Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సౌదీ మరింత చిక్కుల్లోకి! రెండు జెట్ ఫైటర్లను కూల్చిన హుతీలు!!

September 19, 2026 by M S R

.

Pardha Saradhi Potluri … రెండు F-15 ఫైటర్ జెట్స్ కూల్చివేసిన హుతీలు!
సౌదీ అరేబియాకి చెందిన రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కి చెందిన రెండు F-15 ఫైటర్ జెట్స్ హుతీలు కూల్చివేశారు!
రెండు రోజుల వ్యవధిలో రెండు F-15 లని కూల్చారు!

1.మొదటి F-15 కి, రెండవ F-15 కి విజువల్స్ ని ఆధారంగా చూపించారు హుతీలు.
2.హుతీ మిలిటరీ ప్రతినిధి ‘ యాహ్య సరీ ’ ( Yahya Saree ) మాట్లాడుతూ ఎమెన్ లోని ‘మరిబ్ ప్రావిన్స్’ మీద సెర్చ్ ఆపరేషన్ కోసం వచ్చిన సౌదీ రాయల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన F-15 ని కూల్చివేసినట్లు దాని తాలుకు వీడియో విజువల్స్ ని మీడియకి రిలీజ్ చేసామని తెలిపాడు.

Ads

3.Fact check : ఓపెన్ సోర్స్ అనలిస్టులతో పాటు bbc కూడా వీడియోని పరిశీలించి అది AI ద్వారా సృష్టించబడలేదని నిజమైన వీడియో అని పేర్కొంటూ, మిసైల్ లాంచ్ చేయడం, అది F-15 కి తగలడం, ఫైటర్ జెట్ నేల కూలడం వీడియోలో ఉందని నిర్ధారించాయి. రాత్రి చీకట్లో జరిగిన ఈ సంఘటన తరువాత ఉదయం వెలుతురులో ఫైటర్ జెట్ డెబ్రిస్ ని పరిశీలించగా tail నెంబర్ రాయల్ సౌదీ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 15th స్క్వాడ్రన్స్ లో ఉన్న F-15 తో సరిపోలి ఉంది!

saudi
4.MpAds ( Man – Portable Air Defense System ) ని హుతీలు స్వంతంగా తయారుచేసి ప్రయోగించారు.
5.అమెరికన్ F-15 ఫైటర్ జెట్స్ ని శత్రువు ఎయిర్ డిఫెన్స్ తో కానీ శత్రు విమానం Air to Air మిసైల్స్ కూల్చిన చరిత్ర లేదు, అలాంటిది రెండు F-15 లు MpAds వల్ల కూల్చబడ్డాయి! ఇదొక అరుదైన రికార్డ్ అవుతుంది ఎందుకంటే హుతీలని మిలిటరీ ఫోర్స్ అనలేరు, ఒక మిలిటంట్ గ్రూప్ అని మాత్రమే గుర్తిస్తున్నారు!

6.రష్యా ప్రతీకార చర్య అనుకోవచ్చు : 1980 వ దశకంలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నప్పుడు సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడడానికి ఆఫ్ఘనిస్తాన్ లోని యువకులని చేరదీసి ‘ముజాహిదిన్’ లు అని పేరుపెట్టి ( ఇప్పుడు తాలిబాన్ ) సైనిక శిక్షణతో పాటు ఆయుధాలు, డాలర్లు ఇచ్చి సోవియట్ సైన్యం మీదకి ఉసిగొల్పయి అమెరికన్ CIA, పాకిస్తాన్ ISI లు.

అప్పట్లో అమెరికా తన MpAds అయిన FIM-92 స్టింగర్ మిసైల్స్ సిస్టమ్స్ ని దాదాపుగా 800 వరకూ ఇచ్చాయి. ముజాహిదిన్ లు స్టింగర్ మిసైల్ లాంచర్స్ ని మోసుకుంటూ, ఎత్తయిన కొండల మీదకి ఎక్కి సోవియట్ హెలికాప్టర్ గన్ షిప్స్ రాగానే పేల్చేసే వాళ్ళు. ఇప్పుడు అదే పనిని హుతీల చేత చేయిస్తున్నాయి రష్యా, చైనా  కలిసి.

7.ఈ సంఘటనతో మధ్య ప్రాచ్యంలోని యుద్ధం కొత్త దశకి చేరుకుందని చెప్పవచ్చు.
8.ఎయిర్ రైడ్స్ చేయడం సురక్షితం కానప్పుడు ఆర్మీతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది అక్కడ. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలాగానే సౌదీ, హుతీ పోరు ఇప్పట్లో ముగిసేలా లేదు.

9.హుతీ పరోక్షంగా ఇరాన్ కలిసి సౌదీని లక్ష్యంగా చేసుకోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ధరలని పెంచడానికి అని అనుకోవాలి!
హుతీలతో తలపడే బదులు 1990 నాటి ఎమెన్ పౌరుల బహిష్కరణకి క్షమాపణ చెపితే అంతా సద్దుమణుగుతుంది కానీ Royal అనే పదం ఆ పని చేయనివ్వదు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అగడు పడ్డట్టు తెగ మింగారు! ఎవడి పాలైందిరో నా తెలంగాణ !!
  • సౌదీ మరింత చిక్కుల్లోకి! రెండు జెట్ ఫైటర్లను కూల్చిన హుతీలు!!
  • 20 వేల ఎకరాలు ఏం సరిపోతాయి ? ఇంకా ఇంకా కావాలి !!
  • పెళ్లానికి తెలీకుండా లవర్‌తో జాలీ విదేశీ ట్రిప్‌ ప్లాన్… కానీ..?
  • ‘పంచనామా’ కాదు… పాత యాంకర్ ఉదయభాను ఇజ్జత్ పంచనామా!
  • రాముడికన్నా లక్ష్మణుడు కాస్త పొడుగు ఉండకూడదా ఏం?!
  • దానం అనర్హత కేసులో సుప్రీంకోర్టుకు టీబీజేపీ!
  • హార్వర్డ్ హైదరాబాద్‌కు..! ఇక విదేశీ విద్యకూ భాగ్యనగరం!!
  • ఫస్ట్ నుంచీ దానం జర్నీ అంతే … అదృష్టం- దురదృష్టం సమాంతరంగా!
  • ఆస్కార్‌కు గొందల్ ! భారీ పోటీ నడుమ ఈ మూవీయే ఎందుకు ఎంపిక?!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions