Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రక్తికడుతున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు – పాత సీన్ మారిపోయింది !!

September 27, 2026 by M S R

.

గుర్తుందా..? ఒక దశలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తుంటే… వేల మందిని డిస్మిస్ చేశాడు కేసీయార్… ఒక్కసారిగా ఆందోళనకు గురైన పలువురు ఉద్యోగులు కన్నుమూశారు… మొత్తం ఆర్టీసీని ప్రైవేటీకరిస్తాను, మీ దిక్కున్నచోట చెప్పుకొండి అని చీదరించుకున్నాడు కేసీయార్… రోజుల తరబడీ సమ్మె సాగింది… ఉద్రిక్తత… తెలంగాణ సాధించుకున్నది దీనికోసమేనా అని మొత్తం కార్మికలోకంలో కేసీయార్ ధోరణి పట్ల వ్యతిరేకత…

సీన్ కట్ చేస్తే… ఇప్పుడు కాంగ్రెస్ ఏం చెబుతోంది..? ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాం అంటోంది… ముందుగా గుర్తింపు ఎన్నికల నిర్వహణకూ రెడీ అయిపోయింది… అప్పట్లో ఆర్టీసీలో చక్రం తిప్పాలనుకున్న సంఘం ఇప్పుడు సోదిలోకి లేకుండా పోయింది… ఏ అశ్వత్థామ రెడ్డిని టార్గెట్ చేసి కేసీయార్ ఉక్కుపాదం మోపాడో… అదే అశ్వత్థామ రెడ్డి, బలంగా తెర మీదకు వచ్చిన ట్రేడ్ యూనియన్ లీడర్ మొగుళ్ల రాజిరెడ్డితో కలిసి టీడబ్ల్యూయూ పేరిట ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నారు… ఈ కూటమి బలంగా కనిపిస్తోంది…

Ads

ఎందుకంటే..? కాంగ్రెస్ పార్టీ ఈ సంఘానికే మ్యాండేట్ ఇచ్చింది, సపోర్ట్ చేస్తోంది… సీఐటీయూ మద్దతు ఇస్తోంది… బీజేపీ, బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘాలకు ఇప్పుడు పెద్ద సీన్ కనిపించడం లేదు… సరే, కాంగ్రెస్ మద్దతున్న సంఘాన్ని గెలిపిస్తేనే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరతాయి, మంచి జరుగుతుంది అనే ఆశ సగటు ఆర్టీసీ ఉద్యోగిలో కనిపిస్తోంది…

మొగుళ్ల

ఇక్కడ మరో పరిణామమూ చెప్పుకోవాలి… బీఆర్ఎస్ తన కార్మిక వ్యతిరేక ధోరణులతో అందరినీ దూరం చేసుకుంది… చాపకింద నీరులా మొగుళ్ల రాజిరెడ్డి చాలా కార్మిక సంఘాల్లో తన బలాన్ని పెంచుకుని, ఓ కీలక కార్మిక నాయకుడిలా మారిపోయాడు… పైన జాబితాలో ఇచ్చిన సంఘాలన్నీ ఇప్పుడు తనవే… ఈ వేల వోట్లు, ఈ వేల కార్మికుల మద్దతు ఇప్పుడు కాంగ్రెస్ వైపే…

నిజానికి చాలా సంస్థల ఉద్యోగ సంఘాలకన్నా ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు విశేషమైనవి… ఆర్టీసీలో పాగా వేస్తే కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుంది… ఆమధ్య ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగితే… పాత కేసీయార్‌లాగా డిస్మిస్ చేస్తా, తాటతీస్తా, మొత్తం ప్రైవేటీకరిస్తా, ఆర్టీసీని మూసేస్తా అనకుండా… మానవతాదృక్పథంతో రేవంత్ రెడ్డి కొద్ది గంటల్లోనే ఇష్యూ సెటిల్ చేసి, సమ్మెకు తెరవేశాడు… ఉద్యోగులు హేపీ…

ఇదే ఊపుతో విద్యుత్తు, హైదరాబాద్ కార్పొరేషన్లలోనూ కాస్త వర్క్ చేస్తే కాంగ్రెస్ ఇతర పార్టీలను మరింత బలహీనం చేయవచ్చు కూడా… కానీ బీఆర్ఎస్ బాకాలు ప్రచారం చేస్తున్నాయి… కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీకి గాకుండా వేరే కూటమికి కాంగ్రెస్ సపోర్ట్ చేయడం ఏమిటీ అని..!

అదొక ఎత్తుగడ… లోలోపల అంతర్గతంగా ఓ సర్దుబాటు… సో, ఈ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు ఇలా ఆసక్తికరంగా మారాయి… వీటికి రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది… ఇక చూడాలి…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!
  • వీథుల్లో అల్లర్లు – అలజడి … వీటితో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం !!
  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!
  • గడుసు వ్యాపారి మస్క్ – ‘రాకెట్ కారు’ లాంచింగ్ అదరగొట్టేశాడు !!
  • నీయక్క – రణబాలితోనూ నీ గ్రహచారం మారలేదోయ్ విజయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions