Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ట్యాగర్లకు రష్మి గౌతమ్ జవాబు… నన్ను కాదు, ప్రభుత్వాన్ని అడగండి…

May 12, 2026 by M S R

.

రష్మీ గౌతమ్… ఒకరకంగా డిఫరెంట్ కేరక్టర్… తోటి యాంకర్ అనసూయ అశ్లీల వీడియోలు, ఫోటోలు, డ్రెస్సులే మహిళా సాధికారత అన్నంత బిల్డప్ ఇస్తూ, సోషల్ మీడియాలో వ్యతిరేకించేవారి మీద కేసులు పెడుతూ ఓ నిరర్థక ప్రచారాన్ని పొందుతుంటే… రష్మి మాత్రం జీవకారుణ్యం వంటి అంశాలపై ఎవరికీ వెరవకుండా నిలబడుతోంది… పెద్ద పెద్ద తోపులు కూడా సైలెంటుగా కకూన్లలో బతుకుతుంటే ఈమె కొన్ని ఇష్యూస్ మీద ధైర్యం ప్రదర్శిస్తుంది, స్పందిస్తుంది…

ఐతే ఈమధ్య ఏ వివాదం తలెత్తినా సరే… సోషల్ మీడియాలో కొన్ని వింత కేరక్టర్లు కొన్ని పోస్టులు పెడుతూ, నువ్వెందుకు స్పందించలేదు, నువ్వెందుకు రాయలేదు, నువ్వేమీ మాట్లాడటం లేదు అంటూ ట్యాగ్ చేయడం అలవాటుగా చేసుకున్నారు… ఏదైనా ఒక విషయంపై స్పందిస్తే ఇక ప్రతి అంశంలోనూ స్పందించాల్సిందేనా..? లేకపోతే నేరమా..? అనైతికమా..?

Ads

బండి భగీరథ్ కేసు విషయంపైనా అంతే… ఈ కేసుపై రెండు విరుద్ధ వాదనలున్నాయి… భగీరథ్ ధోరణి, దుందుడుకు వైఖరి, వివాదాస్పద వ్యవహారశైలి అందరికీ తెలిసిందే గానీ ఈ కేసు కొంత డిఫరెంటుగా కనిపిస్తోంది… ఆ అమ్మాయి గనుక మైనర్ అయిఉంటే భగీరథ్ తను కూరుకుపోతూ, తండ్రిని కూడా చిక్కుల్లో పడేస్తున్నట్టే… సో, పోలీసు విచారణలో ఏం జరుగుతుందో చూడాలి…

ఎస్, రష్మి విషయానికి వస్తే… ఆమెనూ ఈ కేసు పోస్టులకు ట్యాగ్ చేస్తున్నారు… దానికీ బదులిచ్చింది ఆమె… ఓ పోస్టు పెట్టింది… ‘‘నేను బీజేపీకి (మోడీకి) మద్దతు ఇస్తాను కానీ… లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు… నేను ప్రతి పోస్టుకూ స్పందించను… సమస్యలపై కేవలం సానుభూతి చూపగలను, కానీ వాటిపై పోరాడేంత శక్తి నాకు లేదు…

మనుషుల సమస్యలపై పోరాడేందుకు చాలా గొంతులున్నాయి… వాయిస్‌లెస్ (జంతువులు) కు నా మద్దతు… నన్ను ట్యాగ్ చేస్తూ, దూషిస్తూ, పోస్టులు పెడుతూ ఎవరూ తమ శక్తిని వ‌ృథా చేసుకోవద్దు… ఆపేయండి, దాని బదులు ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను ప్రశ్నించండి… నేను పెట్టే పోస్టులతో తేడా ఉండదు, ఫాయిదా లేదు… పోస్టులకు నటీనటులను ట్యాగ్ చేయడం ఫ్యాషన్‌గా మారింది… దాని వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు…’’

రష్మి బీజేపీ సానుభూతిపరురాలు కదా, అందుకే భగీరథ్ పోస్టులకు ఆమెను ట్యాగ్ చేస్తున్నారు… ఆమే కాదు, బీజేపీ పట్ల పాజిటివ్‌గా ఉండే పలువురు యాక్టివిస్టులదీ ఇదే పరిస్థితి… ఇదోరకం సోషల్ దాడి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ట్యాగర్లకు రష్మి గౌతమ్ జవాబు… నన్ను కాదు, ప్రభుత్వాన్ని అడగండి…
  • అసలు చక్రం తిప్పిన స్టాలిన్ సర్… మీకు మెనీ మెనీ థాంక్స్…
  • అవునూ, ఇంతకీ ఈ కథలో అసలు వ్యభిచారి ఎవరు..?
  • మోడీ సూత్రాలు..! ఏదో ఆర్థిక తుఫాన్‌కు ముందు మోగే సైరన్లు..!!
  • రెండు కళ్ళ సిద్ధాంతానికి కాలం చెల్లింది… అటో ఇటో తేల్చుకోవల్సిందే…
  • తెలంగాణ బరిలోనూ ఎన్డీయే కూటమి..? రేవంత్‌రెడ్డి నెత్తిన పాలు..!!
  • ఏమో అనుకుంటాం గానీ… శోభన్‌బాబుకూ కులగజ్జి ఎక్కువే…
  • కర్కోటక అవినీతి జయలలిత… చివరకు ఏం సాధించినట్టు..?
  • అంతరిక్షంలో ఎఐ యుద్ధాలా..? ఇండియా కూడా రెడీ..!
  • ఆ చివరి ఓవర్…. ఐపీఎల్ థ్రిల్లెస్ట్… ముంబై ఇంటికి… బెంగుళూరు టాప్ వన్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions