.
కాసేపు రణబీర్, యశ్, సాయిపల్లవి, రకుల్ గురించి, వారి పాత్రల గురించి చర్చలు ఆపేస్తే… ఒకటీరెండు విషయాల్ని రాబోయే రామాయణ్ సినిమాపై మాట్లాడుకోవాలి… రామాయణాన్ని కట్టె కొట్టె తెచ్చె అన్నట్టు మూడు ముక్కల్లో చెప్పొచ్చు… కొన్ని వందల ఎపిసోడ్లతో సుదీర్ఘమైన సీరియల్ కూడా తీయొచ్చు… ఐతే ఎంతసేపూ మన కథలు రాముడు పుట్టాడు, అరణ్యవాసం వెళ్లాడు, రావణుడి ఎత్తుకుపోయాడు, రాముడు తనను చంపేసి సీతను తెచ్చేసుకున్నాడు అనే యాంగిల్ తప్ప మరేమీ ఆలోచించలేదు మన కథకులు- ప్రజెంటర్లు…
ఆమధ్య ఓ నవల చదివాను, రామాయణం మొత్తాన్ని వాలి భార్య తార కోణంలో సాగుతుంది… రాసే కలంలో దమ్ముండాలి గానీ లంక కాపలాదారు లంకిణి కోణంలో కూడా కథను పవర్‌ఫుల్‌గా చెప్పొచ్చు… దర్శకుడు నితేశ్ తివారీ అందరికీ తెలిసిన కథే మళ్లీ మళ్ల చెప్పడం కాదు, కొంత డిఫరెంట్ పోకడతో వెళ్లున్నాడు… ఫస్ట్ పార్ట్ కేవలం సీతాపహరణం వరకే కదా…
Ads
సహనిర్మాత, తన స్టార్‌డమ్ రీత్యా రావణుడి కథకు పెద్ద పీట వేస్తున్నాడు… నిజానికి ఒకటీరెండు వ్యక్తిగత అవలక్షణాలు మినహా రావణుడు రాముడికన్నా ఏమీ తక్కువ కాదు, ఏమో, రాక్షస సంస్కృతిలో మనసుపడిన పడతిని ఎత్తుకురావడం కూడా ధీరత్వమేనేమో… ఎలా చూపించబోతున్నాడో… అదేసమయంలో శూర్పణఖ (రకుల్) కథను, తన భర్త విద్యుత్ జిహ్వ (వివేక్ ఒబెరాయ్) కథనూ చెప్పనున్నాడు… అంతేకాదు, అన్‌టోల్డ్ స్టోరీస్ టచ్ చేయబోతున్నాడు…
వాటిల్లో ఒకటి… ట్రెయిలర్‌లో ఒకటీరెండు సెకన్లు అలా మెరిసిన ఈ పాత్రను గమనించండి… (4 నిమిషాల ట్రెయిలర్‌లో ఎన్నో పాత్రల్ని అలా చూపించేశాడు)

గుర్తుపట్టారు కదా… ప్రముఖ నటి, డాన్సర్ శోభన… ఆమె పట్టుకున్నది బాహుబలిలో అనుష్క శెట్టిలా పుల్లలు కాదు… మంచి పాత్ర ఈమెది… కైకసి… ఆమె కథనూ నితేశ్ తివారీ చెప్పబోతున్నాడు, ఇంట్రస్టింగ్… ఇంతకీ కైకసి ఎవరో తెలుసా మీకు..? (కైకేయి కాదు, కైకేయి అంటే దశరథుడి భార్య, రాముడి అరణ్యవాసానికి అసలైన కారకురాలు)… మరి ఈ కైకసి..?
రావణుడి తల్లి! చాలామందికి తెలియని పేరు, నికాశ అని కూడా పిలుస్తారు… ఈమె శక్తివంతుడైన రాక్షసుడు సుమాలి, కేతమతిల బిడ్డ… వీళ్లు లంకను కోల్పోయాక పాతాళలోకంలో ఆశ్రయం పొందుతారు… రాజ్యాన్ని తిరిగి పొందాలంటే అపూర్వ శక్తులు కలిగిన పిల్లలే దిక్కు అని నమ్మి… తమ బిడ్డ కైకసిని పెళ్లిచేసుకోవాలని విశ్వరవ మహర్షిని కోరుతారు… తండ్రి కోరికను పాటించి కైకసి ఆ మహర్షిని పెళ్లి చేసుకుని, రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలను సంతానంగా పొందుతుంది…
మనం చెప్పుకుంటున్నదే కదా… రామాయణ్‌లో రావణుడి కథ ఎక్కువగా ఉండబోతున్నది అని… అందుకే తన పుట్టుక, తన వంశం గురించీ చెప్పబోతున్నాడు దర్శకుడు… ఆ పాత్రకు శోభనను తీసుకోవడం అంటేనే ఎంతోకొంత ఆ పాత్రకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టే కదా!! కట్టెకొట్టెతెచ్చె కాదు, నితేశ్ తన సినిమాలో ఇంకెన్ని కథల్ని చెప్పబోతున్నాడో..!!
Share this Article