.
జుగుప్సాకర రాజకీయాల్లోకి ఇంట్లోని ఆడవాళ్లను, రాజకీయాలతో ఏ సంబంధమూ లేనివాళ్లను లాగి… ఎవరెవరికో అక్రమసంబంధాలు అంటగట్టి, ఎవరెవరి పుట్టుకలకు ఇంకెవడెవడో కారణమంటూ శీలహననం చేసే గాడిదకొడుకుల రాజకీయాలు ఇప్పుడు…
వాళ్లకూ అక్కాచెల్లెళ్లున్నారు, తల్లి ఉంది అనే సోయి కూడా లేని బాడ్‌ఖావ్‌లు… చూస్తూనే ఉన్నాం… రాజకీయాల వికృత సోషల్ మీడియా మొహాల్ని..! ప్రత్యేకించి ఏపీ పాలిటిక్స్, నీతీజాతీరీతీ ఏమీ ఉండవు… వాళ్ల భాషలోనే చెప్పాలంటే మాదచ్చోద్ ధోరణి… ఈ భూమికే అవాంఛనీయ సంతానం ఆ బ్యాచులు…
Ads
వాటికి పార్టీలు వెచ్చించే కర్చు వందల కోట్లు… పేరుకు సోషల్ సైన్యం అట… చావండిరా ఇడియెట్స్… ఇన్నాళ్లూ తెలంగాణ కాస్త డిఫరెంట్ అనుకున్నాం… ఎప్పుడైతే వందల యూట్యూబ్ చానెళ్లు, సైట్లు, వేల సోషల్ హౌండ్స్‌తో గులాబీ క్యాంపు రెచ్చిపోతున్నదో… రేవంత్ రెడ్డి పోలీసులకు ఒక్కడినీ కనీసం ఒక్కరోజైనా జైలులో పెట్టే స్థోమత, స్థాయి లేదో…
కానీ పదేళ్లలో అగడుపడ్డట్టు సంపాదించిన లక్షల కోట్లలో ఈ ఖర్చుదేముంది ఆఫ్టరాల్ అనుకున్నారేమో… కానీ ఇక్కడే ఓ కంట్రాస్టు… చివరకు జాతీయ కాంగ్రెస్… అందులోనూ ఈ దేశ ప్రతిపక్ష నాయకత్వానికి, స్పూర్తికి, నెహ్రూ కుటుంబానికీ ఏమాత్రం కొరగాని వారసుడిని తన టీమ్ మరీ తోలుబొమ్మను చేసి, రోజురోజుకూ భారతీయ సమాజంలో తనను దిగజారుస్తున్నాయి…
ఓ లీడర్ ఏకంగా స్పీకర్‌ను ఏ లంజెకొడుకు? అని నిందిస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు ఈరోజుకూ చర్య తీసుకునే సోయి లేదు… రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఓ మచ్చ… స్పీకర్ తన విచక్షణాధికారాల్ని కూడా ఉపయోగించి చర్య తీసుకోలేని ఓ విషాదం… పిటీ కాంగ్రెస్… ఇదే బీఆర్ఎస్ అధికారంలో ఉంటే అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించి ఉండేది… ఏటా వందలకోట్లు ఖర్చు పెట్టే ‘మీడియా మెయింటెనెన్స్ టీమ్’ ఉందిగా…
ఇక్కడ రాహుల్ గాంధీకి తనకంటూ సొంత తెలివితేటలు లేకపోవడం ఓ పెద్ద విషాదం భారతీయ రాజకీయాల్లో..!!

పక్కా తాజా ఉదాహరణ చెప్పుకుందాం… ఇండోర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఛాత్రోంకీ గూంజ్’ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి స్టేజిపైకి వచ్చిన స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ ఓ చిన్న స్కిట్ చేశాడు… నిజానికి వాడొక వెకిలి కేరక్టర్…
మోదీ తరచూ ఉపయోగించే “My friend” అనే మాటను పట్టుకున్నాడు… విదేశీ నేతలను పలకరించే తీరు, కౌగిలింతలు, పిల్లలతో ఉన్నప్పుడు చేసిన కాయిన్ ట్రిక్ వరకు అనుకరించాడు… ఇంతవరకు దీనిని రాజకీయ వ్యంగ్యం అనుకోవచ్చు… కానీ స్కిట్‌లో ఒక దశలో మోదీ తల్లికి సంబంధించిన సూచన వచ్చింది…
కమెడియన్ మోదీని అనుకరిస్తూ నవ్వుతూ “Maa ko kursi do, maa” అంటూ వ్యాఖ్య చేశాడు… ఆ తర్వాత “Setting, my friend” అంటూ తన స్కిట్‌ను కొనసాగించాడు… ఆ సమయంలో రాహుల్ గాంధీ అతడి పక్కనే ఉన్నాడు… కమెడియన్‌తో సంభాషించాడు… నవ్వాడు… కార్యక్రమం తర్వాత కాంగ్రెస్ కూడా ఆ స్కిట్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పంచుకుంది…
ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. బీజేపీ నేతలు మాత్రం దీన్ని సాధారణ రాజకీయ వ్యంగ్యంగా చూడలేదు. ప్రధాని మోదీ మరణించిన తల్లిని కూడా అవమానకరమైన హాస్యంలోకి లాగారని ఆరోపిస్తూ రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. “తల్లి రాజకీయాలకు విషయం కాదు” అన్నదే వారి ప్రధాన వాదన.
కాంగ్రెస్ మాత్రం మరో వాదన చేస్తోంది. ఇది కేవలం మిమిక్రీ మాత్రమేనని, రాహుల్ గాంధీ స్వయంగా మోదీ తల్లిపై ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య చేయలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ అయితే రాహుల్ కేవలం నవ్వారని, మిమిక్రీని మిమిక్రీగానే చూడాలని వాదించాడు. మరో కాంగ్రెస్ నేత టీఎస్ సింగ్ దేవ్ కూడా మిమిక్రీపై అభ్యంతరం అవసరం లేదని, అయితే బహిరంగ సంభాషణలో దుర్భాషలకు మాత్రం స్థానం ఉండకూడదని వ్యాఖ్యానించాడు…
ఇక్కడే అసలు ప్రశ్న. ప్రధాని మోదీని ఎగతాళి చేయకూడదని ఎవరూ చెప్పడం లేదు. ప్రధానిని ఎంత ఘాటుగా విమర్శించినా ప్రజాస్వామ్యంలో అది చర్చలో భాగమే. మోదీ విదేశాంగ విధానం నచ్చకపోతే దాన్ని ఎండగట్టవచ్చు. ఆయన ప్రసంగ శైలిని వ్యంగ్యంగా చూపించవచ్చు. ఆయన రాజకీయ నిర్ణయాలను ప్రశ్నించవచ్చు. ఆయన అభిమానులకు కూడా నచ్చని విధంగా విమర్శించవచ్చు.
కానీ ఒక వ్యక్తిని రాజకీయ ప్రత్యర్థిగా విమర్శించే క్రమంలో ఆ వ్యక్తి తల్లి వరకు వెళ్లాల్సిన అవసరం ఎంత? అది కూడా ఆమె జీవించి లేదు… రాహుల్ గాంధీ మోదీ తల్లిని తిట్టలేదు కదానేది ఓ విఫల సమర్థన… ఆ వేదిక పంచుకోవడం, ఆ వెధవను అలుముకోవడం, అభినందించడం రాహుల్ గాంధీ తనను తాను పాతాళానికి తీసుకుపోవడం..!!
ప్రత్యర్థిని అవమానించడానికి రాజకీయ పార్టీలు హాస్య కళాకారులను వేదికపైకి తీసుకొస్తున్నాయా? లేక రాజకీయ వ్యంగ్యం పేరుతో ఎలాంటి హద్దులైనా దాటవచ్చా? ఇవాళ మోదీ తల్లి. రేపు రాహుల్ తల్లి కావచ్చు. ఎల్లుండి ఇంకో నాయకుడి కుటుంబ సభ్యుడు కావచ్చు. అప్పుడు రాజకీయ పోరాటం విధానాలపై కాకుండా… ఎవరి కుటుంబాన్ని ఎంత వెగటుగా వాడుకోగలమన్న పోటీగా మారితే?
Share this Article