Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

దిక్కుమాలిన క్రియేటివిటీ అని ఈసడింపా..? పెటా కోరిందీ అదే మరి..!!

June 17, 2025 by M S R

.

మార్కెటింగ్, ప్రచారాలు రకరకాలు… ఒక అంశాన్ని పాజిటివ్‌గా చెప్పడంకన్నా నెగెటివ్ ప్రచారం జరిగేలా చేస్తే, ఆ అంశం మరింత బలంగా జనంలోకి వెళ్తుంది… ఇదొక ట్రెండ్… దాని లక్ష్యం జనం చర్చించుకునేలా చేయడం…

అప్పట్లో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా? అనే స్లోగన్ ఎయిడ్స్ మీద ఎంత చర్చను లేవనెత్తిందో చూశాం కదా… సరే, ప్రస్తుతం పెటా ( people for the Ethical Treatment of Animals ) చేస్తున్న ఓ ప్రచారం చూద్దాం… బెంగళూరు, భోపాల్, నొయిడా, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ వంటి కొన్ని నగరాల్లో హోర్డింగ్స్ పెట్టారు…

Ads

వాటిల్లో ఓ కుక్క పాలు తాగుతూ కనిపిస్తుంది ఓ మహిళ… మీరు కుక్క పాలు తాగకపోతే, వేరే జాతుల పాలు ఎందుకు తాగుతారు? అనే శీర్షిక… ఏ జాతి జంతువు పాలు తాగినా ఇంతే అన్నట్టుగా… ఇలా…

peta

పెటా వాళ్లు కావాలనే… అంటే నెగెటివ్ ప్రచారం ద్వారా జనంలోకి ఈ అంశం వెళ్లాలనుకున్నారో, లేక దిక్కుమాలిన క్రియేటివిటీ కారణంగా జనంలో వ్యతిరేకత వచ్చిందో తెలియదు గానీ.., నెటిజనం సీరియస్‌గా, నెగెటివ్‌గా రియాక్టయ్యారు…

పరమ దరిద్రమైన క్రియేటివిటీ అని ఈసడించుకున్నారు మెజారిటీ జనం… శాకాహారాన్ని ప్రమోట్ చేయడంలో డెయిరీని, పాడి పరిశ్రమను, పాల వినియోగాన్ని కూడా వ్యతిరేకించడం కూడా ఉంటుందా..? ఏమో, తెలియదు.., పెటాకే తెలియాలి…

ఆవు పాలిచ్చే యంత్రం కాదు, దూడలను బలవంతంగా విడదీసి, ఆ పాలు మనం తాగుతున్నాం, పాలు దూడల సొత్తు అనేది పెటా ప్రచారం… మాంసాహారం తినడం పాలు తాగడం ఒకటేనా..? సపోజ్, ఒక కాయ కోసుకుని తింటున్నాం, కానీ అది మనం తినడం కోసం కాదు పుట్టింది… దానికీ జీవం ఉంది… భూమిపై పడి మొలకెత్తేదాకా విత్తనానికి పోషకాల్ని అందించడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటు… సో, వీగన్‌ను కూడా అదే దృష్టిలో చూడొచ్చా…

వోకే, మనుషుల అతి మాంసాహారంకన్నా శాకాహారమే ఆరోగ్యపరంగా బెటర్ అనేది వేరే సంగతి… పైగా ఇలా తవ్వుకుంటే పోతే ఇక ఏమీ తినలేడు మనిషి… ఒక జీవిని మరో జీవి తినడం అనేదే ఆగిపోతే, అలా చేస్తే జీవావరణమే బ్యాలెన్స్ తప్పుతుంది కూడా… సరే, అది వేరే డిబేట్… పెటా ప్రచారం చేస్తున్న ఫోటో అస్సలు బాగాలేదు చూడటానికి…

స్టుపిడ్ కంటెంట్ విత్ స్టుపిడ్ ప్రజంటేషన్ అనే విమర్శలే ఎక్కువ వచ్చాయి నెటిజనం నుంచి… మీకు పిల్లల మీదకన్నా దూడల మీదే ఎక్కువ ప్రేమ… పిల్లలు మరేం తాగాలి అనే ప్రశ్నలు కూడా… మీకు ఈ ఫోటో ఇంత డిస్టర్బింగుగా ఉంటే వాస్తవం మరింత డిస్టర్బింగో తెలియాలి కదా అనే కొన్ని సమర్థనలు కూడా..! మొత్తానికి పెటా తను కోరుకున్నట్టుగా జనంలోకి వెళ్లినట్టేనా ఈ వీగన్ ప్రచారం..!?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రొఫెషనల్ ఆందోళనకారుల మ్యాపింగ్… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ యాక్షన్…
  • జగమంత హాస్పిటల్ మాది… ఐసీయూ జీవితం మాది…
  • Konkona Sen … అమ్మతనానికి పెళ్లితే పనేంటి..? ప్రేమకు వయస్సుతో పనేంటి..?
  • ఈ దళపతి సీఎం జోసెఫ్ విజయ్ కాదు… రజినీకాంత్…
  • Drone Warfare … 5 లక్షల మందితో ‘డ్రోన్ ఆర్మీ’… ప్రత్యేక శిక్షణ…
  • నాటి ఆ స్వాతికిరణం గంగాధరం ఇప్పుడేం చేస్తున్నాడు..?
  • SCCL … సింగరేణి కుటుంబాలకు కోటి రూపాయల భరోసా…
  • ‘ఓటీటీలపై ఆశలు పెట్టుకుని సినిమాలు తీయకండి’… అల్లు ఉద్బోధ…
  • బాబును ఏమీ అనలేడు- పవన్‌ తప్పనలేడు- జగన్‌ను అనకుండా ఉండలేడు…
  • సీజేపీ ధర్నా… బొద్దింకల పేరిట ‘యాంటీ మోడీ’ సెక్షన్ హంగామా…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions