Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మాకన్నీ తెలుసు అనే పైవాళ్ల అహం… మరీ కిందకు పడేస్తుంది…

June 12, 2024 by M S R

నోకియా – ఎత్తుపల్లాల ప్రస్థానం: 1998 లో ప్రపంచం మొత్తం లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ నోకియా. 1995 నుంచి 1999 వరకు 400 రెట్లు నోకియా లాభాలు పెరగటం ప్రపంచ వ్యాపార రంగం లో సువర్ణాక్షరాలతో రాయదగిన కథ. 2003 వరకు ప్రపంచం మొత్తం లో అత్యధికం గా అమ్ముడుపోయిన మొబైల్ “నోకియా 1100”.

2007 ప్రారంభంలో ప్రపంచ మొబైల్ మార్కెట్ లో నోకియాది 50% షేర్. 2007 లో ఐ-ఫోన్ రావటంతో ప్రపంచ మార్కెట్ లో నోకియా 50% నుంచి 5% వరకు పడిపోయింది. 2011 లో మార్కెట్ విలువ కూడా 90% పడిపోయింది.

నిజానికి స్మార్ట్ ఫోన్ మొదట తెచ్చింది నోకియానే. సింబియాన్ ఆపరేటింగ్ సిస్టంతో టచ్ స్క్రీన్ తెచ్చింది నోకియానే. కానీ సింబియాన్ ఆపరేటింగ్ సిస్టం టచ్ స్క్రీన్ కాని వాటిల్లో మాత్రమే బాగా పనిచేస్తుంది, 2008 లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వైపు వెళ్ళాలని చెప్పినా నాకంటే ఎక్కువ తెలుసా..? అని పైస్థాయి మేనేజ్ మెంట్ & CEO పట్టించుకోలేదు.

Ads

2010 లో ఒల్లి పెక్కా ని CEO గా తీసి స్టెఫన్ ఎలాఫ్ ని CEO గా చేసారు. అతను 2011 లో నోకియాలో ఆపరేటింగ్ సిస్టంగా మైక్రోసాఫ్ట్ విండోస్ ని నోకియా ల్యుమియా ఫోన్స్ లో వాడారు. ఆ తర్వాత మొత్తం క్షీణదశకి చేరుకున్నప్పుడు మైక్రోసాఫ్ట్ 2013 లో నోకియాని అక్వైర్ చేసింది, ఇది ఇంకో పెద్ద మిస్టేక్.

nokia

ప్రపంచంలోని బిజినెస్ స్కూల్స్ నోకియా పతనాన్ని స్టడీ చేసినట్లుగా నాకు తెలిసి దేన్నీ స్టడీ చేయలేదు. పతనానికి కారణాలుగా వాళ్ళు ఫైనలైజ్ చేసింది ఏంటి అంటే “మితిమీరిన అహంకారం”; “అన్నీ నాకే తెలుసు” అన్న మనస్తత్వం. క్రింది స్థాయి వాళ్ళకి తెలుసు క్షీణిస్తుంది అని, కానీ హయ్యర్ మేనేజ్ మెంట్ కి & CEO కి చెప్పాలంటే భయం.

చుట్టు పక్కల వ్యక్తులు ఎవరూ CEO కి వాస్తవ పరిస్థితి వివరించలేదు, అతనూ మూర్ఖత్వంతో వాస్తవాలని తెలుసుకోలేదు. చివరికి సర్వ నాశనమై ప్రపంచ మొబైల్ మార్కెట్ లో 1-3% ఉంది ఇప్పుడు.

ఈ విషయాన్ని గ్రహించే 2013-2014 లో మైక్రోసాఫ్ట్ CEO గా తాను వైదొలగి సత్య నాదెళ్ళ ని CEO గా చేశాడు బిల్ గేట్స్. మన దేశంలో టాటా, బిర్లాలని తీసుకున్నా బిర్లాలు పడిపోయారు కానీ టాటా ఎప్పుడూ ఒకో మెట్టు పైకి ఎదుగుతూ వస్తున్నారు. కారణం తమ కాంపౌండ్ లోని వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తి ని CEO గా కూడా చేసింది టాటా.

ఏది ఏమైనా కాలంతో పాటు అప్ డేట్ అయిన వ్యక్తులు, సంస్థలు మనగలుగుతున్నాయి. మితిమీరిన అహంకారం ఉన్న వ్యక్తులు, సంస్థలు సర్వనాశనమవుతున్నై/అవుతాయి… – వ్యక్తిగత అభిప్రాయం (జగన్నాథ్ గౌడ్)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెద్ద నెట్‌వర్క్..! భీతిగొలిపే మల్టీ లేయర్ కార్పొరేట్ టెర్రర్ మోడల్..!!
  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions