.
నిజానికి ఇది నేను రాయదలుచుకోలేదు మొదట… కానీ సమాజంలో గొప్ప మార్గదర్శకులుగా, సత్యసంధులుగా ప్రచారంలోకి వచ్చే కొందరి గొప్పతనం గాలిబుడగల్లాగా ఎలా పేలిపోతుందో చెప్పడానికి నిష్పక్షపాతంగా ఓ కథనం… ఇది నా అభిప్రాయం మాత్రమే… ఎప్పటిలాగే ఆహా ఓహో అనే భుజకీర్తులు, భజకీర్తనులు ప్లీజ్ గోఎహెడ్…
ప్రొఫెసర్ నాగేశ్వర్… ఒక టరమ్ ఎమ్మెల్సీ, తెలంగాణ… తను అచ్చంగా సీపీఎం క్యాంప్… పక్కా తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు వ్యతిరేక క్యాంప్… ఐనా సీపీఎం అభ్యర్థిగా వోట్లడగలేదు, స్వతంత్రుడిగా అడిగాడు… అక్కడ మొదలైంది ఆయన మీద సందేహ దృష్టి…
Ads
సీపీఎం నేత తమ్మినేేని పెడ, చెడ, నియో, ఫాసిస్ట్ పెట్టుబడిదారీ పోకడలతో… లెఫ్ట్ సానుభూతిపరుల నుంచి కోట్ల వసూలు చేసి, మీరూ వాటాదారులే అని కళ్లకు గంతలు కట్టి అప్పట్లో ఓ టీవీ చానెల్ స్టార్ట్ చేశారు… పేరు గుర్తులేదు, గుర్తుంచుకోదగిన పేరూ కాదు… దానికి మొదట్లో ఎడిటర్ కమ్ హెడ్ ఈ నాగేశ్వర్…
అన్నీ అయిపోయాయి, సొంత యూట్యూబ్ చానెల్ పెట్టాడు… ఏవైనా టీవీ డిబేట్లకు వెళ్తే క్లీన్ ఫీడ్ తీసుకుని, తనూ తన చానెల్‌లో పెడతాడు… ఫుల్లు వ్యూస్, రెవిన్యూ, పాలపొంగు… ఎప్పుడైతే ఒక అభిప్రాయాన్ని… (అది మాలీషియస్ కావచ్చు, ఇంటెన్షనల్ కావచ్చు లేదా ప్రొఫెషనల్ ఫ్లో కావచ్చు) జనసేనను మరీ డ్యామేజ్ చేసేలా ప్రసారం చేశాడో మొదలైంది తరువాత కథ..,
అసలే అది శతఘ్ని అనే నొటోరియస్ వ్యవస్థ… ఒత్తిడి పెరిగి, ట్రోలింగ్ భరించలేక, నా సోర్స్ నమ్మాను, సారీ అన్నాడు నాగేశ్వర్, అక్కడే జర్నలిస్టుగా సగం మరణించినట్టు లెక్క… తను నిలబడి ఉండాల్సింది, నాకు తెలిసింది నేను చెప్పాను అని… వంద మెట్లు దిగిపోయాడు దాంతో…
తరువాత నాగబాబు ఎట్సెట్రా జనసేన అధికార, ఆస్థాన ప్రతినిధే ఇంతటితో ముగించేద్దాం అన్నాడు… అక్కడ ముగిసిపోవాలి నిజానికి… జనసేన వెనక్కి తగ్గింది… కానీ నాగేశ్వర్ దాన్ని కొనసాగించాడు, సారీ చెప్పాక కూడా దమ్ముంటే కేసు పెట్టుకో, అరెస్టు చేసుకో అని ధీరోదాత్తుడిగా మాట్లాడాడు… హీరో చిత్రణకు విఫల ప్రయత్నం…
కేసులు పడ్డాయి… వెంటనే తెలంగాణ వ్యతిరేకి నాగేశ్వర్‌కు తన తెలంగాణ ఎర్రటి స్థానికత గుర్తొచ్చింది… ఆయ్ఁ ఓ తెలంగాణ జర్నలిస్టులను ఏపీ పోలీసులు అరెస్టు చేస్తారానే రచ్చ… సో వాట్… ఏదో రాష్ట్రంలో కేసులుంటే తెలంగాణ ప్రభుత్వం తనకు షీల్డ్ కావాలా..? ఈ దెబ్బ ఎంత పడ్డదీ అంటే…
నాగేశ్వర్ వ్యూహాలు బెడిసికొట్టాయి… క్రెడిబులిటీ పోయింది… తనేం చెప్పినా నమ్మేవాడు లేడు… ఒకప్పుడు లక్షల్లో సంపాదించిన తను ప్రస్తుతం బేలచూపులు… చిన్నాచితకా కొత్త చానెళ్లు సైతం ఒక వీడియోకు కనీసం వేలల్లో వ్యూస్ సంపాదిస్తాయి… ఇంత ఘన చరిత్ర ఉన్న నాగేశ్వర్ కూడా వాళ్ల సరసకు జారిపోయాడు…
పాఠకులకు లేదా వీక్షకులకు ఇచ్చే నిజాన్ని, విశ్లేషణలోని పారదర్శకతను తాకట్టు పెడితే ఎంతటి పెద్ద పేరున్న విశ్లేషకుడైనా డిజిటల్ వేదికలపై ఒంటరి కాక తప్పదనే దానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రస్తుత పరిస్థితే ప్రత్యక్ష నిదర్శనం… కేసులు పెట్టుకొండి, హైలైట్ అవుతాను, నా వ్యూస్ పెరుగుతాయి, మస్తు సంపాదిస్తాను అని మాట్లాడాడు కదా… ఇదీ ఫలితం…
ఏకంగా 11 లక్షల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్న తన చానెల్ దురవస్థ ప్రతి యూట్యూబర్‌కు… నేషనల్, యాంటీ నేషనల్ పోకడలతో వెళ్లే ప్రతి ప్రాపగాండిస్టుకూ ఓ గుణపాఠం… ఈ మాట అనడానికి నేనేమీ సందేహించడం లేదు… నిష్పాక్షిక విశ్లేషకుడిగా, విద్యావేత్తగా సమాజంలో గౌరవం పొందడం వేరు, నిలబెట్టుకోవడం వేరు… అదే ఈ కథనంలోని నీతి…
రాబోయే రోజుల్లో ఆయన డిజిటల్ ప్రస్థానం మరింత నిరాశాజనకంగా మారే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు… తనలాగే మరికొందరు యూట్యూబర్లు దారుణంగా దెబ్బతినబోతున్నారనేదీ చూడబోతున్నాం..!!
Share this Article