సినిమా, టీవీ ఇతర సెలబ్రిటీలే కాదు… పొలిటికల్ సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకుల కథలు కూడా కొన్నిసార్లు ఆసక్తికరంగా, వార్తలుగా మారుతుంటాయి… జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ముఖ్య నేత ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ విడాకుల కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది…
ఒమర్ అబ్దుల్లాకు పెద్ద పరిచయం అక్కర్లేదు… కానీ ఎవరు ఈమె..? అసలు పేరు పాయల్ నాథ్… తండ్రి రిటైర్డ్ మేజర్ రామనాథ్… ఆమె పుట్టింది ఢిల్లీలో, కానీ వాళ్ల రూట్స్ పాకిస్థాన్‌లోని లాహోర్… లండన్‌లో ఎంబీఏ చేసింది… మొదట్లో ఒబెరాయ్ హోటళ్లకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది…
రాజకీయాల్లోకి రాకముందు ఒమర్ అబ్దుల్లా కూడా ఒబెరాయ్ హోటళ్లకు వర్క్ చేసేవాడు… ఇద్దరూ అక్కడే కలుసుకున్నారు… ప్రేమ, కొన్నాళ్లు కలిసి తిరిగారు, చివరకు 1994లో పెళ్లి చేసుకున్నారు… ఇద్దరు కొడుకులు… ఆమెకు హిమాచల్‌ప్రదేశ్‌లో ఓ మినరల్ వాటర్ ప్లాంట్… ఢిల్లీలో ఓ టూరిస్ట్ ఏజెన్సీ… తరువాత భేదాభిప్రాయాలు వచ్చి 2011లో, అంటే 17 ఏళ్ల బంధం తరువాత విడిపోయారు… ఇదీ వాళ్ల మతాంతర లవ్ స్టోరీ…
Ads
(ఫరూక్ అబ్దుల్లా పెళ్లి కూడా మతాంతరమే… మోలీ అనే బ్రిటిష్ నర్స్‌ను పెళ్లి చేసుకున్నాడు… ఫరూక్ బిడ్డ సారా అబ్ధుల్లా ప్రముఖ నాయకుడు సచిన్ పైలట్‌ను 2004లో మతాంతర పెళ్లి చేసుకుంది… 19 ఏళ్ల తరువాత ఇద్దరూ విడిపోయారు…)
ఒమర్ అబ్దుల్లా విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆమె వల్ల హింసను అనుభవిస్తున్నట్టు కారణం చెప్పాడు… కానీ ఫ్యామిలీ కోర్టు దానికి అంగీకరించలేదు… తను హైకోర్టుకు వెళ్లాడు… విచారణ కొన్నాళ్లు సాగి 2016లో హైకోర్టు కూడా ఒమర్ చెప్పే కారణాలతో ఏకీభవించలేదు, ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది… పాయల్‌కు నెలకు లక్షన్నర, కొడుకు చదువు కోసం అదనంగా నెలకు 60 వేలు ఇవ్వాలని ఆదేశించింది…
కేసు సుప్రీంకోర్టు దాకా వచ్చింది… ప్రముఖ వ్యక్తుల కేసులన్నీ కపిల్ సిబల్ వద్దకే వస్తుంటాయి కదా… రాజ్యాంగ సంక్షోభాలు వంటి పెద్ద పెద్ద ఇష్యూలే కాదు, ఆయన విడాకుల కేసులు కూడా వాదిస్తుంటాడు… హైప్రొఫైల్ కేసులు అయితేనే సుమా… అత్యంత విలువైన న్యాయవాది కదా…
సుప్రీంకోర్టు 15 ఏళ్లుగా దంపతులు విడివిడిగానే ఉంటున్నారు గనుక అది ‘డెడ్ మ్యారేజ్’ అని అభిప్రాయపడింది… ఒమర్ అబ్దుల్లాతో విడిపోయిన పాయల్‌కు ఈమేరకు నోటీసులు జారీ చేసింది… ఈ జంటకు ఇద్దరు కొడుకులు జమీర్, జహీర్…!
Share this Article