Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గుండు గీకే ప్రోగ్రామ్ వద్దులే అమ్మాయ్… సినిమా సోసో, నువ్వు పాస్…

September 5, 2026 by M S R

.

గుండు… శిరోముండనం… గుండు చేయడం, గుండు కొట్టడం, గుండు గీకడం, గుండు గొరగడం… ఎలా చెప్పినా బొచ్చు మొత్తం గీకేసి నున్నగా చేసేయడం… ఎందుకు..? దేవుడి దగ్గర వెంట్రుకలు తీసేస్తే అది అర్పణం, మానవ సహజ ఆకర్షణలన్ని దేవుడి దగ్గర త్యజించడం, దేవుడికి సరెండర్ అయ్యే ప్రక్రియల్లో అదొకటి…

ఇది గాకుండా పుట్టు వెంట్రుకలు… చావు కర్మ దగ్గర గుండు… పాత ఛాందసంలో మొగుడు చనిపోతే వెంట్రుకల్ని తీసేయించడం… ఇప్పుడు పదే పదే హెయిర్ డై వేయలేక, అది నిలవక నున్నగా గొరిగించి, దాన్నే మోడరన్ లుక్‌గా ప్రదర్శించేవాళ్లూ ఉన్నారు… ఇవే కాదు, మరొకటి ఉంది…

Ads

అందరి ముందు నడి బజారులో, చౌరస్తాలో గుండు గీకించుకుంటాను అని సవాల్ విసరడం… అది స్వీయ భరోసాయే కాదు, ఎదుటి వాడిని కిర్రెక్కించడం… లేదా తనది తప్పు అని తేలితే ఈ చర్య ద్వారా సమాజానికి తలవంచి క్షమాపణ అడగడం…

సో, గుండ్లు /గుళ్లు రకరకాలు… ఇదంతా ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… సహ (Life of Sanju) అనే సినిమా చూశాక… అందులో హీరోయిన్ శ్వేతా లక్ష్మణ్… ఆమధ్య పెద్ది సినిమాలో జాన్వికి ఫ్రెండ్ పాత్ర పోషించిందట కదా… ఈ సినిమా గనుక మీకు నచ్చకపోతే నేను అమీర్‌పేట సెంటర్‌లో నిలబడి గుండు గీకించుకుంటాను అని సవాల్ విసిరింది తెలుసు కదా…

సాధారణంగా ప్రేక్షకుల అటెన్షన్ కోసం ఇలాంటి పిచ్చి సవాళ్లను హీరోలు, దర్శకులు చేస్తుంటారు… అదయ్యేది కాదు, పొయ్యేది కాదు… జనం నవ్వుకుంటున్నారు, దీంతో ఈసారి హీరోయిన్‌తో చేయించారు ఈ సవాల్… నిజంగా సినిమా నచ్చలేదు… అంత బాగాలేదు… మరిప్పుడు..?

చాలామందికి ఓ హీరోయిన్ బజారులో గుండు గీకించుకుంటే చూద్దామనే ఉంది… అమీర్‌పేటలో మంచి మంచి సెలూన్లు కూడా ఉన్నాయి… ఐతే ఇక్కడ చిన్న మీమాంస ఆమెను క్షమించేయొచ్చు అనిపిస్తుంది… సినిమాలో నిజంగానే ఆమె బాగా నటించింది… చివరలో కాస్త ఏడిపిస్తుంది కూడా… మంచి పాత్రలు పడాలే గానీ బాగా షైన్ కూడా అవుతుంది ఈ పిల్ల… సో, వద్దులేమ్మా, గుండు గీకించుకోకు, అస్సలు బాగుండదు మొహం…

సినిమా విషయానికి వస్తే… సాదాసీదా ప్రేమకథ ఇంటర్వెల్ దాకా… మొగుడి ఉద్యోగం పోయాక సోషల్ ఒత్తిళ్లు కొన్ని ఎదురవుతాయి, భార్యాభర్తల నడుమ గొడవలు… అంత థ్రిల్లింగ్, ఎంటర్‌టెయినింగ్ కథనం ఏమీ కాదు… కథ కూడా ముందుకూవెనక్కీ నడుస్తూ ఉంటుంది… నాన్ లీనియర్ పోకడ అంటారు కదా, అలా…

పలుచోట్ల ల్యాగ్… నిజానికి ఇది కాస్త ఎక్కువ నిడివి ఉన్న షార్ట్ ఫిలిం తరహా… కొన్ని పాత సినిమాల ఛాయలు కనిపిస్తుంటాయి, కాకపోతే ఎక్కడా అసభ్యత జోలికి పోలేదు దర్శకుడు, బతికించాడు… సినిమాకు బలం ఏదైనా ఉందీ అంటే అది హీరోయిన్ నటనే… సో, వద్దమ్మా, 7’Clock బ్లేడ్ వద్దులేమ్మా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతా కాలమహిమ- చంద్రబాబా మహత్తు- ఆ లీలలెన్న తరమా !?
  • ‘యాదాద్రి’పై రేవంత్ రెడ్డి కొరడా ! కేసీయార్ నిర్వాకాలే అసలు తలనొప్పి !!
  • రజినీ ఒక్కడు చాలదా..? మరీ ఇన్ని కామియోలు ఎందుకురా బుజ్జా..!!
  • కట్టి, కూల్చి, మళ్లీ కట్టి… కేసీయార్ మార్క్ ‘ఇంజినీరింగ్ అద్భుతం’…
  • మళ్లీ తెరపైకి బనకచర్ల ! చంద్రబాబు తమిళనాడు నుంచి నరుక్కొస్తున్నాడా..!?
  • జాతీయ పరీక్షల్లో AI సాయం ! నందన్ నీలేకని ప్రతిపాదన భేష్ !!
  • గజల్ శ్రీనివాస్ అంటేనే… గజలియత్‌కు ఓ అవమానం, ఓ కళంకం !!
  • ఓ సామాజిక కథతో మళ్లీ కలిసిన సీతారాముల జంట!
  • ఈ జెండాలు స్పష్టంగానే కుట్ర హెచ్చరికల్ని జారీ చేస్తున్నయ్!!
  • పొలిటికల్ రిపోర్టింగ్ ఎన్నో జీవితసత్యాల్ని ‘అక్షరాలా’ కళ్లకుగట్టింది !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions