Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పేరుకే హీరో కృష్ణ అఖండుడు… కానీ రియల్ హీరో మాత్రం ఓ పాము…

March 19, 2024 by M S R

Subramanyam Dogiparthi ….  1970 లోకి వచ్చేసాం . నేను ఫస్ట్ ఇయర్ బికాం నుంచి సెకండ్ ఇయర్లోకి వచ్చేసా . ఈ సినిమాకు చుట్టాలతో జాగ్రత్త లేదా చుట్టాలున్నారు జాగ్రత్త అనే టైటిల్ పెట్టి ఉండాల్సింది . హీరోని ఎలివేట్ చేసేందుకు అఖండుడు అనే టైటిల్ పెట్టి ఉంటారు . పేరులో ఏముంది ? సుడి ఉండాలి .


పహిల్వాన్లుగా సుపరిచితులు నెల్లూరి కాంతారావు , యస్. హెచ్. హుస్సేన్ నిర్మాతలు . కృష్ణ చాలా సినిమాలకు దర్శకత్వం వహించిన వి. రామచంద్రరావు ఈ సినిమాకు దర్శకుడు .
ఈ సినిమాలో హీరో కృష్ణ అయితే , సెకండ్ హీరో పాము . అనగనగా ఓ కోటీశ్వరురాలు . ఎవరూ ఉండరు . చుట్టాలంతా బంగళాలోకి చేరి , ఆమె ఎప్పుడు పోతుందా , ఆస్తి వాటాలేసుకొందామా అని ఎదురు చూస్తుంటారు . ఈలోపు ఎప్పుడో ప్రేమ కోసం ఇల్లు వదలి వెళ్ళిపోయిన కూతురి పోలికలతో ఓ నాటకాలమ్మాయి కనపడటం , మనుమరాలిగా గుర్తించి ఇంటికి తెచ్చుకుందామని అనుకోవటం , ఈలోపు చుట్టాలు ముసలమ్మని చంపేయటం , హీరోయిన్ని కూడా చంపాలని అనుకోవటం , ఆమెను పాము కాపాడుతూ ఉండటం , ఇంతలో ముసలమ్మ మరిది కొడుకు హీరో రంగప్రవేశం , చుట్టాలనందరినీ ఆ పామే చంపటం , హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవటం టూకీగా కధ .

 

Ads

సినిమా ఆరోజుల్లో బాగానే ఆడింది . కృష్ణకు అభిమానులను పెంచింది . కధను సి. యస్. రావు అందిస్తే మాటలను మహారధి అందించారు . టి. చలపతిరావు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ థియేటర్లో శ్రావ్యంగా ఉన్నా బయట పెద్దగా హిట్ కాలేదు .సినిమా ప్రారంభంలోనే హీరోయిన్ భారతి నాగకన్య నృత్య గీతం చంద్రశేఖరా రారా చాలా బాగుంటుంది . ఇతర పాటలు ఓ హంస నడకల దానా అందాల కనులదానా , ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవే ఇలా , నా పేరు మల్లెమొగ్గ నాకున్నది రోజా బుగ్గ , రారా రమ్మంటే రావేల శ్రావ్యంగా ఉంటాయి . కిటికీలో నిలబడి చూసేవు న్యాయమా అనే పాటను యక్షగానం స్టైల్లో రాజబాబు , రమాప్రభలపై నాటక కంపెనీ ట్రూపుతో వెరైటీగా బాగుంటుంది . ఈ ప్రయోగానికి సంగీత దర్శకుడిని అభినందించాల్సిందే .

మాలతి , ప్రభాకరరెడ్డి , గీతాంజలి , ముక్కామల , ఛాయాదేవి , నెల్లూరి కాంతారావు , అల్లు రామలింగయ్య , కాకరాల , విజయలలిత , ఆర్జా జనార్ధనరావు ప్రభృతులు నటించారు . అప్పటికి ఇంకా టేకాఫ్ కాని రావు గోపాలరావు ఓ చిన్న పాత్రలో కాసేపు కనిపిస్తారు .

మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . టివిలో కూడా వచ్చింది . యూట్యూబులో ఉంది . చూడబుల్ సినిమాయే . కృష్ణ రాత్రింబవళ్లు కష్టపడుతున్న రోజుల్లో వచ్చిన సినిమా … #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • తప్పు పైలట్లలో లేదు – బోయింగ్ విమానాల్లోనే లోపాలు- ప్రమాదాలు !!
  • ఆర్మీ జవాన్లు జెన్-జీ కాదా? ఈ పిల్లది మరీ ముదురు పైత్యం !!
  • అమిత్ షా కూర్చునే భంగిమ ! ఇలా చాలా ఈక్వేషన్లను పట్టిస్తుంది…!!
  • తెలంగాణ కాంగ్రెస్‌లో హరా‘కిరికిరి’ బ్యాచ్ ! సోయి లేని హైకమాండ్ !!
  • చిన్న అల్లుడు… ఇతరుల దర్శకత్వంలోనూ దాసరి నటించెను !
  • 4 వేల కోట్లు కాదు – 8 లక్షలు- 50 దేశాలు- మన తొలి పాన్ వరల్డ్ జెండా !!
  • భారం- ప్రేక్షకుడు ఇంకా దూరం- కూర్చున్న కొమ్మ నరుక్కునే టాలీవుడ్ !
  • జలధికన్నా లోతైన ప్రేమ ! ఓ పట్టాన నమ్మలేని వాస్తవ కథ !!
  • ‘నాన్నా… ఈసారి బామ్మ దగ్గరికి నేనొక్కడినే వెళ్తాను ప్లీజ్…’
  • చివరికి ఆ ఇంటిపేరుతోనూ తెగతెంపులే ! జాతకం అదే చెబుతోందట !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions