుత్వాకర్షణ: ఒక విమానాన్ని ఎలా నిర్మించాలో చెప్పడంతోపాటు గురుత్వాకర్షణ రహస్యాల గురించి… (
- మైక్రోబయాలజీ: ఈ పుస్తకంలో మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీలపై అవగాహన… స్టెమ్ సెల్స్ సహా…
- ప్రచారం: ఈ పుస్తకం ప్రభావ ప్రచారం, మానసిక యుద్ధ వ్యూహాలను వివరిస్తుంది… (మైండ్ గేమ్స్)…
- విశ్వోద్భవ శాస్త్రం: విశ్వాన్ని అధ్యయనం, జీవం పుట్టుక, ఖగోళ రహస్యాలే ఇతివృత్తం…
- రసవాదం: ఈ పుస్తకం లోహ పరివర్తన, రసవాదానికి సంబంధించినది… ఏదైనా లోహాన్ని బంగారంగా ఎలా మార్చాలో తెలియడమే రసవాదం…
- కాంతి: ఈ పుస్తకం కాంతి లక్షణాలు, వేగం, తీవ్రతతో పాటు దాన్ని ఆయుధంగా ఉపయోగించుకునే మార్గాల గురించి వివరించింది… (లేజర్ వెపన్స్)…
- సోషియాలజీ: ఈ పుస్తకం సమాజ పురోగతికి మార్గదర్శకాలను అందించింది… విధ్వంసాన్ని ముందుగానే కనిపెట్టే మార్గాలను అందించింది…
ఫిక్షనే… కానీ నిజంగానే మనిషి మనుగడను ప్రభావితం చేయబోయే అత్యంత కీలకమైన రంగాలు ఇవి… సరే, దీనికి అనుసరణగా, కొనసాగింపుగా కూడా బోలెడంత కంటెంటు ప్రపంచ సాహిత్యంలో క్రియేట్ చేయబడింది… మన భారతీయ ఇంగ్లిష్ రచయితలు కూడా ఈ కంటెంటు భిన్నరకాలుగా టచ్ చేశారు… ఈ 9 మంది రహస్య జ్ఞానానికి, ఆ వ్యవస్థ కొనసాగింపుకు గ్రహణం పట్టబోతోంది… దాన్ని అరికట్టడానికి ఓ జననం ఉంటుంది… అతను ఎవరు..? ఆ మెగా సుప్రీం సూపర్ హీరో ఎవరు..?
సరిగ్గా ఈ కథతోనే తేజ సజ్జ హీరోగా రాబోతున్న మిరాయ్ సినిమా… నిన్న దాని గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు… మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తాడని ఓ టాక్… నిజానికి దీన్ని ఆ ఫిక్షన్ రేంజులో ఓ రెండు గంటల సినిమాగా చిత్రీకరించడం, అదీ ప్రేక్షకుల్ని కనెక్ట్ చేస్తూ, కన్విన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే రాసుకోవడం పెద్ద టాస్క్… వోకే, మన తెలుగులో ఇలాంటి భిన్నమైన కథాంశాలు రావడాన్ని ఆహ్వానిద్దాం…! అసలే మన దిక్కుమాలిన స్టార్ హీరోల చెత్తా కథాంశాలతో కొత్త కథలకు మొహం వాచిపోయి ఉన్నాం..!!
Share this Article