Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?

July 31, 2026 by M S R

.

రాజకీయాల్లో విమర్శ హుందాగా ఉండాలి… సంస్కారమే కాదు, విజ్ఞత- వివేచన కూడా ఉండాలి… దురదృష్టవశాత్తూ తెలంగాణ పాలిటిక్స్ కూడా చివరకు భ్రష్టుపట్టిన ఆ ఏపీ పాలిటిక్స్ వైపు వేగంగా జారిపోతున్నయ్… దీనికి ప్రధాన బాధ్యత బీఆర్ఎస్ పార్టీయే…

వందల కోట్లు ఖర్చు పెట్టి, మెయింటెయిన్ చేస్తున్న పే-ద్ద అబద్ధాల ఫ్యాక్టరీ, అనగా గులాబీ సోషల్ మీడియా విభాగం, దాని అధినేతలు కేటీయార్- కేసీయార్ ప్రధాన బాధ్యులు… ప్లస్ ఆ కేడర్, ఆ లీడర్ సరేసరి… ప్రజలు మెచ్చితే మళ్లీ సీఎం అవుతావులే కేసీయార్, దానికోసం మరీ ఇంతగా పాతాళంలోకి పయనం ఎందుకు..? నీ సుదీర్ఘ పోరాట రాజకీయ జీవితానికే తలవంపులు… /జీవనసంధ్యవేళ ఈ అప్రతిష్ట అవసరమా..?!

Ads

ఇదంతా ఓసారి ఎందుకు చెప్పుకోవాలీ అంటే… సందర్భం కాబట్టి… మరీ తమ పార్టీకే చెందిన ఓ కీలకనేత అనారోగ్యాన్ని కూడా ‘క్షుద్ర రాజకీయాలకు’ వాడుకున్నారు కాబట్టి… నచ్చలేదు కాబట్టి… ఇది తెలంగాణకు ఏమాత్రం ప్రయోజనకరం కాదు కాబట్టి…

నిన్న బీఆర్ఎస్ రియల్ లీడర్ హరీష్ రావు ఏమన్నాడు..?



‘‘పెద్ది సుదర్శన్ రెడ్డి అస్వస్థతకు గురైన రోజు 30 – 40 నిమిషాలు హార్ట్ ఆగిపోయింది… దీంతో మెదడుకు ఆక్సిజన్, రక్త ప్రసరణ నిలిచిపోయింది… జనరల్‌గా 5 నిమిషాలు బ్రెయిన్‌కు ఇవి అందకపోతే బ్రెయిన్ డెడ్ అవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఆయనకు వచ్చింది హార్ట్ ఎటాక్ కాదు. లంగ్స్‌కు సంబంధించిన సమస్య.

గత 20 రోజుల నుంచి హిమోగ్లోబిన్‌కు సంబంధించిన ట్యాబ్లెట్ వాడలేదు. దీంతో హిమోగ్లోబిన్ పర్సంటేజీ పెరిగి లంగ్స్ నుంచి హార్ట్‌కు పోయే వాల్వులో బ్లాక్ ఏర్పడింది. లంగ్స్ పనితీరు దెబ్బతింది. దాని ఎఫెక్ట్ గుండెపై పడింది. ఇది హార్ట్ ఎటాక్ కాదు.. ఊపిరితిత్తుల సమస్య…’’



మరి మొన్నటి నుంచీ బీఆర్ఎస్ లీడర్లే ఏం ఆరోపణలు చేస్తున్నారు..? ‘‘పెద్ది అనారోగ్యానికి కాంగ్రెస్ సర్కార్ కక్షపూరిత రాజ కీయాలే కారణం… 20 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డికి 25 ఏళ్లుగా సెక్యూరిటీ ఉంది, గన్ లైసెన్స్ ఉంది… రేవంత్ అధికారంలోకి వచ్చాక గన్ లైసెన్స్ రెన్యువల్ చేయలేదు, గన్‌మెన్‌ను తొలగించారు…

‘కాంగ్రెస్ పాలనలో రూ.1,100 కోట్ల సివిల్ సప్లై స్కామ్‌ను పెద్ది వెలుగులోకి తెచ్చాడు… ఈ కక్షతోనే భద్రతను తొలగించి ప్రభుత్వం ఒత్తిడికి గురిచేసింది… వట్టినాగులపల్లిలోని వాసవీ బిల్డర్స్‌కు పలువురు నర్సంపేట వ్యాపారులు విక్రయించిన భూమిపై సీఎం ముఖ్య అనుచరుడు ఫహీం ఖురేషీ కన్నుపడ్డది… ఆ వ్యాపారులపై కేసులు పెట్టించి, అందులో పెద్దిని ఇరికించేందుకు ఖురేషీ యత్నించాడు… ఈ పరిస్థితుల్లోనే పెద్ది గుండెపోటుకు గురయ్యాడు..’’



… అంటే ఆ ఒత్తిడితోనే పెద్ది గుండెపోటు అని తేల్చి, ఓ కీలక నేత అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి, రేవంత్ రెడ్డిపై బురద జల్లడానికి ప్రయత్నం… వోకే, నిజంగానే ఫహీం యాక్టివిటీస్ మీద విమర్శలు చేయాలని అనుకుంటే చేయొచ్చు, రాజకీయాల్లో సహజం… కానీ మరీ ప్రాణాపాయంలో, చావుబతుకుల్లో ఓ కీలకనేత ఉన్నప్పుడు, అదే నేత అనారోగ్యాన్ని అడ్డుపెట్టి ఈ రాజకీయాలు ఏమిటి..? చివరకు ఏపీ పాలిటిక్స్‌కన్నా నీచ స్థాయికి దిగజారుస్తారా..?

ప్చ్, కేసీయార్ విజ్ఞత మీద ఇంకా తెలంగాణ సమాజానికి నమ్మకం ఉంది, అది నిలుపుకోవాలి, ఇదుగో ఇలాంటి పోకడల్ని నివారించాలి… లేదు, నా చేతుల్లో ఏమీ లేదనుకుంటే, నాకూ కంట్రోల్ తప్పింది అనుకుంటే… సారీ బాస్, చరిత్ర కూడా ఇక మిమ్మల్ని గుర్తుంచుకోదు!! పర్టిక్యులర్‌గా పెద్ది సుదర్శన్‌రెడ్డిని అవమానించకండి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ సార్, మీ విజ్ఞతపై ఇంకా నమ్మకముంది… మరి ఇదేం పోకడ !?
  • ప్రతి పనికీ పార్టీ ఆమోదమా? ఇవి సీఎం ముందరికాళ్లకు బంధాలు?
  • అనుకున్నదే ! బొద్దింకలకు జతగా క్రిమినల్స్ ! ఏదో ప్రిప్లాన్‌డ్ స్కెచ్ !!
  • రామాయణ్ దర్శకుడు నితేశ్ తివారీ నాకెక్కడ నిజంగా నచ్చాడంటే..!?
  • రక్తసంబంధాలు పెళుసుగా మారి… ఇంటింటికో ఇలాంటి కథ!
  • నిండుకుండ ఎల్లంపల్లి గేట్లు ఓపెన్ ! – గులాబీ నోళ్లు క్లోజ్ !!
  • పెద్ది సుదర్శన్ రెడ్డి కాలధర్మం ! ఫలించని ఆధునిక వైద్య చికిత్స !
  • తెలంగాణ ప్రభుత్వమా… బహుపరాక్! నీళ్లను జనరేట్ చేయలేం..!!
  • ఒక సిద్ శ్రీరామ్ – ఒక ఎస్పీ బాలు … పూర్తి కంట్రాస్టు ఉచ్చారణ…
  • ‘‘ఇలా కేసులు పడితే, ఇక ఎవరూ దేవుళ్ల మీద సినిమాలు తీయలేరు’’

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions