Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఒకటి పాయె – ఇంకొకటీ పాయె – సాయిపల్లవి చేజారిన పాత్రలు !!

September 27, 2026 by M S R

.

ఒక సినిమా పోయింది… మరో సినిమా కూడా పోయింది! సాయిపల్లవి చేతిలోంచి MS సుబ్బులక్ష్మి బయోపిక్ ఎగిరిపోయింది. ఇప్పుడు కల్కి 2 కూడా చేతిలోంచి జారిపోయినట్టే కనిపిస్తోంది. ఒకప్పుడు వరుసగా పెద్ద సినిమాలతో బిజీగా కనిపించిన ఈ నటి కెరీర్ గ్రాఫ్‌లో ఇది ఆసక్తికరమైన పరిణామమే.

సుబ్బులక్ష్మిగా సాయిపల్లవినే దాదాపు ఖరారు చేశారన్న వార్తలు చాలా వచ్చాయి. చివరకు రష్మిక మందన్నా ఆ పాత్రలోకి వెళ్లింది.

Ads

ఇక కల్కి 2లో దీపికా పదుకొణె స్థానంలో సాయిపల్లవి వస్తుందన్న ప్రచారం వచ్చింది. కానీ నాగ్ అశ్విన్ తాజా మాటలు ఆ ఊహాగానాలకు దాదాపు ఫుల్‌స్టాప్ పెట్టేశాయి. “కొత్త యాడిషన్స్ లేవు… ఇప్పటికే ఉన్న పాత్రలతోనే కథను కొనసాగిస్తాం” అన్న ఆయన వ్యాఖ్యతో సాయిపల్లవి ఎంట్రీకి తలుపు మూసుకున్నట్టే కనిపిస్తోంది.

అయితే సాయిపల్లవి ఖాళీగా ఉందని మాత్రం కాదు. మణిరత్నం– విజయ్ సేతుపతి సినిమా షూటింగ్ మొదలైంది. Ramayana రెండు భాగాల్లో సీతగా ఆమె ఉండనే ఉంది. ధనుష్ నటిస్తున్న D55 కూడా ఆమె లైనప్‌లో ఉంది. కానీ ఇక్కడ ఆసక్తికరమైన ప్రశ్న వేరే…

ఇంత పెద్ద సినిమాల్లో పేర్లు వినిపించడం ఒక ఎత్తు… ఆ సినిమాలు చివరకు మన చేతిలో ఉండటం మరో ఎత్తు! సాయిపల్లవి విషయంలో వరుసగా రెండు పెద్ద ప్రాజెక్టులు చివరి దశలో చేతులు మారాయి. ఒకటి రష్మిక చేతికి వెళ్లింది. మరొకటి అయితే అసలు రీప్లేస్‌మెంట్ అవసరమే లేదనే స్థితికి వెళ్లింది.

ఆ రెండూ ఆమె చేసి ఉంటే ఆమె రేంజ్ మరింత పెరిగేది… ఇక్కడ ఆమె కెరీర్‌కు సంబంధించి మరో చిన్న మైనస్ కూడా కనిపిస్తోంది. సాయిపల్లవి హిందీ డెబ్యూ అయిన Ek Din ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమా ఫలితం కంటే కూడా, ఆమె హిందీ డైలాగ్ డెలివరీపై సోషల్ మీడియాలో వచ్చిన చర్చ ఆమెకు కొత్త మార్కెట్‌లో అదనపు సవాలుగా మారింది.

నిజానికి దక్షిణాదిలో సాయిపల్లవికి ఉన్న క్రేజ్ వేరు. కానీ బాలీవుడ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత లెక్కలు మారతాయి. అక్కడ ఒక పెద్ద సినిమా ఫలితం, స్క్రీన్ ప్రెజెన్స్, హిందీ డైలాగ్ డెలివరీ… అన్నీ కలిపి చూస్తారు.

అందుకే సుబ్బులక్ష్మి బయోపిక్ చేతులు మారడం, కల్కి 2లో ఆమె పేరు వినిపించి చివరకు ఆ ఛాన్స్ కూడా లేకపోవడం — ఈ రెండింటినీ కలిపి చూస్తే “సాయిపల్లవికి టైమింగ్ కాస్త తేడా కొడుతోందా?” అనే చర్చకు అవకాశం ఉంది. అసలు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే…

సాయిపల్లవి కావాలనుకున్న పాత్రలు ఆమె దగ్గరకు రాకపోవడం కాదు… ఆమె పేరు వినిపించిన పెద్ద పాత్రలు చివరి మలుపులో వేరేవారి దగ్గరకు వెళ్లిపోవడం! 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమ్మ పేర్చిన బతుకమ్మ అమ్మంత అందంగా ఉండేది…!
  • యూపీలో యోగి *పవర్ తగ్గలేదు! *డీప్ స్టేట్ ఇంకా కష్టపడాలి !!
  • అనూహ్యం- 48 కోట్ల నుంచి 5,800 కోట్ల సంపద! ఎవరీ మహేంద్ర నహతా !!
  • ప్రధాని ఎవరైతేనేం..? టరమ్స్ శాసించేది అంబానీ..! ఇదీ జియో పుట్టుక !!
  • కవిత చెప్పింది ! సాయం చేసిన చేతులనే కాటేసే కేటీయార్ !!
  • వీథుల్లో అల్లర్లు – అలజడి … వీటితో ప్రభుత్వాన్ని మార్చడం అసాధ్యం !!
  • నోబెల్ విజేత – తండ్రి కోరిక కోసం, మూలాలు వెతుక్కుంటూ వచ్చింది !
  • అయ్యా నరేష్ గారూ… బాగా నటించగలరు, ఎటొచ్చీ యాసతోనే తిప్పలు !!
  • గడుసు వ్యాపారి మస్క్ – ‘రాకెట్ కారు’ లాంచింగ్ అదరగొట్టేశాడు !!
  • నీయక్క – రణబాలితోనూ నీ గ్రహచారం మారలేదోయ్ విజయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions