Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!

April 16, 2026 by M S R

.

చాన్నాళ్ల క్రితం… ఓ టీవీ చానెల్… కేసీయార్ ప్రాయోజిత డిబేట్… అల్లం నారాయణ, దేశపతి శ్రీనివాస్ మరో ఇద్దరు పాల్గొన్నట్టు గుర్తు… ఆ డిబేట్ ఉద్దేశం ఏమిటంటే..? అసలు రెడ్ల జనాభా ఎంత..? వాళ్లకెందుకు ఇంత రాజకీయాధికారం..? ఎందుకో కేసీయార్‌కు రెడ్లకు కత్తెర పెట్టాలని అనిపించి, ఈ డిబేట్‌ను జనంలోకి తీసుకెళ్లాలి అనుకున్నాడు… గెస్టులు కూడా రెడ్లపై వెటకారాన్ని దట్టించారు… ఐనాసరే, తన వెలమలకు ప్రాధాన్యం ఇస్తూనే, రెడ్లకు అనివార్యంగా ప్రాధాన్యం ఇవ్వకతప్పలేదు… రాజకీయంగా..!

సీన్ కట్ చేద్దాం… రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచే దిశలో ఓ కులగణన కసరత్తు నిర్వహించింది తెలుసు కదా… ఆ వివరాలను ఇప్పుడు బహిరంగం చేసింది… అందులో రెడ్ల జనాభా 4.8 శాతం ఉంటే, వెలమల శాతం కేవలం 0.4 శాతం… అప్పటి డిబేట్ ఇప్పుడు పెట్టించగలడా కేసీయార్, తన సొంత చానెల్‌లో..? ఈ సర్వే వివరాలు చదువుతుంటే ఆనాటి ఆ డిబేట్ గుర్తొచ్చింది ఎందుకో…

Ads

సరే, ఆల్ ఆఫ్ సడెన్… కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జనగణన ప్రారంభమవుతున్న నేపథ్యంలో… ఈ పాత సర్వే వివరాల్ని ఎందుకు పబ్లిక్ డొమెయిన్‌లో పెట్టినట్టు..? తెలియదు…! పైగా ఈ డేటాను కేంద్ర జనగణనకు ప్రామాణికంగా తీసుకోవాలంటున్నాడు మంత్రి పొన్నం ప్రభాకర్… హేమిటో…

కేంద్ర కులగణన ప్రొఫార్మా, పద్దతి జాతీయ స్థాయిలో ఒకేరకంగా ఉంటుంది… ప్రతీ పదేళ్లకు ఓసారి నిర్వహించాల్సిన కంపల్సరీ సర్వే… 2021లో చేయాలి, కరోనా కారణంగా వాయిదాపడి, ఇప్పుడు స్టార్టయింది, దీనికి ఓ నిర్దిష్ట విధివిధానాలు ఉంటాయి… రిజర్వేషన్ల సాధనకు ఉద్దేశించిన ఈ కులగణనను కేంద్రం ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటుంది..? అసలు ఇప్పుడెందుకు ఈ వివరాలు వెల్లడించినట్టు..?

సరే, ఈ కులాల వారీ జనాభా, ఆర్థిక స్థితిగతులు, తేడాలు, స్వాధీనంలో ఉన్న భూమి ఇతరత్రా డేటా మీద చాలామంది చాలా విశ్లేషణలు రాస్తున్నారు…

కులగణన

ఇందులో 4.8 శాతం జనాభా ఉన్న రెడ్ల చేతుల్లో 13.5 శాతం భూమి ఉందట, 0.4 శాతం జనాభా ఉన్న వెలమల చేతుల్లో కేవలం ఒక శాతం మాత్రమే ఉందట… కొన్నాళ్లు విపరీతంగా విమర్శలు వచ్చాయి గుర్తుందా..? నక్సలైట్లు వెలమ దొరలను తరిమేసి వేల ఎకరాల్ని స్వాధీనం చేసుకుంటే… కేసీయార్ ప్రభుత్వం వచ్చాక ధరణి సైటు పెట్టి, అందరి యాజమాన్య హక్కుల్ని అందులో దఖలు పరిచారని..! ఐనా ఒక శాతం భూమేనా..?

యాదవ, లంబాడీ, ముదిరాజ్, మాదిగ, మున్నూరు కాపు, కురుమలకే ఎక్కువ భూమి ఉందని సర్వే చెబుతోంది… నిజానికి పల్లెల్లో గౌడ్స్ కూడా ఆర్థికంగా, రాజకీయంగా బలపడ్డారు… బహుశా ఎక్కువ భూమి కలిగిన కులాల్లో వాళ్లూ ఉండి ఉండాలేమో…

సాధారణ ప్రచారంలో… తెలంగాణలో మాలలకన్నా మాదిగలు ఎక్కువే… కానీ మరీ మాలలకన్నా 6.2 శాతం మాదిగలు ఎక్కువగా ఉన్నట్టు సర్వే చెబుతోంది… ఇంట్రస్టింగు… ముదిరాజ్ జనాభా కూడా 7.4 శాతం, అంటే బీసీల్లో వాళ్లే ఎక్కువ… ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ఫ్యాక్టర్, ఈ జాబితాలో రజక 2.8 శాతం, నాయీబ్రాహ్మణ 1.2 శాతం ఉన్నా… ఈ ఎంబీసీ (మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాస్)కు దక్కిన రాజకీయ ప్రాధాన్యం ఎంత..? నామమాత్రం… అసలు వీళ్లకు కదా సమప్రాధాన్యం లభించాల్సింది…

  • అవునూ, పొన్నమన్నా… రాష్ట్రంలో ఒక్క క్రిస్టియన్ కూడా లేడా పాపం..? ఏమైపోయారు..? ఎనీ ఐడియా..?! పైగా దీన్ని కేంద్ర జనగణనకు ప్రామాణికంగా తీసుకుని, ఈ డేటా వాడుకోవాలా..? హవ్వ..!!

సర్వే

ఎప్పటిలాగే నమస్తే తెలంగాణ అండ్ పింక్ క్యాంపు దీనిపైనా నెగెటివ్ ప్రాపగాండా స్టార్ట్ చేసింది, అందరూ షేక్‌లేనా..? మరి మన బీసీలేమయ్యారు..? కేవలం 46 శాతమేనట, బీసీలకు రేవంత్ రెడ్డి ద్రోహం అని ఏదేదో రాస్తూ… ఇదుగో ఇలా హైలైట్ చేసింది…

నమస్తే

నేతన్నలెటు పోయిరి, గొల్ల కుర్మలేరి? ముదిరాజులు ఎట్ల మాయమైరి? మున్నూరు కాపులు కానరారేరి? గౌడన్నా, నీ జాడ ఎక్కడ? విశ్వకర్మలను విస్మరించిరా? అని శోకాలు పెట్టింది సరే… మరి పైన జాబితాల్లో కనిపించే ఈ కులాల జాబితాలేమిటి మరి..?

పొద్దున ఎక్కడో చదివిన… ఎప్పుడూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ రెండు పత్రికలు అబద్ధాలు రాస్తాయని అంటుంటారు కదా, అవి అసలు నిజాలే రాయవా అని వైఎస్‌ను అప్పట్లో ఎవరో అడిగారట… ‘ఎందుకు రాయవు, రాస్తాయి, నిజాలు రాస్తూనే, తాము నిజాలుగా భ్రమింపజేయాలనుకున్న ఉద్దేశపూర్వక అబద్ధాలను కూడా రాస్తాయి’ అన్నాడట ఆయన…

ఎస్, ప్రతిదీ నిందార్హమే అన్నట్టు, అన్నింటినీ అబద్ధాలే అని నమస్తే వంటి పింక్ క్యాంపు ఎడాపెడా రాసేస్తూ పోతూ ఉంటే… ఎక్కడో ఒకటీ అరా నిజాలు రాసినా సరే, అవీ అబద్ధాలే అనుకుంటారు జనం… వైఎస్ బతికి ఉంటే తన సాక్షిని, దానికి సమానమైన నమస్తేను చూసి ఏమనుకునేవాడో, ఏమనేవాడో..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అవునూ… హఠాత్తుగా ఈ కులగణన తెరపైకి తెచ్చారెందుకు భయ్యా..?!
  • చైనాలో ఏం జరుగుతోంది..? వంద మంది సైనిక జనరల్స్ గల్లంతు..?
  • ఒమర్ అబ్దుల్లా తెలివైనవాడు… సమయస్పూర్తి ప్రదర్శించాడు…
  • కథ రాసేవాడికి చూసేవాడు లోకువ… ఫాఫం, రోజా ఫస్ట్ ఫిలిమ్ కథ ఇదే…
  • 77 వయస్సులో… 55 ఏళ్ల నాటి… ఓ ప్రేమ- పెళ్లి మురిపెం కథ…
  • సీఎం రేవంత్ రెడ్డి ఇది తప్పకుండా చదవాలని కోరుకుంటూ..!!
  • సమకాలీనులు వేరు- సమస్కంధులు వేరు… బోత్ ఆర్ నాట్ సేమ్…
  • లేడీ-D @ నిదా ఖాన్…! నాసిక్ మత స్కాం బట్టబయలైంది ఇలా..!!
  • మన అన్ని వ్యవస్థల్లోకీ జొరబడిన ‘టెర్రరిజం’… బహుపరాక్…
  • కొత్త సీన్..! ఈసారి తమిళేతరుల హవా..! ప్రత్యేకించి తెలుగు కులాలు..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions