Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?

April 17, 2026 by M S R

.

ఒక కార్పొరేట్ దందా… ఓ ధన పైత్యం… బెట్టింగ్ యాప్స్ ధనదాహానికి ఆధారం… వంటి చాలా విమర్శలు ఐపీఎల్ మీద ఉండవచ్చుగాక… ఇది బ్యాటర్ల గేమ్ గానీ బౌలర్లకు చాన్సేది..? ఎంతసేపూ దంచుడు క్రికెట్ తప్ప రియల్ క్రికెట్ ఎక్కడుంది అనే విమర్శలకూ బలం ఉండవచ్చుగాక… కానీ..?

కొత్త రక్తం, కొత్త మెరిట్ వెలుగులోకి వస్తోంది… ఇద్దరు యువ, కొత్త బౌలర్లు ప్రఫుల్, సాకిబ్ ఏకంగా 8 వికెట్లు తీయడం చూశాం కదా… అందులో ఫస్ట్ ఓవర్‌లోనే మూడు వికెట్లు తీసిన ప్రఫుల్… ఓటమి ఎరుగని ఆర్ఆర్ జట్టును దెబ్బతీసిన విధం అపూర్వం… కొత్త బ్యాటర్లు కూడా వెలుగులోకి వస్తున్నారు…

Ads

  • ఒక మంచి క్యాచ్, మంచి రనవుట్, మంచి త్రో, మంచి బాల్, మంచి సిక్స్… మ్యాచ్‌ను తిప్పేస్తాయి… అందరి ప్రతిభ రాటుదేలుతోంది… అదే ఐపీఎల్ చూసేలా ప్రేరేపిస్తుంది… అఫ్‌కోర్స్, గత ఐపీఎల్ సీజన్లకన్నా ఈసారి యాడ్ రెవిన్యూ దారుణంగా పడిపోయి, వందల కోట్ల రెవిన్యూ లాస్ ఉంటుందని అంచనా వేస్తున్నారు, అది వేరే కథ…

 

ఒక క్యాచ్ గురించి చెప్పుకోవాలి… శ్రేయాస్ అయ్యర్ బౌండరీ లైన్ వద్ద అక్షరాలా గాలిలోకి ఎగిరి, బౌండరీ దాటి బాల్ పట్టుకుని, అదే ఊపులో సెకండ్ ఫీల్డర్‌కు అందించిన తీరు… హార్డిక్ పాండ్యాను ఔట్ చేసిన ఆ క్యాచ్ అపూర్వం… డగౌట్‌లో ఉన్న ముంబై ప్లేయర్లు కూడా అబ్బురంగా చూస్తుండిపోయారు…

మనం ఈమధ్య చెప్పుకున్నట్టు… పంజాబ్, ఆర్ఆర్ ఇప్పటివరకైతే మంచి ఆట కనబరుస్తున్నాయి… పంజాబ్ ఓటమి ఎరగుకుండా టేబుల్‌‌లో ప్రస్తుతానికి టాప్.., కోల్‌కత్తా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… చివరి స్థానాల్లో సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ కూడా దాంతో పోటీపడుతున్నట్టుగా ఉంది… ఒకప్పుడు టాప్ టీమ్స్ అవి… ప్రత్యేకించి అత్యధిక ధరలకు ప్లేయర్లను కొన్న ముంబై ఇండియన్స్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్టుంది…

  • ఈ జట్టు వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది… నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఓడిపోవడంతో ఈ సీజన్‌లో వీరికి ఇది నాలుగో వరుస ఓటమి… ముంబై జట్టు ఇంత పేలవంగా ప్రదర్శన చేయడానికి ప్రధాన కారణాలేమిటి..?

 

హార్దిక్ పాండ్య తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు జట్టును దెబ్బతీస్తున్నాయని మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు… స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను పవర్‌ప్లేలోనే రెండు ఓవర్లు వేయించి, ఆ తర్వాత 17వ ఓవర్ వరకు తీసుకురాకపోవడం పెద్ద తప్పిదమని సదాగోపన్ రమేశ్ వంటి వారి అభిప్రాయం…

వాంఖడే వంటి స్టేడియంలో ఇద్దరు స్పిన్నర్లతో (మయాంక్ మార్కండే, మిచెల్ సాంట్నర్) బౌలింగ్ చేయించడం, అది కూడా రజత్ పాటిదార్ వంటి స్పిన్- హిట్టర్ క్రీజులో ఉన్నప్పుడు బౌలింగ్ ఇవ్వడం వ్యూహాత్మక లోపం… ముంబై బౌలింగ్ యూనిట్ ఈసారి చాలా బలహీనం…

  • జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయడంలో వైఫల్యం… గత ఐదు మ్యాచ్‌ల్లో (122 బంతులు) తను ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం ముంబైకి పెద్ద దెబ్బ… ట్రెంట్ బౌల్ట్ (ఎకానమీ 12.22) తో పాటు ఇతర బౌలర్లు ఓవర్‌కు 10 కంటే ఎక్కువ పరుగులు ఇస్తున్నారు… ప్రత్యర్థి జట్లు సులువుగా 240+ పరుగులు చేసేలా ముంబై బౌలింగ్ ఉంటోంది…

 

జట్టులోని సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు హార్దిక్ తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు… ముఖ్యంగా ఫీల్డ్ సెట్టింగ్స్, రివ్యూల విషయంలో (ఉదాహరణకు టిమ్ డేవిడ్ రివ్యూ) ఆటగాళ్ల మధ్య స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారి…

జట్టు కీలక బ్యాటర్ రోహిత్ శర్మ హ్యామ్‌ స్ట్రింగ్ గాయంతో బాధపడుతుండటం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తోంది… తన ఫిట్‌నెస్ విషయంలో అనిశ్చితి నెలకొనడం బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చాల్సిన పరిస్థితిని తెచ్చింది…

  • ఒకప్పుడు కొత్త టాలెంట్‌ను (జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ వంటి వారు) వెలికితీయడంలో ముంబై దిట్ట… కానీ ఇప్పుడు ఆ ప్రాసెస్ ఆగిపోయినట్లు కనిపిస్తోంది… రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, బుమ్రా వంటి సీనియర్లపైనే జట్టు అతిగా ఆధారపడుతోంది… వీరు ఫామ్ కోల్పోయినా లేదా గాయపడినా ప్రత్యామ్నాయంగా నిలబడే యువ ఆటగాళ్లు ఈ సీజన్‌లో కనిపించడం లేదు…

 

ప్లేయింగ్ ఎలెవన్‌లో మార్పులు చేయాలన్నా నాణ్యమైన యువ ప్లేయర్లు అందుబాటులో లేరు… గతంలో పొలార్డ్ చేసే పాత్రను భర్తీ చేసే యువ హిట్టర్లు లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది… టిమ్ డేవిడ్ వంటి వారు ఉన్నా, స్థిరత్వం లోపించింది…

నిజానికి ముంబై జట్టుకు ఒక “రీసెట్” బటన్ నొక్కాల్సిన సమయం వచ్చింది… యువ రక్తంతో కూడిన కొత్త వేగం లేకపోతే, ఆధునిక టీ20 క్రికెట్‌లో ఇన్ని భారీ స్కోర్లను ఛేదించడం లేదా అడ్డుకోవడం చాలా కష్టం… అన్నట్టు శ్రేయాస్ క్యాచ్ చూడాలని ఉందా..? ఇదుగో…



SHREYAS IYER, WHAT HAVE YOU DONE!! 🤯

🎥 One of the best catches you would see in the #TATAIPL history 🔥🔥

Updates ▶️ https://t.co/Fn2dxJ4zYR#KhelBindaas | #MIvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/6EKgHR82cL

— IndianPremierLeague (@IPL) April 16, 2026

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • IPL 2026…! ఈ సీజన్‌లో ఎందుకు అంబానీ టీమ్ ఫ్లాప్ గేమ్..?
  • ఇడ్లీ దోశ సాంబార్ చట్నీ… తమిళులకు కన్నడ ఫ్యాన్స్ వెక్కిరింపులు…
  • ఈ జడ్జి వద్దన్నాడు కదా కేజ్రీవాల్‌..! తరువాత ఏమైందంటే..?
  • … మూలిగే తెలంగాణ బీజేపీపై కన్నడ తేజస్వి సూర్య పోటు…
  • ఎవరి కోసం ఈ సీట్ల పెంపు..? ప్రజలకు ఏం ప్రయోజనం..?
  • నాటి పారుపల్లి రామకృష్ణయ్యే శంకరాభరణం శంకరశాస్త్రి…
  • దొంగ మొగుడిలాగే రౌడీ అల్లుడు… పక్కా చిరంజీవి మార్క్…
  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions