Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సాక్షాత్తూ ప్రభుత్వం పేరుతోనే — బరితెగించిన స్కామ్ యాడ్స్

June 19, 2026 by M S R

.

జస్ట్, 22 వేలు కట్టి రిజిష్టర్ చేసుకొండి, ఇంకేం? రోజుకు 85 వేల సంపాదన, నెలకు 2.18 లక్షలు… ఇలా ఎవడైనా ప్రచారం చేస్తే..? పక్కా ఫేక్, ఫ్రాడ్ అని ఓ అంచనాకు వస్తారు కదా… కానీ సోషల్ మీడియాలో ఈ ప్రచారం జోరుగా సాగుతోంది… నమ్మేవాళ్లు, మోసపోయేవాళ్లు సమాజంలో ఎప్పుడూ ఉంటారు కదా… మరీ ఈ సైబర్ క్రైమ్ కాలంలో..!

సైబర్ క్రైమ్ జాగ్రత్తల మీద ఫోన్ కాలర్ టోన్ల నుంచి పెద్ద ఎత్తున వ్యాసాలు, ఇంటర్వ్యూల దాకా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది… గుడ్, మంచిదే… కానీ మరి పైన చెప్పిన సోషల్ మీడియా ప్రచారాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? ఎందుకు చేతకావడం లేదు..?

Ads

ఎంత ఘోరం అంటే… ఈ పోస్టుల్లో ఎక్కువగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎఐ వీడియోలను వాడుతున్నారు… ఆమె కేంద్ర ప్రభుత్వం తరఫున ఎండార్స్ చేస్తున్నట్టుగా వీడియోలు… అచ్చం ఆమె గొంతుతోనే…! దాదాపు సంవత్సరకాలంగా నేను గమనిస్తున్నాను ఈ పోస్టులను…

cyber

నిర్మలమ్మే కాదు… ఇక ఎంతకు తెగించారంటే వీళ్లు… మోదీ, రాజనాథ్‌సింగ్, అంబానీ, సుధామూర్తి తదితరుల ఫోటోలను, ఎఐ వీడియోలను కూడా వాడేస్తున్నారు… ఇండియన్ గవర్నమెంట్ అని లోగోలు కూడా..! అంటే బలంగా నమ్మేందుకు ప్లాన్…

నీట్ పరీక్ష సజావుగా సాగడం కోసం ఏకంగా టెలిగ్రామ్ యాప్ ఆపేస్తున్నారు కదా… మరి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ మీద నిరాటంకంగా, నిర్భయంగా సాగుతున్న ఈ ‘22 వేల స్కీమ్ కమ్ స్కామ్’ మీద చర్యలు లేవేమిటి..? ప్రతి రాష్ట్రానికీ సొంతంగా సైబర్ సెల్స్ ఉన్నాయి, కేంద్రానికీ పకడ్బందీ విభాగం ఉంది…

వాళ్లెవరికీ ఈ పోస్టులు కనిపించడం లేదా..? సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల మీద చర్యలకు భయపడుతోందా..? టెలిగ్రామ్ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు, కొన్ని కేసుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు నోటీసులు జారీ చేయబడుతున్నప్పుడు, అల్లర్లు జరిగే సందర్భాల్లో మొత్తం సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్ని ఆపేస్తున్నప్పుడు, చైనా బాపతు యాప్స్‌ను నిషేధిస్తున్నప్పుడు… మరి ఈ స్కామ్ ప్రచారాలను ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు..?

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • భారీ ఆర్థిక మోసం ‘షేర్ బజార్’ – ‘కిసాన్ పరివార్’ స్కామ్ వెనుక అసలు కథ!
  • విజయ్ అపరిణతి! స్టేట్ అంటే నీ ఎస్టేట్ కాదు ముఖ్యమంత్రి గారూ!!
  • యూ టూ ఈటల!! అచ్చం హరీష్ భాషే!! ఎవరిని ఆక్షేపిస్తున్నట్టు!?
  • నిదా ఖాన్ బెయిల్ ఇష్యూ! మరి కృష్ణుడి పుట్టుక మీద వ్యాఖ్యలు దేనికి..?!
  • అఖిల్ నటనలో కాస్త మెరుగుదల- ఓ సాదాసీదా తెలుగు సినిమా లెనిన్!!
  • కంగనా రనౌత్… ‘క్వీన్’ కమ్-బ్యాక్ ఆశలపై ‘లీగల్’ మేఘాలు!
  • ఒకసారి పేకముక్కల్లో ఇరుక్కుంటే… జీవితం ఎప్పుడూ ఫుల్ కౌంటే..!!
  • దీపిక పడుకోన్ సరే- హీరోల ‘చిల్లర ఖర్చుల’పై ఎవరైనా నోరెత్తగలరా..?!
  • విజయ్ బాటలో జూనియర్! జూలై 18న ఏం చెప్పబోతున్నాడు?!
  • నిఖార్సుగా, నిజాయితీగా, బేషరతుగా ప్రేమించేవారు ఎవరైనా ఉంటారా?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions