.
మనిషి మెంటల్ గాడే గానీ… చాలాసార్లు తను చెప్పింది అక్షర సత్యాలు అనిపిస్తాయి… కాకపోతే చెప్పడంలో తనది వేమన టైపు కాదు… వర్మ టైపు… క్రూడ్…
.
Ads
ఎస్, పుష్ప2 సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఒక వ్యవస్థగా చంద్రబాబు, రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్… దరిద్రపు నిర్ణయాలు… అంతే మరి… ఇద్దరూ పుష్ప2 తరహా కేరక్టర్లే కదా… అలాగని జగన్ తక్కువ అనీ కాదు… కేసీయార్ మరీ తక్కువ కాదు… దొందూ దొందే తరహాలో అందరూ అందరే…
తెలుగు సినిమా చరిత్రలోనే ఇది అరాచకం… సిగ్గూశరం లేని ప్రభుత్వాల సాక్షిగా వందల కోట్ల అక్రమ దందా ఇది… దీనిపై రామగోపాలవర్మ ఏమంటాడంటే..? (బాగా చెప్పాడు )
పుష్ప 2 ఇడ్లీలు #Pushpa2
సుబ్బారావు అనే ఒకడు ఒక ఇడ్లీ హోటల్ పెట్టి , ప్లేట్ ఇడ్లీల ధరను రూ. 1000గా పెట్టాడు. సుబ్బారావు అంత ధర పెట్టడానికి కారణం, వాడి ఇడ్లీలు మిగతావాటి ఇడ్లీల కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు.
కానీ కస్టమర్‌కు సుబ్బారావు ఇడ్లీలు అంత వర్త్ అనిపించకపోతే, వాడు సుబ్బారావు హోటల్‌కు వెళ్లడు. దాంతో నష్టపోయేది సుబ్బారావు ఒక్కడే తప్ప, ఇంకెవ్వరూ కాదు.
“సుబ్బారావు ఇడ్లీల ధర సామాన్య ప్రజల అందుబాటులో లేదు” అని ఎవరైనా ఏడిస్తే , అది “సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదు” అని ఏడ్చినంత వెర్రితనం
ఒకవేళ “సెవెన్‌స్టార్ హోటల్‌లో అంబియన్స్‌కి మనం ధర చెల్లిస్తున్నాం” అని వాదిస్తే, పుష్ప 2 విషయంలో ఆ సెవెన్‌స్టార్ క్వాలిటీ అనేది ఆ సినిమాయే…
డెమొక్రాటిక్ క్యాపిటలిజం అనేది క్లాస్ డిఫరెన్స్ మీదే పనిచేస్తుంది. అన్ని ప్రొడక్ట్స్ లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మించబడతాయి, అంతే కానీ ప్రజా సేవ కోసం కాదు.
అప్పుడు లగ్జరీ కార్లపై, విలాసవంతమైన భవనాలపై, బ్రాండెడ్ బట్టలపై ఎలాంటి ఏడుపూ ఏడవనోళ్లు సినిమా టికెట్ ధరల మీదే ఎందుకు ఏడుస్తున్నారు ?
ఎంటర్టైన్మెంట్ నిత్యావసరమా?
ఇల్లు, తిండి, బట్టలు ఈ మూడింటి కన్నా ఎక్కువ అవసరమా?
అలా అయితే ఈ మూడు నిత్యావసరాల ధరలు బ్రాండింగ్ వున్నప్పుడు , ఆకాశాన్ని తాకుతుంటే, ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు కూడా తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానెయ్యొచ్చూ , లేదా తర్వాత రేట్లు తగ్గక చూసుకోవచ్చు కదా?
మల్లి సుబ్బారావు హోటల్ చైన్ విషయం కొస్తే ఇడ్లీ ధర ఇప్పటికే వర్కౌట్ అయిపోయింది .. దానికి ప్రూఫ్ ఏమిటంటే సుబ్బా రావు ఏ హోటల్లో కూడా కూర్చునే చోటు దొరకడం లేదు, అన్ని సీట్లు బుక్ అయిపోయాయి!
సింపుల్ … తను చెప్పేది ఏమిటంటే.,.? పెద్ద హోటల్లో పెద్ద రేట్లు పెట్టి ఎవడు చూడమన్నాడు… అసలు ఆ సినిమా ఎవడు చూడమన్నాడు అని… బాగా చెప్పావు బ్రో… పుష్ప2 మీద ఈ ఏడుపులు దేనికి..? చూడటం మానేస్తే కదా నేల మీదకు దిగివచ్చేది ఎవడైనా…
చివరకు ఈ దందా… నేషనల్ మీడియాకూ ఎక్కింది… ఇలా…
అన్నట్టు బుద్ధా మురళి సెటైర్ చూడలేదు కదా… ఇదుగో…
మూడు వేలు పెట్టి సినిమా టికెట్ కొనే బదులు … ఓ పేద వాడికి ఇస్తే నెల రోజులు బతుకు తెరువు …
దాదాపు ఇవే మాటలతో ఓ పోస్ట్ చూశా …
సరే టికెట్ కు బదులు మూడు వేలు పేదవాడికి ఇస్తే … పేదవాడు ఏం చేస్తాడు ?
ఇంకేం చేస్తాడు, తన అభిమాన హీరో ప్రతి సినిమా మొదటి రోజు మొదటి ఆట చూస్తాడు … మళ్ళీ మళ్ళీ చూస్తాడు ..
రోల్స్ రాయిస్ కారులో తిరిగే బదులు ఆ డబ్బు పేద వాడికి ఇవ్వవచ్చు కదా అని ఓషోను అడిగితే … కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు … ఇందులో నా పాపం ఏమీ లేదు ( ఓషోకు పెళ్లి పిల్లలు లేరు ) నేను వారికి ఇస్తే మరి పేదవాళ్ళు ఏం చేయాలి ? మరింత మంది పేదలను పుట్టిస్తారా అని అడిగారు …
మూడు వేలు కాదు ఉచితంగా అయినా నేను చూడను … నా సమయం , నా డబ్బు, నా ఇష్టం ….
నీ డబ్బు , నీ సమయాన్ని సినిమాలకు కేటాయిస్తావా ? నీ కోసం కేటాయించుకుంటావా అనేది నీ ఇష్టం .
కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీస్తారు … పెట్టిన దాని కన్నా రెట్టింపు లాభం రావాలి అని చూస్తారు … అది వ్యాపారం, అదేమీ దేశభక్తి కాదు, కళాసేవ కాదు, ఫక్తు వ్యాపారం … లాభమే వ్యాపార సిద్ధాంతం .. అన్ని వ్యాపారాల్లానే సినిమా ఒక వ్యాపారం . టికెట్ రేట్లు పెంచితే నిర్మాతకు లాభం . ప్రభుత్వానికి అధిక పన్ను యిద్దరికీ లాభమే …
మూడు వేల రూపాయలు పెట్టి మొదటి రోజు మొదటి ఆట చూడాలా ? వద్దా ? అనేది నీ ఇష్టం .. డిమాండ్ అండ్ సప్లయ్ ధర నిర్ణయిస్తుంది … మూడు వేలు అన్నా ఎగబడి వెళ్తే ఐదు వేలు కూడా అవుతుంది . చూసేవాడు లేకపోతే మూడు వందలకు 30 రూపాయలకు కూడా దిగుతుంది ..
ఇష్టం ఉన్నవాడు చూస్తాడు, లేని వాడు లేదు … అంతే కానీ మూడు వేలు పెట్టి టికెట్ కొనే బదులు పేదవాడికి ఇవ్వాలి అనే వాదన ఏమిటో ?
హైదరాబాద్ లో ఓ ప్రాంతంలో వందల గుడిసెలు … భార్య భర్త కూలీలు రోజుకు కనీసం రెండు వేల కూలీ .. ఇంటి అద్దె, కరెంట్ ఖర్చు లేదు … శని ఆదివారాలు ఏదో సంస్థ వచ్చి వారికి భోజనం పెట్టి వెళుతుంది .. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్స్ తరువాత పాతిక వేల జీతం అంటే, వీరికన్నా గుడిసె వారి ఆదాయం ఎక్కువ … ఐతే వారికి ఉచిత భోజనంకన్నా వచ్చిన కూలీ ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పాలి…
ప్చ్… మెగా బాపతు అరాచకం తగ్గాలంటే బన్నీ మరింత సక్సెస్ కావాలి… ఎవరో జనసేన నేత అట… నువ్వు వైసీపీకి ప్రచారం చేస్తావా..? నీ సినిమాకు ఎవడు చూస్తాడో చూస్తాం అంటున్నాడు… సరే, ఆ పార్టీ నేత రేంజు అదే… కానీ సినిమా నయా అవలక్షణాల పైత్యం పోవాలంటే పుష్ప2కు ఓ పాఠం కావాలి… ఈ రెండూ జరగాలంటే ఎలా మరి..?!
Share this Article