పార్ధసారధి పోట్లూరి ……….. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చాల కంట్రోల్డ్ గేమ్ ఆడుతున్నాడు! ఉక్రెయిన్ ని ఆక్రమించుకోవడం అనే ఆటని మొదట అమెరికా, నాటో దేశాలు మొదలుపెడితే తరువాత ఆ ఆటకి సంబంధించి అన్ని వ్యవస్థలని తన అదుపులోకి తీసుకొని అందరి ఆట తనే ఆడేస్తున్నాడు పుతిన్! పుతిన్ ఆట ఆడుతుంటే మిగతా ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూస్తున్నది!
ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న యూదులలో యూరోప్ యూదులు చాల ప్రత్యేకం! ఇక ఇజ్రాయెల్ యూదుల లాగా తమ మతం, తమ దేశం, తమ సంస్కృతీ సాంప్రదాయాలు అంటూ ఏమీ ఉండని యూదులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు యూరోపులో స్థిరపడ్డ యూదులు మాత్రమే! యూరోపుకి చెందిన యూదులకి మతం, ప్రాంతం, జాలి, దయ లాటివి ఏవీ ఉండవు. తమ వరకు తాము ఎంత డబ్బు సంపాదించాలో మాత్రమే ఆలోచిస్తారు… మిగతావి వాళ్లకి అనవసరం. భూమి మొత్తం నాశనం అయిపోయి నివాసయ్యోగ్యం కాకుండా పోతుందా ? పోనీ ! ఎలాన్ మస్క్ కి ఎంత డబ్బు కావాలంటే అంత ఇచ్చి వేరే గ్రహం మీదకి వెళ్లి అక్కడ బ్రతకడానికి సిద్ధంగా ఉంటారు ! మధ్యలో యూదుల ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా ?
ప్రస్తుత ఉక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ కి మూలం ఒక యూదు మతస్థుడే! వోలోదమిర్ జేలేనస్కి [Volodymyr Zelensky]… ఇతను రష్యన్ భాష మాట్లాడే యూదు మతస్తుడు! ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడు ! ఒకప్పటి సోవియట్ యూనియన్ లో భాగం అయిన ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ ఏర్పడకముందు రష్యాకి రాజధానిగా ఉండేది. సోవియట్ యూనియన్ ఏర్పడ్డాక ఒక అతి పెద్ద రాష్ట్రంగా ఉండేది. 90 వ దశకం మొదట్లో సోవియట్ విచ్చిన్నం తరువాత స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది.
Ads
అయితే సోవియట్ యూనియన్ కి సంబంధించిన అణ్వాయుధాలు దాదాపుగా 5,500 లకి పైగా ఉక్రెయిన్ లో ఉండేవి. కానీ 1994 లో మెమొరాండం ఆఫ్ బుడాపెస్ట్ [The Budapest Memorandum of 1994] ఒప్పందం ప్రకారం అణ్వాయుధాలు అన్నీ రష్యాకి ఇచ్చేసింది ఉక్రెయిన్! ఈ ఒప్పందానికి గ్యారంటీర్లుగా బ్రిటన్ మరియు అమెరికా దేశాలు ఉన్నాయి. మెమొరాండం ప్రకారం ఉక్రెయిన్ దేశ సమగ్రతకి భంగం వాటిల్లే ఎలాంటి చర్యలు రష్యా తీసుకోకూడదు. అంటే ఉక్రెయిన్ మీద దాడి చేయడం… దీనికి రష్యాతో పాటు అమెరికా, బ్రిటన్ దేశాలు హామీగా ఉన్నాయి. కానీ రష్యా బుడాపెస్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. కారణం..? అమెరికాతో పాటు నాటో దేశాలు ఉక్రెయిన్ లో పెట్టుబడులు పెట్టి, మెల్లిగా అక్కడి ప్రభుత్వాలని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూడడమే !
ఉక్రెయిన్ లో క్రూడ్ ఆయిల్ నిక్షేపాలతో పాటు సహజ వాయువు కూడా వివిరిగా లభ్యం అవుతున్నది. 1994 నుండి అమెరికాతోపాటు నాటో దేశాలు ఉక్రెయిన్ కి సంబంధించి మరే ఇతర ఇండస్ట్రీలు పెట్టకుండా కేవలం ఆయిల్, నాచురల్ గ్యాస్ ఇండస్ట్రీల మీద మాత్రమే పెట్టుబడులు పెడుతూ వచ్చాయి. అయినా సరే గత 30 ఏళ్ళలో ఉక్రెయిన్ ఆర్దికంగా బలంగా ఎదగలేకపోయింది. ఉక్రెయిన్ ని నాటో సభ్య దేశంగా చేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి. ఉక్రెయిన్ కనుక నాటోలో చేరితే నేరుగా రష్యా సరిహద్దుల్లో తమ మిసైల్ బాటరీలని పెట్టి కేవలం 3 సెకన్లలో రష్యాలోని కీలక మిలటరీ బేస్ ల మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. ఉక్రెయిన్ తో పాటు జార్జియా దేశాలు భద్రతా రీత్యా రష్యాకి చాలా కీలకమయిన దేశాలు…
ఇవి కనుక అమెరికా, నాటోలతో కలిస్తే… ఒకవేళ యుద్ధం అంటూ వస్తే అది రష్యాకి చాలా కష్టం అవుతుంది. రష్యన్ భాష మాట్లాడే యూదు అయిన వోలోదిమిర్ జేలేనస్కి [Volodymyr Zelensky] ప్రస్తుత ఉక్రెయిన్ అధ్యక్షుడికి అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మద్దతు ఎందుకు ఇస్తున్నాడు ? అసలు జోబిడెన్ పుత్ర రత్నం హంటర్ బిడెన్ కి ఉక్రెయిన్ కి ఉన్న సంబంధం ఏమిటి ?
Burisma Holdings [బురిస్మా హోల్డింగ్స్ ]. ఈ బురిస్మా హోల్డింగ్స్ అనే సంస్థని 2010 నుండి 2012 అప్పటి ఉక్రెయిన్ పర్యావరణ శాఖ మంత్రి అయిన మికోల జ్లోచేవ్ స్కి [Mykola Zlochevsky] స్థాపించాడు. అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు అయిన విక్టర్ యనుకో విచ్ [Viktor Yanukovych] రష్యాకి అనుకూలంగా పనిచేసాడు. నిజానికి బురిస్మా హోల్డింగ్స్ ని 2002 లోనే స్థాపించాడు మికోల జ్లోచేవ్ స్కి. 2010 నుండి 2012 వరకు పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసాడు. ఉక్రెయిన్ లో ప్రైవేట్ రంగంలో సహజ వాయువుని ఉత్పత్తి చేసే అతి పెద్ద సంస్థ ఈ బురిస్మా హోల్డింగ్స్.
2014 లో అధ్యక్షుడు విక్టర్ యనుకో విచ్ మీద అవినీతి ఆరోపణలు రావడంతో అధ్యక్షపదవి నుండి బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. దాంతో ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ జరిపితే శిక్ష ఖాయం అనుకోని రష్యా పారిపోయాడు. తరువాత మూడు నెలలకే ఈ బురిస్మా హోల్డింగ్స్ అనబడే సహజ వాయువుని ఉత్పత్తి చేసే సంస్థని నెలకొల్పిన మీకోల జ్లోచేవ్ స్కి కూడా ఉక్రెయిన్ ని వదిలి రష్యా పారిపోయాడు.
2014 లో విక్టర్ యనుకో విచ్ రష్యా వెళ్ళిపోయిన తరువాత ఉక్రెయిన్ అధ్యక్షుడుగా పెట్రో పోరోషేంకో [Petro Poroshenko] ప్రమాణ స్వీకారం చేశాడు. ఇతను అమెరికా నాటో దేశాలకి అనుకూలుడు. ఇక్కడి నుండి పావులు కదపడం ప్రారంభం అయ్యింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు మా దేశంలో అవినీతిని తొలగించడానికి మీ సహాయం కావాలని అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాని కోరాడు. దాంతో ఒబామా ఈ విషయాన్ని అప్పటి వైస్ ప్రెసిడెంట్ జో బిడెన్ కి అప్పచెప్పాడు. జో బిడెన్ తన పుత్రరత్నం బురిస్మా హోల్డింగ్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ గా బాధ్యత తీసుకున్నాడు. అఫ్ కోర్స్ రికార్డులని చూస్తే పెట్రో పోరోషేంకో ఉక్రెయిన్ అధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నెల ముందే హంటర్ బిడెన్ బురిస్మా హోలింగ్స్ లో డైరక్టర్ గా అపాయింట్ అయినట్లు ఉంది..
అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అన్నమాట. ఇక అక్కడి నుండి హంటర్ బిడెన్ హావా నడించింది ఉక్రెయిన్ లో. నిజానికి ఉక్రెయిన్ అధ్యక్షుడి కంటే ఆ దేశంలో హంటర్ బిడెన్ మాటే ఎక్కువగా చెల్లుబాటు అయ్యింది 2014 నుండి 2019 వరకు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ లోని బురిస్మా హోల్డింగ్స్ కి హంటర్ బిడెన్ కి ఉన్న అక్రమ సంబంధం మీద చర్చకి తెర తీయడంతో హంటర్ బిడెన్ బురిస్మా హోల్డింగ్స్ నుండి తప్పుకున్నాడు.
వందల కోట్ల డాలర్లు జోబిడెన్ కొడుకు హంటర్ బిడెన్ పేరు మీద అమెరికా, యూరోపు దేశాలలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి. వాటిలో బురిస్మా హోల్డింగ్స్ కూడా ఉంది. కానీ బయటి ప్రపంచానికి చెప్పింది ఏమిటంటే హంటర్ బిడెన్ బురిస్మా హోల్డింగ్స్ లో డైరెక్టర్ గా ఉన్న సమయంలో నెలకి $50,000 డాలర్లు జీతంగా తీసుకున్నాడు అని…
ఈ బలహీనతలని అడ్డుగా పెట్టుకొని ఇటు పుతిన్ అటు జిన్పింగ్ లు అమెరికా ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎందుకంటే హంటర్ బిడెన్ కి చైనాకి చెందిన పలు పెద్ద సంస్థలలో కూడా భారీగా పెట్టుబడులు ఉన్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా పట్టు బిగిస్తే హంటర్ బిడెన్ తో పాటు మిగతా అమెరికన్, యూరోపు పెట్టుబడిదారుల సొమ్ము మీద ఆశ వదులుకోవాల్సి వస్తుంది. జింగ్ పింగ్ మద్దతు రష్యాకే ఉంటుంది కాబట్టి ఏదన్నా దుస్సాహసం చేస్తే చైనా సంస్థలలో పెట్టిన పెట్టుబడులు కూడా వదులుకోవాల్సి వస్తుంది.
ఈ నాటకాన్ని రక్తి కట్టించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది మాత్రం ఇప్పటి ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యన్ భాష మాట్లాడే యూదు వోలోదిమిర్ జేలేనస్కి [నియో నాజీ అని కూడా అంటారు ]. ఈ వోలోదిమిర్ జేలేనస్కి అటు అమెరికాతో అంటకాగుతూ రహస్యంగా పుతిన్ కి సహకరిస్తున్నాడు.
అందుకే రష్యా ఉక్రెయిన్ ని ఆక్రమిస్తే మేము కలుగజేసుకోము అంటూ జో బిడెన్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఇక నాటో దేశాలు అయితే తమని తాము రక్షించుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాము తప్పితే మిగతా విషయాలలో కలుగచేసుకోము అంటున్నాయి. ఏం చేయాలో చేయకూడదో పుతిన్ మాత్రమే నిర్ణయం తీసుకోగల స్థితిలో ఉన్నాడు.
ఇప్పటికే రష్యా వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు పడిపోయి, ఆయిల్ షేర్లకి రెక్కలు వచ్చాయి. రష్యాని కనుక కట్టడి చేయడానికి ప్రయత్నిస్తే అది క్రూడ్ ఆయిల్ సరఫరా మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు కూడా లాభపడేది క్రూడ్ సరఫరా చేసే రష్యానే! ఇప్పటికే బారెల్ క్రూడ్ ధర100 డాలర్లకి చేరుకుంది, ఇన్నాళ్ళూ క్రూడ్ ధర పెరగకుండా చూసింది అమెరికా. ఎందుకంటే క్రూడ్ ధర పెరిగితే గల్ఫ్ దేశాలతోపాటు రష్యా కూడా లాభపడుతుంది కాబట్టి. ..నిన్న జో బిడెన్ రష్యా మీద మరిన్ని ఆంక్షలు విధించాడు కానీ అవేవీ పనిచేయవు. అది ఎలానో మరో పోస్టులో వివరిస్తాను. ఇంతకీ రష్యా ఉక్రెయిన్ సమస్య మనకేందుకూ అనే సందేహం మీకు రావొచ్చు కానీ ప్రపంచంలో ఎక్కడో ఉన్న దేశానికి జలుబు చేస్తే మిగతా దేశాలు తుమ్మే పరిస్థితి ఉంది కనుక ఈ సమస్య మీద మనకి అవగాహన ఉండాల్సిందే !
Share this Article