Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ అనంతకాల గమనంలో… ఈ రవ్వంత జీవన పయనంలో…

January 8, 2025 by M S R

.

.  (  దోగిపర్తి సుబ్రహ్మణ్యం  ) ..          …. ఓ అక్క కధ . బాలచందర్ అంతులేని కధలాగా సుఖాంతం కాని కధ కాదు . 1980 లో వచ్చిన ఈ సంధ్య సినిమా సుఖాంతమే . బాలచందర్ అయి ఉంటే సుఖాంతం చేసేవారు కాదేమో !

కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన మొదటి సినిమా . ఇది అక్షరాలా నటి సుజాత సినిమా . చాలా బాగా నటించింది . సంధ్య పాత్ర ఎంత గొప్పగా మలచబడిందంటే హృదయమున్న ప్రేక్షకుల కళ్ళు చెమ్మగిల్లుతాయి . ఆర్ద్రతతో నిండిపోతాయి .

Ads

ఓ పెద్దక్కకు ఇద్దరు చెల్లెళ్ళు , ఒక తమ్ముడు . వీళ్ళతో పాటు ఓ అనారోగ్య తండ్రి . అందరినీ తానే తల్లై సాకుతుంటుంది . చిన్ననాటి స్నేహితుడయిన ఇంటి డాక్టర్ని ప్రేమిస్తుంది . ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు .

డాక్టర్ గారి తల్లి పుట్టింటిని పూర్తిగా వదిలేసి రావాలని ఆంక్ష పెడుతుంది . పిల్లల్ని వదలి రాలేనని చెప్పి పెళ్లి మానేసి అందరినీ పెద్దవాళ్ళను చేస్తుంది .

పెద్దయ్యాక తమ్ముడు ఓ ధనవంతుడికి అల్లుడై అక్కను వదిలి వెళ్ళిపోతాడు . చెల్లెళ్ళకు ప్రేమ వివాహాలను జరిపిస్తుంది . తాకట్టు పెట్టిన ఇంటిని వదిలేసి వెళ్ళిపోయే సమయానికి ప్రేమించిన డాక్టర్ తానింకా వేచే ఉన్నాను , తనతో రమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు . అక్క కధ సుఖాంతం అవుతుంది .

డాక్టరుగా , సంధ్య స్వచ్ఛ ప్రేమికుడిగా శ్రీధర్ పాత్ర , అతని నటన బాగుంటుంది . ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది . సంధ్యగా సుజాత పాత్ర , ఆ పాత్రలో ఆమె నటన ఎంత బాగుంటుందంటే ప్రేక్షకుడు ఇలాంటి అక్క ఉంటే ఎంత బాగుండు అని అనుకునేలా .

ఇతర పాత్రల్లో చంద్రమోహన్ , అల్లు రామలింగయ్య , జయవిజయ , పండరీబాయి , గీత , కాంతారావు , గుమ్మడి , ప్రభాకరరెడ్డి , మిక్కిలినేని , ప్రభృతులు నటించారు .

(1976 లో హిందీలో వచ్చిన తపస్య సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . హిందీలో రాఖీ నటించింది . ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుని పొందింది .ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం వచ్చింది . ఈ హిందీ సినిమా కూడా 1968 లో వచ్చిన Baluchori అనే బెంగాలీ సినిమాకు రీమేకే . ఆషా పూర్ణా దేవి నవల ఆధారంగా ఈ బెంగాలీ సినిమా తీయబడింది )

చక్రవర్తి చాలా శ్రావ్యమైన సంగీతాన్ని అందించారు . ఈ అనంత కాల గమనంలో ఈ రవ్వంత జీవన పయనంలో పాట గుండెల్ని కదిలిస్తుంది . ఆత్రేయ వ్రాసిన ఈ పాటను బాలసుబ్రమణ్యం చాలా ఆర్ద్రంగా పాడారు .

వేటూరి వ్రాసిన ఈ ప్రణయ సంధ్యలో ఆ మౌనమెందుకో పాట హీరోహీరోయిన్ల మీద చక్కగా ఉంటుంది . మిగిలిన రెండు పాటల్ని సి నారాయణరెడ్డి వ్రాసారు . చిన్నారి వదిన అందాల భరిణి , చిలక పాప నెమలి బాబు పాటలు ఆ రెండు .

జంధ్యాల సంభాషణలు చాలా బాగుంటాయి . ముఖ్యంగా సుజాత- శ్రీధర్- గుమ్మడిల మధ్య నడిచే సంభాషణలను చాలా బాగా వ్రాసారు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . అప్పట్లో మహిళలు మెచ్చిన చక్కటి కుటుంబ కధా చిత్రం .

ఇప్పుడు కూడా అందరికీ నచ్చుతుంది . సినిమా స్లోగానే నడుస్తున్నా ఆ ఫీలింగ్ రాకుండా మనల్ని లాక్కుపోతుంది ముందుకు . A watchable , emotion & sentiment-filled , feel good movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…
  • ఆంధ్రాబాబు బుర్రలో బనకచర్ల పురుగు మెసులుతూనే ఉంది..!!
  • పొంగులేటి పొగ..! సిస్టం, పార్టీ, సర్కారు… అన్నింటికీ ఓ కొత్త థ్రెట్..!!
  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions