పార్ధసారధి పోట్లూరి ……. మధ్యప్రాచ్యం మంట-పార్ట్-5… పుతిన్ చైనా పర్యటన కొన్ని చేదు నిజాలు! పుతిన్ చైనాలో ఒకరోజు పర్యటించాడు… బీజింగ్ ఎయిర్పోర్ట్ లో పుతిన్ కి ఘన స్వాగతం లభించింది! ఊరుపేరు లేని ఒక మంత్రిని పుతిన్ ని ఆహ్వానించడానికి పంపించాడు జింగ్పింగ్ ఎయిర్ పోర్ట్ కి! రెండూ మిత్ర దేశాలే! ఇంతలో ఎంత మార్పు? రష్యా అధ్యక్షుడుగా పుతిన్ నియంత! కానీ జింగ్పింగ్ ని శాశ్వత అధ్యక్షుడిగా అక్కడి సెంట్రల్ పార్టీ నియమించింది. ఉక్రేయిన్ తో యుద్ధం మొదలుపెట్టాక మెల్లమెల్లగా బలహీనపడుతూ వచ్చాడు పుతిన్. చిన్న చిన్న అవసరాలకు ఇరాన్, చైనాలమీద ఆధారడుతూ రావడంతో సహజంగానే చులకన అయ్యాడు!
**************
ప్రస్తుతం చైనా చేతిలో కీలుబొమ్మ అయ్యాడు పుతిన్. ఉక్రేయిన్ తో యుద్ధం, ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం గురుంచి జింగ్పింగ్ తో చర్చించానని విలేఖరుల సమావేశంలో పేర్కొన్నాడు! పుతిన్ చైనా పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది! 2022 నవంబర్ నుండి ఇప్పటివరకు పుతిన్ పాత సోవియట్ రిపబ్లిక్ దేశాలకే పరిమితం అయ్యాడు తప్పితే మాస్కో వదిలి బీజింగ్ రావడం ఇదే తొలిసారి! హెగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఉక్రేయిన్ లో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పుతిన్ మీద. అప్పటి నుండి పుతిన్ ఏ దేశ పర్యటనకు వెళ్ళలేదు! జింగ్పింగ్ అరెస్ట్ చేయడు.
Ads
******************
నిజానికి పుతిన్ బీజింగ్ రావడానికి కారణం BRI సమావేశాలు ! కానీ ఆంతరంగిక చర్చల్లో ఇజ్రాయెల్ హమాస్ గురించే వ్యూహ రచన జరిగింది!మధ్యధరా సముద్రంలో అమెరికన్ క్యారియర్ స్త్రైక్ గ్రూపుని మోహరించడం మీద ప్రధానంగా చర్చ జరిగి ఉండవచ్చు. ఇరాన్ తో తరువాతి చర్యలు తీసుకోవాలని కోరడానికి మరియు మధ్యధరా సముద్రంలో రష్యన్ యుద్ధ నౌకలకి ప్రవేశం లేకుండా పోవడం మీద కూడా చర్చ జరిగింది అనుకోవచ్చు.
రష్యన్ నావీ మధ్యధరా సముద్రానికి దగ్గర దారి… నల్ల సముద్రం నుండి టర్కీ ప్రాదేశిక జలాల ద్వారా మధ్యధరా సముద్రంలోకి వెళ్ళవచ్చు కానీ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఒప్పుకొడు. రష్యన్ నావీకి సంబంధించి మధ్యధరా సముద్రంలో ఒకే ఒక్క డిస్ట్రాయర్ సిరియా తీరంలో ఉంది. ఒకవేళ ఘర్షణ కనుక తీవ్రరూపం అయి యుద్ధంగా మారితే రష్యన్ డిస్ట్రాయర్ ఒక్కటే సరిపోదు కాబట్టి చైనా జోక్యం గురుంచి చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది!
*************************
పుతిన్ చైనా లో ఉండగానే అమెరికా గుట్టు చప్పుడు కాకుండా MGM-140 ATACMS (Army Tactical Missile System) ని ఉక్రేయిన్ లో దించింది.
ATACMS అనేది HIMARS కంటే ఎక్కువ రేంజ్ ఉంటుంది. HIMARS అనేది ఆర్టిలరీ రాకెట్స్ విభాగం కిందకి వస్తుంది. ATACMS అనేది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ విభాగం కిందకి వస్తుంది.
ATACMS లో మూడు రకాల మోడల్స్ ఉన్నాయి. కానీ 250 KM రేంజ్ గల ATACMS పంపించినట్లు తెలుస్తున్నది. మొత్తం 20 ATACMS యూనిట్లని ఇచ్చించి ఉక్రేయిన్ కి. అయితే చాలా రోజుల ముందే ఉక్రేయిన్ సైనికులకు శిక్షణ ఇచ్చింది అమెరికా ATACMS ఎలా ఆపరేట్ చేయాలో!
*********************
పుతిన్ చైనాలో ఉండగానే అర్ధరాత్రి ATACMS తో రష్యా మీద దాడి చేసింది ఉక్రేయిన్. ATACMS దాడి ఎంత తీవ్రంగా ఉందంటే రష్యా ఉక్రేయిన్ సరిహద్దుల్లో రష్యా లో ఉన్న ఆయుధ డిపోలు, ఆయిల్ డిపోల మంటలు మరుసటి రోజు మధ్యాహ్నం వరకు మండుతూనే ఉన్నాయి. ఈ రష్యన్ ఆయుధ డిపోలు, ఆయిల్ డిపోల నుండే ఉక్రేయిన్ లో పోరాడుతున్న రష్యన్ దళాలకి సప్లయ్ అవుతున్నది.
ATACMS సిస్టం రేంజ్ 250 KM కాబట్టి వెంటనే ATACMS రేంజ్ కి అందనంత దూరంలో మళ్లీ ఆయుధ, ఆయిల్ డిపోలని నిర్మిస్తున్నాయి రష్యన్ దళాలు. ఇది వ్యూహాత్మక దాడి. దీనివల్ల రష్యన్ దళాలకి సప్లైస్ అందడానికి కనీసం 5 నుండి 7 గంటలు పడుతుంది. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక సప్లయ్ కి మరొక సప్లయ్ కి మధ్య వ్యవధి 7 గంటలు ఉంటే అది నాశనానికి దారి తీస్తుంది! ATACMS మిసైల్ GPS ఆధారంగా చేసుకొని రష్యన్ భూభాగంలో ఉన్న టార్గెట్స్ ని చాలా యాక్యురేట్ గా ధ్వంసం చేశాయి.
*******************
హిట్లర్ వ్యూహాన్ని అనుసరిస్తున్నాడా పుతిన్?
అవును. హిట్లర్ తన పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తులని రహస్యంగా ఉంచేవాడు. అవసరం అయినప్పుడు కమాండర్ల సమావేశానికి పంపేవాడు.
నాజీ కమాండర్లు నిజంగా హిట్లర్ తమతో సమావేశం అయ్యాడు అనుకునే వారు. ఒకే సమయంలో రెండు వేరు వేరు ప్రదేశాలలో నాజీ జనరల్స్ తో సమావేశంలో పాల్గొనేవాడు హిట్లర్. కానీ విషయం ఎవరికి తెలిసేది కాదు.
ఒక సమావేశంలో హిట్లర్ ని బాంబ్ పేల్చి చంపడానికి ప్రయత్నం చేసాడు ఆర్మీ ఆఫీసర్. హిట్లర్ చనిపోయాడు అనుకున్నారు అందరూ. కానీ ఆ దాడిలో నకిలీ హిట్లర్ గాయాలతో బయటపడ్డాడు. తరువాత హిట్లర్ తన హత్యకి కుట్ర పన్నిన ఆర్మీ ఆఫీసర్లు అందరిని గుర్తించి కాల్చి పారేశాడు!
దీని మీద హాలీవుడ్ చిత్రం ‘VALKYRIE’ పేరుతో సినిమా తీశారు చాలా బాగుంటుంది, చూడండి. హిట్లర్ హత్యకి కుట్ర పన్నిన ఆర్మీ అధికారి పాత్రలో Tom Cruise నటించాడు.
********************
చైనా నుండి రాగానే పుతిన్ హుటాహుటిన ఉక్రేయిన్ సరిహద్దుల్లో ఉన్న సైనిక బేస్ కి చేరుకొని ATACMS మిసైళ్ల దాడిలో జరిగిన నష్టాన్ని అధికారులని అడిగి తెలుసుకున్నారు. అయితే సైనిక బేస్ దగ్గరికి వచ్చింది అచ్చం పుతిన్ లాగానే ఉన్న నకిలీ వ్యక్తి. ఓ 10 ఏళ్ల క్రితo పుతిన్ ఎలా చెంపలు లోపలికి పోయి ఉండేవాడో అచ్చం అలానే ఉన్నాడు. ప్రస్తుతం పుతిన్ మొఖం ఉబ్బిపోయి ఉంది స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడడం వలన.
రెండు ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 1.పుతిన్ తన రక్షణ మంత్రి తో టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడున్నది కానీ టేబుల్ మీద మాపులు ఉండాల్సిన స్థానంలో తెల్ల పేపర్లు ఉన్నాయి. 2.పుతిన్ తో బేస్ బయట రక్షణ మంత్రితో నిలబడి మాట్లాడుతున్న ఫోటో. ఈ రెండు ఫోటోలలో పుతిన్ సన్నగా, పొట్టిగా (పుతిన్ పొట్టిగానే ఉంటాడు) అసహజంగా ఉన్నాయి. రక్షణ మంత్రి వచ్చింది నకిలీ పుతిన్ అన్నట్లుగానే హావభావాలు ఉన్నాయి. కానీ పుతిన్ తీవ్ర అస్వస్థతకి గురయి బెడ్ మీద ఉన్నట్లు తెలుస్తున్నది… Contd….పార్ట్ -6
Share this Article