.
Murali Buddha ….. ఇతని ప్రకటన బాగా నచ్చింది ? ఎందుకు ?
సినిమా నాలెడ్జ్ ప్రకారం అత్యాచారం అంటే అమ్మాయి వెంట విలన్ పరుగులు పెడతాడు . నానాభీభత్సం చేసి అత్యాచారం చేస్తాడు .
కానీ వాస్తవ జీవితంలో అలా ఉండదు కదా ?
ఇతను, అనగా బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తలుచుకుంటే అతని సినిమా నాలెడ్జ్ ను చట్టంగా మార్చగలడు … అత్యాచారానికి సినిమా నిర్వచనం వేరు … చట్టం నిర్వచనం వేరు .
నీకు ఇతని ప్రకటన ఎందుకు నచ్చిందో కానీ నాకు నచ్చలేదు అంటారా..?

Ads
నాకు నచ్చడానికి కారణం ఉంది . చట్టాలు చేసే వారికి కూడా చట్టాలు ఎవరు చేస్తారో తెలియదు అని ఇతని ప్రకటనతో నాకు తెలిసి వచ్చింది . ఇతనికి తెలియని విషయం చట్టాలు చేసేది వీళ్ళేనని. రాష్ట్రాల్లో mla లు , కేంద్రంలో ఎంపీలు చట్టాలు చేస్తారు . ఆ విషయం నిజంగా వారికి తెలియదు . mp , mla అంటే కాంట్రాక్ట్ లు , పైరవీలు , బదిలీలు చేయడం ప్రధాన వృత్తి అనుకుంటారు .
వీళ్ళు కూర్చునే వాటిని చట్ట సభలు అని … అక్కడ చట్టాలు చేస్తారు అనేది వీరికి నిజంగా తెలియదు . చట్టాలు చేసేది అధికారులు కానీ మాకేం పని అనుకుంటారు …
ఓసారి ఓ బీజేపీ mla RTI కి ఫోన్ చేసి సమాచారం కోసం ప్రభుత్వ ఆఫీస్ లో దరఖాస్తు చేయడం , అటు నుంచి RTI దాకా పోవడం దేనికి, ఇదంతా బాగాలేదు . నేరుగా RTI కమిషన్ కే దరఖాస్తు చేసేట్టు ఉండాలి అని అంటే మంచి ఐడియా అలానే చట్టం చేయండి అన్నాను …. చట్టం మేమెలా చేస్తాం అధికారులు చేయాలి కానీ అన్నాడు …
…. ఇదీ ఆ పోస్టు… ఇంతకీ ఈ తెలంగాణ బీజేపీ కీర్తకిరీటం ఎవరో, ఈయన గారి నేపథ్యం ఏమిటో తెలుసా..? వికీపీడియా ప్రకారమే సుమా… నిజామాబాద్, ఆర్మూర్ మండలంలోని అంకాపూర్… 1987 ఆగస్టులో యూఏఈలో సిద్దిపేట తాపీ మేస్త్రీ కింద భవన నిర్మాణ కూలీగా తన జీవితాన్ని ప్రారంభించి, ఆ తర్వాత డ్రైవర్‌గా పని చేశాడు…
తరువాత 1994లో భారతదేశానికి తిరిగి వచ్చి… హాంకాంగ్ నుండి యూరప్, గల్ఫ్, ఉత్తర అమెరికాకు ఎర్ర చందనం ఎగుమతి, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్ లాంటి ఇతర వ్యాపార రంగాల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు…
2023 జూన్ 1న బీజేపీలో చేరాడు… అదే సంవత్సరం ఆర్మూరు సీటుకు టికెట్ వచ్చింది… గెలిచాడు… అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ ఏమిటి, తన సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోం అని బీజేపీ బహిష్కరించింది కదా… తరువాత రెగ్యులర్ స్పీకర్ గడ్డం ప్రసాదరావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు… 2024 లోకసభ ఎన్నికల్లో తను మల్కాజిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి కూడా..!!
Share this Article