Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…

November 8, 2026 by M S R

.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తున్న మరో ప్రతిపాదన అభినందనీయం… ఆధునిక సైలోల నిర్మాణం… అదీ ప్రభుత్వ వ్యయంతో…! చిన్న చిన్నవేమీ కాదు… ఏకంగా 10 లక్షల టన్నుల ఆహారధాన్యాల్ని నిల్వ చేయగల 10 భారీ సైలోలు… ఎందుకు ఈ ఆలోచన అభినందనీయమో, అవి తెలంగాణకు ఎందుకు అవసరమో ఓసారి చెప్పుకుందాం… చెప్పుకోవాలి…

1. తెలంగాణ ఇప్పుడు అన్నపూర్ణ… ధాన్యం ఉత్పత్తిలో కొత్త కొత్త రికార్డులు తిరగరాస్తున్నాడు తెలంగాణ రైతన్న… కానీ పండిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటోంది, కానీ ఆమేరకు కేంద్రం కొనడం లేదు… అదేమంటే గోదాముల నిండా పుష్కలంగా ఆహారధాన్యాలున్నాయి, బాయిల్డ్ రైస్‌కు గిరాకీ లేదు, ఎగుమతీ లేదు అని ఏవేవో సాకులు చెబుతోంది… గోదాముల్లోని పాత నిల్వల్ని ఆధునిక పద్దతుల్లో ఎలా డిస్పోజ్ చేయాలనే ప్రణాళిక లేదు, ఆచరణ లేదు…

Ads

2. మన రాష్ట్ర ప్రభుత్వ గోదాములు కూడా నిండిపోయి, కొత్తగా వచ్చే ధాన్యాన్ని ఏం చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది… అలాగని రైతుల్ని గాలికి వదిలేయలేదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నరకాలకు ఇస్తున్న బోనస్ పుణ్యమాని, రేషన్ కూడా సన్నబియ్యమే ఇస్తున్న పుణ్యమాని రాష్ట్రంలో సన్నరకాల సాగు బాగా పెరిగింది… ఐనా సరే, దొడ్డురకాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది…

3. సో, ఎగుమతులకు మార్గాలు వెతుకుతూనే… పాత నిల్వల్ని ఇతర అవసరాలకు ఏమైనా వాడగలమేమో ఆలోచిస్తూనే… నిల్వకు కొత్త గోదాములూ చూసుకోవాల్సిందే… కానీ కొత్త గోదాముల నిర్మాణం పాత పద్దతుల్లో అయితే వ్యయం, ప్రయాస, టైమ్ టేకింగ్…

4. పాత పద్దతుల్లో అయితే బార్దాన్ (గోనెసంచుల్లో) నింపి, వరుసలుగా చాలా ఎత్తుకు పేర్చాల్సి వస్తుంది… పాత పడేకొద్దీ అవి చిరిగిపోతూ, ఎలుకలు, పందికొక్కులే గాకుండా ముక్కిపోయే సమస్య పెరుగుతూ పోతుంది… నోటికి అందాల్సిన బువ్వ నేలపాలు… సో, అత్యాధునిక నిల్వ సామర్థ్యం తప్పనిసరి…

5. పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కేంద్రాన్ని నిందిస్తూ, చేతులు దులుపుకుంది తప్ప, సమస్య పరిష్కారం పట్టలేదు కేసీయార్‌కు… సో, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పలేదు… ఆధునిక సైలోల ప్రతిపాదన ముందుకొచ్చింది… (modern silo)…

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైలోల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నిపుణులు, పౌర సరఫరాల శాఖ అధికారులతో చర్చించాడు మొన్న… నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ పద్ధతులు, వ్యయంపై సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులతో కూడా చర్చ… ధాన్యం నాణ్యతను కాపాడేందుకు నిల్వకు ముందే శుభ్రపరిచే, ఆరబెట్టే సదుపాయాల ప్రతిపాదన…

silos

అసలు ఏమిటి ఈ మోడరన్ సైలోలు? ఆధునిక వ్యవసాయం ఆహార ధాన్యాలు (వరి, గోధుమ, జొన్నలు వంటివి) పాడవకుండా పెద్ద మొత్తంలో నిల్వ చేయడానికి మోడరన్ సైలోలు (Modern Silos) అత్యంత కీలకమైన సాధనాలు… సంప్రదాయ గోదాములు (Warehouses) లేదా గోనె సంచులలో నిల్వ చేయడంతో పోలిస్తే, సైలోలు ధాన్యాల రక్షణలో, నాణ్యతను కాపాడటంలో నూతన విప్లవం…

  • పోస్ట్-హార్వెస్ట్ నష్టాల నివారణ…: సంప్రదాయ నిల్వ పద్ధతుల్లో తేమ, చెదలు, పురుగులు, ఎలుకలు, వర్షాల కారణంగా 10% నుండి 15% వరకు ధాన్యం వృథా అవుతుంది… సైలోలు ఈ నష్టాన్ని దాదాపు సున్నాకి తగ్గిస్తాయి…

  • స్థల నిర్వహణ…: సైలోలు నిలువుగా (Vertical Structure) నిర్మించబడతాయి..అందువల్ల తక్కువ విస్తీర్ణంలో వేల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేయవచ్చు…

  • శ్రమ తగ్గించడం (Automation)..: సంచుల్లో ధాన్యం నింపడం, మోయడం, లారీల్లో ఎక్కించడం వంటి శ్రమతో కూడిన పనులు లేకుండా ఆటోమేటిక్ కన్వేయర్ బెల్ట్‌ల ద్వారా ధాన్యం లోడింగ్, అన్‌లోడింగ్ జరుగుతుంది…

మోడరన్ సైలోల ఉపయోగాలు (Uses & Benefits)

  • భారీ నిల్వ సామర్థ్యం…: ప్రభుత్వ కొనుగోలు సంస్థలు (FCI వంటివి), రైస్ మిల్లులు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వేల టన్నుల ధాన్యాన్ని ఒకే చోట సురక్షితంగా నిల్వ చేసుకోవచ్చు…

  • కీటకాలు, పురుగుల నుండి రక్షణ…: ఇవి గాలి చొరబడని సీల్డ్ ఉక్కు లేదా కాంక్రీట్ నిర్మాణాలు కావడం వల్ల ఎలుకలు, పక్షులు, కీటకాలు లోపలికి ప్రవేశించలేవు…

  • సరఫరా గొలుసు (Supply Chain) సులభతరం..: రైల్వే వ్యాగన్లు లేదా ట్రక్కుల ద్వారా ధాన్యాన్ని వేగంగా నింపడానికి, రవాణా చేయడానికి అనుకూలంగా ఉంటాయి…

నిల్వలో నాణ్యత నిర్వహణ (Quality Maintenance)

సైలోలు కేవలం ధాన్యం దాచే డబ్బాలు మాత్రమే కావు, ఇవి ఒక యాక్టివ్ కంట్రోల్ సిస్టమ్‌గా పనిచేస్తాయి… సైలో లోపల నిర్దిష్ట ఉష్ణోగ్రత సెన్సార్లు ఉంటాయి… వేడి లేదా తేమ పెరిగితే వెంటనే సమాచారం అందిస్తాయి… ఫ్యాన్ల ద్వారా చల్లని, పొడి గాలిని లోపలికి పంపి ధాన్యం హీట్ అవ్వకుండా కాపాడుతాయి…

ధాన్యం బూజు పటకుండా పొడి వాతావరణాన్ని నిర్వహిస్తాయి… రసాయనాలు లేదా గ్యాస్ ద్వారా సులభంగా క్రిమిసంహారక ప్రక్రియ పూర్తి చేయవచ్చు… ధాన్యం రంగు, వాసన, పోషకాలు మారకుండా 12 నుండి 24 నెలల వరకు నాణ్యత దెబ్బతినకుండా ఉంచవచ్చు… ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో కూడా నిర్మించే కార్యాచరణ ఆలోచిస్తే మరింత బెటర్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పది భారీ సైలోలు… ఆహారధాన్యాల నిల్వపై రేవంత్ ప్రభుత్వ కొత్త ఆలోచన భేష్…
  • కాలిపోయేది మా పర్సులు..! నీ గల్లాపెట్టె నిండకపోతే మాదా తప్పు..?!
  • సమాజం మారుతోంది- రియల్ హీరోలు ఎవరో గుర్తించి ప్రేమిస్తోంది !
  • రణ్‌బీర్‌ నోట తెలుగు పలికింది! బ్రహ్మ AI నేర్పిన ‘డబ్బింగ్ కళ !!
  • రాముడు తనే- సీత తనే..! మాటల్లేవ్… టాకీసులోనే లైవ్ బీజీఎం..!!
  • …. చివరకు మంత్రి ‘అక్షింతల’తో దత్తత వివాదానికి శుభం కార్డ్..!!
  • ఈ సీరియల్ కిల్లర్ ఓ క్రైమ్ రిపోర్టర్ – ఆ పత్రికకు ఎడిటర్- పబ్లిషర్…
  • ఈ ‘రామయణం’లో నాకు నచ్చిన నటుడు- వివేక్ విద్యుత్‌జిహ్వుడు!!
  • ఏం తక్కువైంది రెహమాన్ నీకు..? ఎందుకు ఈ సాకులు, ఈ శోకాలు..?
  • స్టార్ హీరోలకు దీటైన ‘మహాశక్తి’ … ఇలాంటి సినిమాలతోనే ‘కొడిగట్టేది’…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions