అత్యంత ఖరీదైన టీవీ రియాలిటీ షో బిగ్ బాస్… అందరికీ తెలిసిన విషయమే… నచ్చేవాళ్లు చూస్తారు, నచ్చనివాళ్లు తిడతారు… మొదట్లో వచ్చిన కొన్ని సీజన్లను జనం ఆసక్తిగానే చూశారు… తరువాత క్రమేపీ ఆదరణ తగ్గిపోయింది… ఓటీటీ షో ఫ్లాప్… దాన్ని మించి గత సీజన్ అట్టర్ ఫ్లాప్… కాదు, డిజాస్టర్… ఆఫీసర్ సినిమాను మించిన డిజాస్టర్ నాగార్జునకు… పరువు పోయింది…
ఆఫ్టరాల్ పరువుదేముంది..? పైసలు వస్తున్నాయి కదా అంటారా…? ఎస్, అదొక్కటే నిజం… నో, నో, ఈసారి బిగ్‌బాస్ 7 సీజన్ చూడండి, అదరగొడతాం, మస్తు మార్పులు చేశాం, కొత్త జోష్‌తో కుమ్మేస్తాం అని తెగ ప్రచారం చేశారు కదా… సారీ నాగ్… అంతగా హుషారెత్తించే సీన్ ఏమీ కనిపించడం లేదు… నువ్వేదో ఉల్టా పుల్టా అని తెర మీదకు వచ్చేసి ఏదేదో ప్రోమో చూపించావు గానీ, శనివారం నాటి వీకెండ్ షో నిస్సారంగా, నీరసంగా నడిచింది… నిజం బాస్…
ఉన్నదే 14 మంది… అందులో ప్రియాంక జైన్ పర్లేదు, పవర్ అస్త్ర కోసం పోటీపడి ఓడిపోయింది కానీ యాక్టివ్… నటుడు, గరుడ పౌరాణికుడు శివాజీ నిజజీవితంలోలాగే ఇక్కడా ఓవరాక్షన్… నాగార్జునకు ఎందుకు నచ్చాడో తెలియదు… సింగర్ దామిని జస్ట్, పర్లేదు… మోడల్ ప్రిన్స్ యావర్ శుద్ధ హోప్ లెస్… శనివారం ఆడియెన్స్ రేటింగుల్లో కూడా తేలింది ఇదే… నటి శుభశ్రీ కూడా సోసో… వెటరన్ నటి షకీలా చాన్నాళ్లు హౌజులో ఉండదు, అది మాత్రం ఖాయం…
Ads
కొరియోగ్రాఫర్ సందీప్ యాక్టివ్… తొలి పవర్ అస్త్ర విజేత… అంటే ఫస్ట్ హౌజ్ మేటుగా కన్‌ఫరమ్ అయిన కంటెస్టెంట్… తను మంచి పోటీదారే… టీవీ నటి శోభాశెట్టి బాగుంది… కాకపోతే ఇంకా యాక్టివ్ కావాలి… ఆ టేస్టీ తేజ నుంచి దూరం జరిగితే ఇంకా బెటర్… పదే పదే నోరు బార్లా తెరుస్తూ టేస్టీ తేజ అప్పియరెన్స్ బాగాలేదు… కాకపోతే సరదాగా ఉంటున్నాడు… వోకే… మిగిలినవారిలో బలమైన పోటీదారు కాబోయేది రతిక రోజ్… తెలివైన పోటీదారు…
డాక్టర్ గౌతమ్, కిరణ్ రాథోడ్ హోప్ లెస్… కొన్నాళ్లే ఉంటారు… అమర్ దీప్, ప్రశాంత్ కూడా పెద్దగా ఇంప్రెసివ్ కారు… పికప్ అవుతారేమో చెప్పలేం… వీకెండ్ షో పెద్దగా రక్తికట్టలేదు… అసలు గత సీజన్‌తో పోలిస్తే ఏవేవో మార్పులు అన్నారు కానీ మరీ అంత ఇంప్రెసివ్ మార్పులు పెద్దగా ఏమీ లేవు… మరీ వీకెండ్ షో కూడా ఇంత సుత్తి, ఇంత సోది అయితే ఎలా నాగ్…
టీవీ సీరియల్స్ చూసే ప్రైమ్ టైమ్ దాటాక 9.30కు మొదలుపెట్టడం బాగానే ఉంది… ఆసక్తి ఉన్నవాళ్లే చూస్తారు… ఐనా అంతగా పడీ పడీ చూసే ఆకర్షణ ఏమీ లేదు ప్రస్తుతానికి… అవునూ… ఈ 14 మంది సరిపోరు కదా బిగ్ బాస్… మిడిల్ ఎంట్రీస్ ఉంటాయా..? పోయేవాళ్లు పోతూ, వచ్చేవాళ్లు వస్తూ దాన్నే అట్రాక్షన్ పాయింట్ చేయబోతున్నారా..? అన్నింటికన్నా ముఖ్యంగా ఆటలో మజా రేకెత్తించే కొత్త టాస్కులు ఆలోచించండర్రా బాబులూ…
Share this Article