.
ఇకపై హైదరాబాదులో బెనిఫిట్ షోలకు అనుమతుల్లేవు… ఇది ప్రభుత్వ నిర్ణయం… అని మంత్రి కోమటిరెడ్డి ప్రకటన…
.
Ads
గుడ్… ఒక ప్రాణం పోయాకైనా ఈ ప్రభుత్వానికి కళ్లు తెరుచుకున్నాయి సంతోషం,., ఇదే మాట మీద ఉండండి… మాట మార్చొద్దు, మడమ తిప్పొద్దు… అంతేకాదు, నిజంగానే హైదరాబాదీల మీద ప్రేమ ఉంటే ఇంకొన్ని చర్యలూ ప్రకటించాలి…
భేషజాలు వద్దు,.. సంకోచాలు వద్దు… తటపటాయింపులు అసలే వద్దు… ప్రిరిలీజ్ సినిమా ఫంక్షన్లకూ అనుమతులు ఇవ్వొద్దు… ఆ బందోబస్తులకు వందల మంది పోలీసులను మొహరించడం ఏమిటి..?
సినిమా అనేది ఓ వ్యాపారం… దానికి కొన్ని కట్టుబాట్లు అవసరం… వాడి స్వార్థం కోసం, వాడి ప్రమోషన్ కోసం వాడు ఏదో మీటింగు పెట్టేసి, భారీగా ఫ్యాన్స్‌ను పిలిచి, హంగామా చేస్తే… నగరవాసికి ట్రాఫిక్ కష్టాలు… అభిమానం ఉన్మాదంగా మారితే లా అండ్ ఆర్డర్ సమస్య కూడా…
గత సీజన్ బిగ్‌బాస్ ఫినాలే తరువాత పల్లవి ప్రశాంత్ అనే ఓ పిచ్చి కేరక్టర్ తాలూకు ఊరేగింపు సందర్భంగా ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు… ఆ కేసు ఏమైందో సజ్జనార్ చెప్పాల్సిందే… ఓ కంటెస్టెంట్ కారుపైనా దాడి చేశారు… ఉద్రిక్తత… ట్రాఫిక్ జామ్… భీతావహులైన జనం… ఇంతకీ ఆ పల్లవి ప్రశాంత్ సాధించిన ఘనత ఏమిటి..? ఓ చిల్లర ట్రోఫీ…
అసలే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సైకో ఫ్యాన్స్ పెరుగుతున్నారు… తొక్కిసలాటలు, లాఠీఛార్జిలు… చివరకు పరిస్థితి ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు… నాలుగు గోడల నడుమ ఏదేని హోటళ్లలో పరిమిత సంఖ్యలో మీడియా, అతిథుల సమక్షంలో అయితే వోకే… బహిరంగసభల్లాగా సినిమా ఫంక్షన్లు ఏమాత్రం వాంఛనీయం కావు… పరిస్థితి అదుపు తప్పితే నిర్వాహకులూ చేతులెత్తేయడమే…
సోకాల్డ్ స్టార్ హీరోలకు కూడా సోషల్ రెస్పాన్సిబులిటీ లోపిస్తోంది… ఉదాహరణకు తనను చూడటానికి జనం విరగబడతారని అల్లు అర్జున్‌కు తెలియదా..? సంధ్య థియేటర్ వద్దకు అనాలోచితంగా ఎందుకు వెళ్లినట్టు..? పోలీసులకు సమాచారమే లేదట… థియేటర్ పోలీసులకు చెప్పి ఉండాలి కదా… రాన్రాను స్టార్ సెలబ్రిటీలు అదుపు తప్పుతున్నారు…
బెనిఫిట్ షోలు మాత్రమే కాదు… ఇష్టారాజ్యం ప్రీమియర్లు, అడ్డగోలు టైమింగ్స్, ఎడాపెడా షోలు… టికెట్ రేట్ల పెంపుదల కూడా ఉండకూడదు… పుష్ప2 రేట్ల పెంపు మరీ అసాధారణంగా… రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకూ చెడ్డ పేరు తీసుకొచ్చింది… సినిమా దందాను మరీ అరాచకం చేయొద్దు… ప్రతి దానికీ ఓ పద్ధతి ఉంటుంది… చేతకాకపోతే టికెట్ రేట్ల మీద ప్రభుత్వ నియంత్రణ ఎత్తిపారేయండి… మార్కెట్ సెట్ రైట్ చేయగలదు..!!
Share this Article