Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !

September 18, 2026 by M S R

.

Pardha Saradhi Potluri …. సౌదీ అరేబియాకి 8 బిలియన్ డాలర్ల అప్పు కావాలి!
అమెరికా కష్టాల్లో ఉంటే మిగతా దేశాలని కూడా తనతో పాటు కష్టాలలోకి నెడుతుంది! తాచెడ్డ కోతి అన్నట్టు…
ఈసారి మధ్యప్రాచ్యంని నాశనం చేయడం ద్వారా ఆ ప్రభావం ప్రపంచం మొత్తం అనుభవించేలా చేయడంలో సఫలీకృతం అయ్యింది అమెరికా!

అసలు ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం వ్యూహత్మకంగా గ్రేటర్ ఇజ్రాయల్ కోసమే అని అనిపించడం అసహజమేమి కాదు!
అమెరికా, ఇజ్రాయేల్ కలిసి ప్లాన్ చేశాయి. ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేస్తుందని తెలుసు! హార్ముజ్ మీద ఇరాన్‌కి అనుకూలమైన భౌగోళిక అడ్వాంటేజ్ ఉందని తెలిసీ పైపైన దాడి చేసి చేతులు దులుపుకుంది అమెరికా!

Ads

సున్నీ Vs షియా? 
చూస్తుంటే సున్నీ vs షియాగా మలుపు తిరిగేట్లుగా ఉంది!
హుతీలు సౌదీకి చెందిన 3 బ్రిగేడ్ల సైన్యాన్ని దిగ్బంధించారు!
ఒక బ్రిగెడ్ సైన్యం అంటే?
ఒక బ్రిగెడ్ సైన్యం అంటే 4,000 నుండి 5,000 మంది సైనికులు ఉంటారు! ఈ సంఖ్య ఒక్కో దేశానికి ఒక్కో రకంగా ఉంటుంది. అమెరికాలో బ్రిగెడ్ కంబాట్ టీమ్ ( BCT ) లో 4,000 నుండి 4,500 మంది సైనికులు ఉంటారు!

భారత్ లో బ్రిగెడ్ అంటే 3,000 మంది సైనికులు ఉంటారు. బ్రిటన్ లో కూడా 3,000 మంది ఉంటారు.
జపాన్ లో సెల్ఫ్ -డిఫెన్స్ ఫోర్స్ బ్రిగెడ్ లో 3,000 నుండి 4,000 వరకూ ఉంటారు.
ప్రస్తుతం హుతీలు దిగ్బంధించిన సౌదీ సైనికుల సంఖ్య 12,000 వరకూ ఉండొచ్చని అంచనా!

బాబ్ అల్ మందెబ్ స్ట్రెయిట్ పట్టణం అయిన మొఖాని హుతీల నుండి విడిపించడానికి సౌదీ మూడు బ్రిగెడ్ల సైన్యం.., అందులోనూ అవి ఆర్మర్డ్ మెకనైజ్డ్ బ్రిగెడ్స్ ( Armored & Mechanized brigade )! వీటిలో M2 Bradley light Tanks మరియు Amx – 10P Armored Vehicles ఉన్నాయి. వైరల్ అవుతున్న వీడియోలలో హుతీల దాడుల నుండి తమను తాము రక్షించుకోవడానికి సౌదీ సైనికులు వాహనాలని వదిలేసి మైదాన ప్రాంతంలోకి పారిపోగా, హుతీలు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.

కాబూల్ లో నాటో వదిలేసిన ఆయుధాలని ఎలా అయితే తాలిబాన్లు చేజిక్కించుకున్నారో అదే రీతిలో హుతీలు అమెరికన్ లైట్ ఇన్ఫంట్రీ అర్మ్డ్ వెహికల్స్, లైట్ టాంక్స్ ని చేజిక్కించుకున్నారు.

విచిత్రం!
హుతీలకి ఆర్మీ డ్రెస్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, హెల్మెట్స్ కాదు కదా కనీసం మిలిటరీ షూస్ కూడా లేవు! సాధారణ సింథటిక్ చెప్పులు కొందరికి ఉంటే, చాలా మందికి కాళ్ళకి చెప్పులు కూడా లేవు. కానీ భుజాన AK -47, లేదా రాకెట్ లాంచర్ ఉంటాయి!

Numbers matter!
హుతీలకి 10 లక్షల సైన్యం ఉంది!
AI ని చాలా బాగా వాడుతున్నారు హుతీలు. హుతీలకి విదేశాల నుండి వచ్చిన నిపుణులు ఒమన్ లో శిక్షణ ఇస్తున్నారు. అందుకే ఇరాన్ ఒమన్ ని దాడుల నుండి మినహాయిస్తూ వస్తున్నది. హార్ముజ్ నుండి టోల్ వసూలు చేస్తే అందులో సగం ఒమన్ కి ఇస్తున్నది ఇరాన్!

ఎమెన్ పాస్పోర్ట్ మీద విదేశాలకి వెళితే ఇబ్బందులు ఉంటాయని హుతీలు ఒమన్ పాస్పోర్ట్స్ మీద ప్రయాణిస్తుంటారు!
So! ఒకవేళ సౌదీ సైన్యం కనుక మొఖా పట్టణం దగ్గరికి రావాలి అంటే ఎన్ని దారులు ఉంటాయో, అలాగే మెకనైజ్డ్ ఇన్ఫంట్రీ రావాలంటే ఏ దారిలో వస్తాయో AI ద్వారా అంచనా వేసి, దారి మధ్యలో కాపు కాసి దాడిచేయడానికి వీలున్న ప్రాంతాలని ముందే AI ద్వారా గుర్తించి, అక్కడ వేల సంఖ్యలో మొహరించారు!

సౌదీ సైన్యం దొరికిపోయింది! కాబూల్ లో జరిగినట్లే ఎమెన్ లో కూడా అమెరికన్ వెపన్స్, వెహికల్స్ హుతీలకి చిక్కాయి!

లక్జరీ సైన్యం Vs దుర్భరమైన స్థితిలో ఉండే సైన్యం!
సౌదీ ప్రభుత్వం ది బెస్ట్ వెపన్స్ ని తమ సైన్యం కోసం సమాకూర్చింది! అమెరికన్, యూరోపియన్, చైనీస్ వెపన్స్ ని తమ సైన్యం కోసం కొన్నది సౌదీ ప్రభుత్వం! రియాద్ లో 300 మంది అమెరికన్ యుద్ధ వ్యూహకర్తలతో పాటు మరో 300 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు సౌదీ సైన్యం కోసం!

కానీ సౌదీ ఆర్మీ లో పనిచేసే వాళ్ళు విలాసవంతమైన జీవన శైలికి అలవాటుపడ్డారు, వాళ్ళది ధనిక దేశం కాబట్టి!
హుతీలు చాలా కఠినమైన వాతావరణంలో నివసిస్తారు! హుతీ అనేది ఎమెన్ లోని ఒక తెగ, షియా ఇస్లాంని అనుసరిస్తారు! హుతీ గ్రూపు అనేది మిలిటరీ ట్రైన్డ్ కాదు. కానీ చాలా కఠినమైన భౌగోళిక పరిస్థితులకి అలవాటు పడ్డారు. పగలు ఎడారి ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా నడవగలరు. అదే రాత్రి సమయంలో ఎడారిలో ఉండే మంచులో పడుకోగలరు.

నేపధ్యం ఉంది!
1990 లో సౌదీ అరేబియాలో 10 లక్షల మంది ఎమెన్ కి చెందిన వలస కార్మికులు ఉండేవారు. ఎమెన్, సౌదీ  పక్క దేశాలు కాబట్టి సహజంగానే ఎమెన్ కార్మికులకి పని ఇచ్చింది సౌదీ!

ఆగస్టు 2, 1990లో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ కువైట్ మీద దాడి చేసి కువైట్ సిటీ ఆక్రమించాడు! దాన్ని ఇరాక్ లోని 19 వ ప్రావిన్స్ గా ప్రకటించాడు.
ఇరాక్ మీద సైనిక చర్య తీసుకోవడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అమెరికా దాని మిత్రదేశాలకి అనుమతి ఇచ్చింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిర్ణయాన్ని అప్పటి ఎమెన్ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలెహ్ తప్పుపట్టాడు! దాంతో సౌదీ రాజుకి కోపం వచ్చింది. ఇరాక్ కువైట్ ని ఆక్రమించడం ఎమెన్ ప్రజలకి తప్పుగా అనిపించడం లేదు కాబట్టి, నా దేశంలో 10 లక్షల మంది ఎమెన్ కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఏదో ఒక రోజున తన మీద తిరగబడి సౌదీని స్వాధీనం చేసుకోవచ్చని భావించి, 10 లక్షల మంది ఎమెన్ కార్మికులని పనిలో నుండి తీసేసి ఎమెన్ కి పంపించేసాడు!

అప్పటికే దశబ్దాలపాటు సౌదీలో పనిచేస్తూ ఆ డబ్బుని ఎమెన్ లోని తమ కుటుంబాలకి పంపిస్తూ వచ్చిన ఎమెన్ కార్మికులు ఒక్కసారిగా పనిలేని వారయ్యారు!
1991 నుండి భారత్ నుండి ఎక్కువగా సౌదీకి కార్మికుల వలసలు జరగడం మొదలవడానికి అక్కడి ఎమెన్ కార్మికులని వెళ్ళగొట్టడమే కారణం!

1990ల నాటికి హుతీ మూవ్మెంట్ లేదు. ఎప్పుడైతే సౌదీ రాజు ఒక్కసారిగా 10 లక్షల మంది ఎమెన్ ప్రజలని వెళ్లగొట్టాడో అది హుతీ మూవ్మెంట్ కి దారి తీసింది!
1990ల నాటికి ఉత్తర ఎమెన్ లో ‘Believing Youth’( Shabab al-Mu’min) పేరుతో ఒక సంస్థ ఉండేది! విద్యా,  మత సంబంధమైన కార్యకలాపాలకి పరిమితం అయి ఉండేది!

ఈ షబాద్ అల్ ముమిన్ సంస్థ 2000 నాటికీ హుతీ మూవ్మెంట్ గా రూపుదిద్దుకుంది. నిజానికి సున్నీ vs షియా అనేది మొదట్లో లేదు.
ఎమెన్ లోని షియాలని జాయదీ షియాలని పిలుస్తారు! హుతీ మూవ్మెంట్ గా మారడానికి తమని (Zaydi Shia ) అరబ్ సున్నీలు చులకనగా చూస్తున్నారు అనే భావన ఏర్పడడమే!

2014 లో ఎమెన్ రాజధాని ‘సనా’ మీద దాడి చేసి సున్నీ ప్రభుత్వాన్ని పడగొట్టి సనాని స్వాధీనం చేసుకున్నారు హుతీలు. అయితే హుతీ ప్రభుత్వాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించలేదు!
పడిపోయిన సున్నీ ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టడానికి సౌదీ ప్రభుత్వం అమెరికా సహాయంతో హుతీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల మీద వైమానిక దాడులు చేసింది! వైమనిక దాడుల వల్ల ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఆర్మీని పంపించింది సౌదీ ప్రభుత్వం!

ఆరు నెలలపాటు సౌదీ ఆర్మీ ఎమెన్ లో పోరాడినా ఫలితం లేకపోగా, చనిపోయిన సైనికులకి లెక్కలేదు! చివరికి 400 మంది సౌదీ సైనికులని హుతీల నుండి విడిపించుకోవడానికి వాళ్ళు అడిగినంత డబ్బు ( డాలర్లు ) ఇచ్చి సంధి చేసుకోవాల్సి వచ్చింది!

అదనంగా అమెరికా సౌదీకి అమ్మిన హమ్వీ ( High Mobility Multipurpose Wheeled Vehicle – HMMWV ) మిలిటరీ వాహనాలని వందల్లో, M4 అస్సల్ట్ రిఫైల్స్ వేలల్లో ఎమెన్ లో వదిలివేసింది. రహస్యంగా హుతీలకి సౌదీ రాజుకి మధ్య జరిగిన ఒప్పందం బయటికి రాలేదు కానీ రహస్య ఒప్పందానికి మధ్యవర్తిగా ఒమన్ వ్యవహరించింది!

2014 లో సౌదీలో ఉన్న అమెరికన్ వార్ స్ట్రెటజిస్ట్స్ నాటోతో కలిసి ఎమెన్ లో ఆర్మీని దించి, హుతీలని చంపి సున్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సౌదీకి సహకరించాలని చూసారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు ఎలా అయితే నాటో సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతున్నారో, స్వయంగా అనుభవంలోకి వచ్చింది, అదే రీతిలో హుతీలు కూడా పోరాడడం చూసి వెనక్కి తగ్గారు. నాటో ఆర్మీని ఎమెన్ లో దించి పోరాడితే ప్రాణ నష్టం తప్పితే, పూర్తిగా హుతీలని తుడిచిపెట్టలేమని భావించారు! (తరువాయి రెండో భాగంలో…)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇరాన్ వార్ సైడ్ ఎఫెక్ట్స్ – సౌదీకి చుక్కలు చూపిస్తున్న హుతీలు !
  • తెలంగాణ విముక్తిలో జోధ్‌పూర్? ‘షెకావత్’ మాటలకు అర్థమేంటంటే..!
  • రక్తికట్టని చరణ్ రీఎంట్రీ సీన్! బిగ్‌బాస్ టీమ్ పూర్ స్క్రిప్ట్ రైటింగ్!!
  • సొంతిల్లు లేని కేటీయార్ అవస్థ ఈ తెలంగాణ సమాజానికి పట్టదా!?
  • రేవంత్ బుల్‌డోజర్ దాడి! పెద్ద దొర గడీ ప్రహారీ గోడలకు బీటలు!!
  • ఇదెక్కడి చోద్యం రాజమౌళీ? డబ్బు కావాలి గానీ థాంక్స్ చెప్పవా..?!
  • 100 శాతం టారిఫ్ పిడుగు! ఇండియా- అమెరికా బంధాలకు విషమ పరీక్ష !!
  • సుబ్బులక్ష్మిగా విద్యాబాలన్..! ఆశ తీరలేదు – కల నిజం కాలేదు !!
  • ‘చీట్ స్మాల్… చీట్ మెనీ…’ ఓ ఫేక్ మేట్రిమోనీ..! ఇదోరకం ఫ్రాడ్ మనీ !!
  • మళ్లీ ప్రభాస్ ఆదిపురుష్‌పై ట్రోలింగ్ ! గోకి తిట్లు తినడమంటే ఇదే !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions