.
Just Asking అంటూ ఎప్పుడూ ఏవో కూతలతో, రాతలతో వార్తల్లో ఉండే ప్రకాష్ రాజ్ మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఈసారి బెంగుళూరు మేజిస్ట్రేట్ కోర్టు తనకు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. ఆల్రెడీ ధర్మస్థల కుట్రలో తన ప్రమేయం పాత్ర ఇప్పటికే చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే కదా…
ధర్మస్థల కుట్రకు కేరళ నుంచి 200 కోట్లతో స్కెచ్ వేశారనేది ప్రధాన ఆరోపణ… మాస్ బరియల్ (సామూహిక ఖననాల) కేసు కొన్నిరోజులు కర్నాటకకు కుదిపేసింది కదా… ఆ కేసులో ప్రధాన నిందితులు ప్రకాష్ రాజ్‌తో టచ్‌లో ఉన్నారనేది వాస్తవం. కర్నాటక హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో తన పేరు కూడా ఉంది…
Ads
ఇవే ఆధారాలతో మీడియా రాస్తున్న వార్తలను ఖండించడానికి ప్రెస్‌మీట్ పెట్టాడు, రిపోర్టర్లు పక్కాగా Just Asking అంటూ ఆధారాలతో ప్రశ్నలు అడుగుతుంటే, ఉడికిపోయాడు, చివరకు అర్థంతరంగా ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయాడు… సోషల్ మీడియాలో “అమ్ముడుపోయిన వారు (Sold out media)” అంటూ అంతకుముందు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశాడు…
అదే ప్రెస్ మీట్ సందర్భంగా జర్నలిస్టులు ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు… తాము అమ్ముడుపోయామని ఎలా అంటారని, నిర్దిష్ట ఆధారాలు చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు… దాంతోపాటు ధర్మస్థల కేసులోని లింకులపై మీడియా ప్రతినిధులు సూటి ప్రశ్నలు సంధించారు…
నేను చెప్పింది రాసుకోవాలి, ఇంకేమీ అడగొద్దు అనేది ప్రకాష్ రాజ్ ఉద్దేశం… ఇప్పుడు తాజా వివాదం ఏమిటంటే..? మల్టిపుల్ ఓటర్ ఐడీలు… రూల్స్ ప్రకారం ఒకరికి ఒకే ఓటు ఉండాలి… కానీ తనకు కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చట్టవిరుద్ధంగా ఓటర్ కార్డులు ఉన్నాయని బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది…
ఈ కేసు విచారణకు సంబంధించి కోర్టు రెండుసార్లు సమన్లు జారీ చేసినా ప్రకాష్ రాజ్ హాజరుకాలేదు. న్యాయస్థానాన్ని బేఖాతరు చేయడంతో బెంగళూరు కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే ప్రకాష్ రాజ్ ఈ ఆరోపణలను సోషల్ మీడియా వేదికగా కొట్టిపారేశారు. తనకు కేవలం తమిళనాడులోనే ఒకే ఒక ఓటర్ ఐడీ ఉందని, ఇవన్నీ తన ప్రత్యర్థులు సృష్టిస్తున్న తప్పుడు వార్తలని (Fake News) కొట్టిపారేశాడు.
ఈ కేసు విషయంలో కూడా సోషల్ మీడియా గాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాతో మరో ప్రెస్ మీట్ గనుక ఏర్పాటు చేస్తే, మరోసారి ఆడుకోవాలని బెంగుళూరు మీడియా ఆసక్తిగా ఉంది. అన్నట్టు ఆమధ్య కొన్నిరోజులు ప్రకాష్ రాజ్ కేసీయార్ చుట్టూ తిరిగాడు… దేవగౌడ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో జరిగిన కేసీయార్ భేటీల్లో ప్రకాష్ రాజ్ ప్రధానంగా కనిపించాడు కొన్నాళ్లు…
తనేమీ పొలిటిషియన్ కాదు, జస్ట్, ఒక నటుడు… మరెందుకు కేసీయార్ తన టీమ్‌లో ప్రకాష్ రాజ్‌ను వెంట ఉంచుకుని మరీ తిరిగాడు..? ఏమిటో ఆ మర్మం..! కవిత బయటపెడితేనే తెలియాలి ఇక..! ఎప్పుడూ ప్రకాష్ రాజ్ ఓ క్వశ్చన్ మార్క్ కేరక్టరే..!!
Share this Article