Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

50 ఏళ్ల క్రితం… బాలీవుడ్ రేఖ తొలి సినిమా… ఆమె ఈమేనా అన్నట్టుగా…

March 22, 2024 by M S R

Subramanyam Dogiparthi… ప్రముఖ బాలీవుడ్ నటి రేఖ హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం 1970 లో వచ్చిన ఈ అమ్మకోసం సినిమా . అప్పుడు ఆమెకు 15-16 సంవత్సరాల వయసు . కృష్ణంరాజు జోడీగా నటించింది . అప్పుడు గుండ్రటి మొహం ఆమె తల్లిలాగా . బొంబాయి వెళ్ళాక కోల మొహం అయింది . సినిమాలో చూసేటప్పుడు కూడా ఈమె రేఖనా అని అనుమానం వస్తుంది . బాలనటిగా రంగులరాట్నంలో కనిపించింది .

చిన్ని బ్రదర్స్ బేనర్ మీద అంజలీదేవి నిర్మించిన ఈ సినిమాకు బి వి ప్రసాద్ దర్శకులు . Above average mother-sentiment emotional feel good movie and good movie too . కృష్ణ , కృష్ణంరాజు , రేఖ , విజయనిర్మల , గుమ్మడి , అంజలీదేవి , నాగయ్య , ధూళిపాళ , రమణారెడ్డి , రాజబాబు , గీతాంజలి , నాగభూషణం , అల్లు రామలింగయ్య ప్రభృతులు నటించారు .

రేపు వత్తువు గానీ అనే పాటకు గీతాంజలి శాస్త్రీయ నృత్యం చాలా బాగుంటుంది . గీతాంజలి కూడా తెలుగు సినిమా రంగాన్ని బాగానే ఏలింది . శాస్త్రీయ నృత్యాలు , క్లబ్ డాన్సులు , వాంప్ పాత్రలు , చెల్లెలు పాత్రలు చాలానే నటించింది .

Ads

కృష్ణ , విజయనిర్మల మీద రెండు పాటలు , కృష్ణంరాజు , రేఖల మీద ఒక పాట కలర్లో తీసారు . పాపికొండల వద్ద షూటింగ్ సమయంలో తుఫాను వచ్చి , యూనిట్ అంతా చాలా ఇబ్బంది పడ్డారట . రాజమండ్రిలోనే సుమారు పదిహేను రోజులు ఉండాల్సి వచ్చిందట . కృష్ణ , విజయనిర్మల గోదావరిలో బోట్ హౌసులో బస చేసినప్పుడు తుఫానుకి బోటుకి రంధ్రం పడి నీళ్లు వచ్చాయట . స్టంట్ మాస్టర్ రాఘవులు బోటుకి తాళ్ళు కట్టి ఒడ్డుకు లాగారట . స్టంట్ మాస్టర్ కదా !

పాపి కొండల కాడ పాల మబ్బుల నీడ , అదే అదే పదే పదే ప్రియా , ఈ లోయలోనా ఈ పాయలోనా , అందాల వలపు జంట కలల పంట , గువ్వలా ఎగిరిపోవాలి పాటలు థియేటర్లో చాలా శ్రావ్యంగా ఉంటాయి . కొన్ని పాటలు బయట కూడా బాగానే వినిపిస్తుంటాయి . అంజలీదేవి భర్త ఆదినారాయణరావు సంగీత దర్శకులు .

మా నరసరావుపేటలో చూసా . ఈమధ్యనే టి విలో కూడా కాసేపు చూసా . యూట్యూబులో కూడా ఉంది . చూడబులే . చూడండి . 1970 లో బొంబాయికి షిఫ్ట్ కాక ముందు రేఖ ఎలా ఉండేదో చూడాలి కదా ! #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #telugureels #telugumovies #telugucinema

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చైనా జిన్‌పింగ్‌కు ఏమైంది..? ఏదో భారీగానే తేడా కొడుతోంది!!
  • ఎవరినీ కాదనలేం- ఎవరినీ హత్తుకోలేం! బ్రిక్స్‌తో భారత్‌కు లాభమేంటి?
  • జస్ట్, సెక్యూరిటీ కాదు- రాష్ట్రపతి పక్కన నడక అంత ఈజీ కాదు!
  • సంపన్నుల లగ్జరీ కొనుగోళ్లు – సిస్టమ్‌కు నష్టమా? లాభమా?
  • ఒకప్పటి తిరుగులేని సామ్రాజ్యం- ఇప్పుడు 4 ముక్కల విచ్ఛిన్నం అంచుల్లో!!
  • దేబ్‌జానీ! నాగార్జున వీకెండ్ ఫ్లాప్ షోలో ఈమె ఒక్కతే కాస్త మెరుపు!!
  • పోనీ, మీ కేసీయార్‌తో ఒక్క హామీ ఇప్పించు చాలు… నాట్లు వేసేద్దాం…
  • విజయవాడ నాయకులందరికీ నిజంగా ఒక అవమానం…
  • ఆ బిన్ లాడెన్ వారసుడు హమ్జా ఇంకా బతికే ఉన్నాడా ।?
  • మా ఓట్లు పోయినట్లేనా ‘సర్’?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions