Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పౌరాణికాల్ని కొత్తగా తీస్తే బోలెడంత జాగ్రత్త మేలు… లేకపోతే ‘కాలిపోతుంది’…

March 14, 2024 by M S R

Subramanyam Dogiparthi….   అర్థం లేని , అర్థం కాని ఆదిపురుష్ వంటి రాముని కధ మన పద్మనాభం ఎప్పుడో 1969 లోనే జనం మీదకు వదిలాడు . రక్తి గొప్పదా లేక భక్తి గొప్పదా అనే అంశంపై నారదుడు త్రిమూర్తులను , అష్ట దిక్పాలకులను అందరినీ అభిశంసిస్తాడు . ఆ తర్వాత శ్రీదేవికి భూదేవికి తగాదా పెట్టి , ఒకరిని ఒకరు శపించుకునేలా చేస్తాడు .


మానవ లోకంలో జన్మించిన భూదేవిని నారదుడు , ఆయన మేనల్లుడు ప్రేమిస్తారు . వారి ప్రేమను భంగపరుస్తాడు శ్రీహరి . ఆ కోపంతో విష్ణువును నారదుడు శపిస్తాడు . ఆ శాపంతోనే రాముడికి సీతావియోగం కలుగుతుంది . టూకీగా ఇదీ కధ . మరి ఈ కధ వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నారా లేక మరేదయినా రామాయణం నుండి తీసుకున్నారా అనేది తెలియదు .

సినిమా రంగంలో ఉన్న తారాగణమంతా ఉన్నారు ఈ సినిమాలో . పద్మనాభం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా కాబట్టి , ఆయన మీద అభిమానంతో తళుక్కుమని ఉంటారు . హరనాథ్ , జయలలిత , శారద , గుమ్మడి , అంజలీదేవి , చంద్రమోహన్ , గీతాంజలి ప్రభృతులు నటించారు . ఈ సినిమాలో నాకు నచ్చిది రతీ దేవి పాత్రలో , చక్కగా నటించిన గీతాంజలి .

Ads

యస్ పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో శ్రావ్యంగా ఉన్నా బయట హిట్ కాలేదనుకుంటాను . పద్మనాభం చేతులు బాగా కాల్చుకున్నాడని అంటారు . ప్రజలకు తెలియని పౌరాణిక విషయాలను చూపించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి . మహా భారతంలో లేని మాయాబజార్ అలా ఓ కళాఖండంగా తీర్చిదిద్దబడింది .

మా నరసరావుపేటలో ఒక్క సారే చూసా . ఆదిపురుష్ , శ్రీరామకధ ఒకేలా నాకెందుకు అనిపించాయో తెలుసుకోవాలని మీరనుకుంటే , ఈ సినిమాలు యూట్యూబులో ఉన్నాయి . చూసేయండి . నన్ను తిట్టకూడదు సుమా .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వీడి ఫుడ్డు వీడే వండుకుంటాడట- ఇంకానయం, చీర్ గరల్స్ కావాలనలేదు!
  • ఆకాశమే నీ హద్దురా… మన అంతరిక్షంలోకి స్కైరూట్ విక్రమ్-1 కొత్త స్టెప్!
  • 25 ఏళ్లు- 25 వేలు- వెయ్యి కిలోమీటర్లు… ఇంట్రస్టింగు ‘రుణబంధం’!
  • ఒక మనిషి భౌతికంగా మాయమైపోయి, మరోచోట ప్రత్యక్షం కాగలడా?
  • నాగదుర్గ తొలి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టేనా?
  • అద్భుతం… 158 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిన అరుదైన పుష్పం!!
  • అదే వృద్ధ అక్కినేని- అదే మీనా- అదే క్రాంతికుమార్… కానీ రిజల్ట్..?!
  • సౌదీలో నేను సేఫ్ అనుకున్నాడు! చివరకు UAPA లో బుక్కయ్యాడు!!
  • కెరీర్ మొదట్లో చిరంజీవి దస్తూరీ తెలుసా మీకు..? ఇదుగో ఓ లేఖ!!
  • I, No Body – ఓ కొత్త స్టోరీ లైన్ – కథ చెప్పడంలోనే కాస్త తడబాటు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions