.
ఎవరేం చెప్పినా సరే… తెలుగు రాష్ట్రాల బీరు ప్రియులకు బాగా నచ్చిన బ్రాండ్ కింగ్ ఫిషర్… లైట్ గానీ, స్ట్రాంగ్ గానీ, టిన్ గానీ… ఏదైనా సరే, ఇతర బ్రాండ్లతో పోలిస్తే చౌక… నాణ్యత…
కింగ్ ఫిషర్‌కు అలవాటైనవాడు మరింత ఖరీదైన బ్రాండ్ల జోలికి పోడు… మరీ లైట్ బీర్లకు విపరీతమైన గిరాకీ… అందుకే రెండు తెలుగు రాష్ట్రాల బీరు మార్కెట్లలో కింగ్ ఫిషర్‌దే ఆధిపత్యం… మెజారిటీ షేర్ దానిదే… వేసవి వస్తే ఇక చెప్పనక్కర్లేదు…
Ads
దాని ఓనర్ దేశాలు పట్టిపోయినా… అజ్ఞాతంలో బతుకుతున్నా… తన బ్రాండ్ బీరు మాత్రం ఇక్కడ మద్యరాజ్యం ఏలుతోంది… ఇప్పుడు ఆ బ్రాండ్ ఇక తెలంగాణలో కనిపించకుండా పోనుంది… నిజమేనా..?
నిజమే… ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లిమెల్లిగా కింగ్ ఫిషర్‌ను వైన్స్ షాపుల్లో కనిపించకుండా చేస్తున్నారు… వేసవిలోనైతే మరీ ఘోరం… అఫ్‌కోర్స్, ఇప్పటికీ అంతే… అదేమంటే..? ధర తక్కువ అనే భావంతో ఆ కంపెనీయే సప్లయ్ తగ్గించేసిందని అంటారు…
కావచ్చు కూడా… ఎందుకంటే, ఎంత అడిగినా ధర పెంచడం లేదు సర్కారు… పైగా వందల కోట్ల బకాయిల్ని చెల్లించడం లేదు… ఇప్పుడిక మొత్తం సప్లయ్ బంద్ పెడతామని చెప్పింది… పోతేపో… మద్యం ధరల్ని పెంచేది లేదు… నీ బకాయిలు మెల్లిగా క్లియర్ చేస్తాను అని చెబుతోంది సర్కారు… ఏం, బ్లాక్ మెయిల్ చేస్తున్నదా ఆ కంపెనీ అనేది కోపం…
సరే, మంచిదే… అది గాకపోతే మరో బీర్ అంటారా…? ఈ ధోరణి జగన్ హయాంలో ఏపీలో అడ్డగోలు ధరలకు చీప్ లిక్కర్ అనగా రంగుసారా అమ్మించినట్టే ఉంటుంది… వెంటనే కొత్త కంపెనీలను చూడండి, పర్మిషన్లు ఇచ్చేద్దాం అంటున్నాడు ముఖ్యమంత్రి…
సర్కారు వచ్చిన కొత్తలో ఏదో బ్రాండ్‌కు హడావుడిగా పర్మిషన్లు ఇవ్వడం వెనుక ఏవో ముడుపుల బాగోతం ఉందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపించాయి… వాటిని రద్దు చేశారు… ఇప్పుడు ప్రభుత్వమే సీఎం స్థాయిలో కొత్త బ్రాండ్లకు వెల్‌కమ్ అంటోంది… మద్యం అంటేనే ఫుల్ రెవిన్యూ…
ఇక కొత్త కంపెనీలు వస్తున్నాయంటే ఇక కింగ్ ఫిషర్‌కు గేట్లు మూసేసినట్టేనా..? ప్రజలకు ఇష్టమైన బీర్‌ను ఈ సర్కారు దూరం చేస్తోందా..? ఈ సందేహాలు ఏమీ అక్కరలేదు… ఏమీ కాదు… గేమ్ చేంజర్ ఇష్యూలాంటిదే ఇది కూడా… మాట తప్పడం మన సార్లకు, మన సర్కార్లకు అలవాటే…
బెనిఫిట్ షోలు లేవు, అదనపు షోలు లేవు, టికెట్ రేట్ల పెంపు లేదు అని ఆర్భాటంగా ప్రకటించి… చివరకు ఏం చేసింది..? పుష్పరాజ్ విషయంలోలాగే ‘దిల్ రాజీ’పడలేదా..? వ్యాపారం, కింగ్ ఫిషర్ కూడా దిగిరాదా ఏం..?!
Share this Article